For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి

|

దేశవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీస్‌లు కలిగి ఉన్న ఇండియా పోస్ట్ వివిధ రకాల ఆర్థిక సేవలను కూడా అందిస్తోంది. పోస్టాఫీస్ విభాగం వివిధ రకాల వడ్డీ రేట్లతో తొమ్మిది సేవింగ్స్ పథకాలు అందిస్తోంది. క్వార్టర్లీ ప్రాతిపదికన సవరించబడిన చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వ వడ్డీ రేట్లకు అనుగుణంగా పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మారుతుంటాయి. పోస్టాఫీస్ అందించే స్కీంలలో మంత్లీ సేవింగ్స్ స్కం (MIS) ఒకటి.

మీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరికమీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరిక

వడ్డీ రేటు 7.6 శాతం

వడ్డీ రేటు 7.6 శాతం

పోస్టాఫీస్ వెబ్‌సైట్ ఇండియాపోస్ట్.గవ్.ఇన్. ప్రకారం... పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీం (MIS) వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఈ స్కీంను ఇండివిడ్యువల్స్ ఎవరైనా చెక్కు లేదా క్యాష్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. క్యాష్ అయితే అదే రోజు ఈ స్కీంలో ఈ మంత్లీ సేవింగ్స్ స్కీం అకౌంట్ తెరిచినట్లు. చెక్కు అయితే మాత్రం ఖాతాలో డబ్బులు పడినప్పటి నుంచి అకౌంట్ తెరిచినట్లుగా పరిగణిస్తారు.

ఖాతాకు కనిష్ట, గరిష్ట పరిమితి

ఖాతాకు కనిష్ట, గరిష్ట పరిమితి

ఖాతా తెరిచేందుకు కావాల్సిన కనీస మొత్తం రూ.1,500. సింగిల్ అకౌంట్ గరిష్ట పరిమితి రూ.4.5 లక్షలు. జాయింట్ అకౌంట్ అయితే గరిష్ట పరిమితి రూ.9 లక్షలు. మంత్లీ సేవింగ్స్ స్కీం అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ అయిదేళ్లు.

మెచ్యూరిటీ పీరియడ్‌కు ముందు ఎన్‌క్యాష్ అయితే...

మెచ్యూరిటీ పీరియడ్‌కు ముందు ఎన్‌క్యాష్ అయితే...

అకౌంట్ తెరిచిన ఏడాది తర్వాత డిపాజిట్ మొత్తాన్ని ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. అయితే మూడేళ్లకు ముందు చేస్తే 2 శాతం, ఆ తర్వాత అయిదేళ్ల వరకు (మెచ్యూరిటీ పీరియడ్) ఒక శాతం తగ్గింపు ఉంటుంది. అంటే మీ డిపాజిట్ నుంచి ఆ మేర తగ్గించి ఇస్తారు.

నామినేషన్ ఫెసిలిటీ

నామినేషన్ ఫెసిలిటీ

ఈ మంత్లీ సేవింగ్స్ స్కీంను ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు. ఖాతా తెరిచే సమయంలో, తెరిచిన తర్వాత నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ స్కీం చిన్న మొత్తాల సేవింగ్స్ స్కీం. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల ఆదాయం కూడా పొందవచ్చు.

రికరింగ్ డిపాజిట్ చేస్తే..

రికరింగ్ డిపాజిట్ చేస్తే..

మంత్లీ ఇన్‌కం స్కీం ప్రారంభించాలని భావిస్తే అయిదేళ్ల కాలానికి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దీనిపై వడ్డీ రాబడి పొందవచ్చు. పదవీ విరమణ చేసినవారు, ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్న వారికి ఇది మంచి స్కీం. మంత్లీ ఇన్‌కం స్కీంలో పెట్టుబడి చేసిన తర్వాత వచ్చే నెలవారీ ఆదాయంతో రికరింగ్ డిపాజిట్ చేస్తే మరింత లాభం.

English summary

ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి | Post office monthly income scheme pays 7.6% interest

One of the savings scheme offered by India Post is the Monthly Income Scheme (MIS). Investment in the post office Monthly Income Scheme fetches interest at the rate of 7.6​ per cent with effect from July 1, according to the post office website, indiapost.gov.in.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X