For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిచ్‌గా రిటైర్ అవ్వాలనుకుంటే ఇలా చేయండి..

By Jai
|

యుక్త వయసులో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియని వారు చాలా మంది ఉంటారు. ఎంత డబ్బు వస్తే అంత విలాసాలు, సరదాల కోసం ఖర్చు చేస్తుంటారు. మంచి ఉద్యోగం చేస్తున్నా తమ భవిష్యత్ కోసం కొంత దాచిపెట్టాలన్న ధ్యాస లేకుండా కూడా కొంత మంది ఉంటారు. ఇలాంటి వారు తమ రిటైర్మెంట్ తర్వాత అనేక ఇబ్బందుల పాలవుతారు. వారి లైఫ్ స్టైల్ కు అనుగుణంగా చేతిలో డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంటారు. డబ్బు రావడానికి ఉద్యోగం ఉండరు. ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఏమి చేయాలో తెలియదు. ఏమైనా ఆస్తులు కూడబెడితే వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అనుకుంటే ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. మీరు సంపాదిస్తున్నప్పటి నుంచే రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ చేసుకుంటే ముదిమి వయస్సునూ దర్జాగా బతక వచ్చు. నెల వారీగా పెన్షన్ అందుకుంటూ జీవితాన్ని సాఫీగా గడిపేయవచ్చు.

సరైన ప్లాన్ ను ఎంచుకోండి

* అనేక బీమా కంపెనీలు పెన్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటిలో మీకు ఏది నచ్చితే దాన్ని ఎంచుకోవచ్చు.
* ఈ ప్లాన్లలో చేరే వయసు ఒక్కో కంపెనీకి ఒక్కో విధంగా ఉంటుంది. కనిష్ట వయసు 18 ఏళ్లుగా ఉంటుంది.
* పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులు పెట్టే వారి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. అందుకు అనుగుణమైన ప్లాన్లను అందుబాటులోకి తెచ్చారు. అవి..

డిఫర్డ్ యాన్యుటీ

డిఫర్డ్ యాన్యుటీ

* రెగ్యులర్ లేదా సింగిల్ ప్రీమియం ద్వారా పాలసీ కాలానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పాలసీ కాలపరిమితి తీరిన తర్వాత పెన్షన్ మొదలవుతుంది.

2. ఇమ్మీడియేట్ యాన్యుటీ

* ఇందులో పెన్షన్ తక్షణమే మొదలవుతుంది. ఇందుకోసం ఏక మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

3. విత్ కవర్, వితౌట్ కవర్ పెన్షన్ ప్లాన్స్

* విత్ కవర్ పాలసీలో బీమా రక్షణ ఉంటుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే పాలసీ మొత్తాన్ని కుటుంబ సబ్యులకు అందిస్తారు. అయితే పెన్షన్ కోసం ప్రీమియంలో ఎక్కువ మొత్తాన్ని మళ్లించడం వల్ల కవరేజీ సొమ్ము తక్కువగా ఉంటుంది. వితౌట్ కవర్ ప్లాన్లో బీమా రక్షణ ఉండదు. ఒకవేళ పాలసీదారు మృతి చెందితే అప్పటి వరకు జమైన సొమ్మును నామినీకి చెల్లిస్తారు.

4. గ్యారంటీడ్ పీరియడ్ యాన్యుటీ

4. గ్యారంటీడ్ పీరియడ్ యాన్యుటీ

* దీని ప్రకారం 5, 10, 15, 20 ఏళ్లకు చెల్లింపులు చేస్తారు.

5. లైఫ్ యాన్యుటీ

* ఈ ప్లాన్ కింద పాలసీదారు మృతి చెందే వరకు చెల్లింపులు చేస్తారు. భార్య లేదా భర్త పేరును ఎంచుకుంటే పాలసీదారు మృతి చెందినా వారి భార్య లేదా భర్తకు పెన్షన్ సొమ్ము

చెల్లిస్తారు.

6. నేషనల్ పెన్షన్ స్కీం

* దీన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం లో పెట్టుబడులను ఈక్విటీ, డేట్ మార్కెట్లోకి మళ్లిస్తారు. రిటైర్మెంట్ తర్వాత 60 శాతం సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. మిగతా 40 శాతం యాన్యుటీ కొనుగోలు కోసం వినియోగించాలి. మెచ్యురిటీ సొమ్ము పై పన్ను ఉండదు.

7. పెన్షన్ ఫండ్స్

* ఇందులో పెట్టుబడుల ద్వారా మంచి రిటర్న్ పొందవచ్చు. ఈ పెన్షన్ ఫండ్ నిర్వహణ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆరు కంపెనీలను ఫండ్ మేనేజర్లుగా అనుమతించింది.

రిటైర్మెంట్ ప్లాన్ అవసరమేనా?

రిటైర్మెంట్ ప్లాన్ అవసరమేనా?

* ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. పెద్దకుటుంబాలు అయితే వయసు మీరిన తర్వాత ఏదో విధంగా జీవితాన్ని గడిపేయవచ్చు.కానీ చిన్న కుటుంబాలు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు.

* 60 దాటిన తర్వాత పని చేసే ఓపిక ఉండరు.

*ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వాటికి తగినంతగా సొమ్ము అవసరం ఉంటుంది.

* సంపాదన లేక పోయినా ఖర్చులు మాత్రం తగ్గవు కాబట్టి అందుకు అనుగుణంగా సొమ్ము ఉండాలి. ఇందుకు పెన్షన్ ప్లాన్లు దోహద పడతాయి.

English summary

రిచ్‌గా రిటైర్ అవ్వాలనుకుంటే ఇలా చేయండి.. | How to retire rich?

How to retire rich with pension schemes. Take the age you start your pension and halve it. Put this % of your pre tax salary aside each year until you retire.
Story first published: Monday, July 8, 2019, 7:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X