For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు తీసుకో... కారు కొనుక్కో..

|

మన దేశంలో మధ్య తరగతి వారి సంఖ్య చాలా పెరుగుతోంది. వీరి కోరికలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. వీరిలో చాలామంది కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంత మంది తమ హోదా కోసం మరికొంత మంది తమ సౌకర్యం కోసం కారును కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు కార్లను కొనుగోలు చేసే వారికి రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో కార్ల కొనుగోలు దారులు ఇబ్బందులు లేకుండా తమ కలను నెరవేర్చుకుంటున్నారు. మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి బ్యాంకులు సులభంగా రుణాన్ని ఇచ్చేస్తున్నాయి.

సెకండ్ హ్యాండ్ కారుకు కూడా?

సెకండ్ హ్యాండ్ కారుకు కూడా?

కొత్త కార్లకే కాకుండా సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు రుణాలను ఇస్తున్నాయి. అయితే ఈ రుణాలపై వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ కారు ధరపై మాత్రమే రుణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇతర ఖర్చులను కారు కొనుగోలు దారు భరించాల్సి ఉంటుంది.

ఎంత రుణం పొందవచ్చు ?

ఎంత రుణం పొందవచ్చు ?

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు కారు ఆన్ రోడ్ ధరపై 80 శాతం నుంచి 90 శాతం వరకు రుణాన్ని అందిస్తాయి. కొన్ని బ్యాంకులు కారు ఎక్స్ షోరూమ్ ధరపై వంద శాతం రుణాన్ని ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి.కారు ధర, రకాన్ని బట్టి కూడా రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్ ఫీజుకు రుణం వర్తించదు.

ఏయే పత్రాలు సమర్పించాలి ?

ఏయే పత్రాలు సమర్పించాలి ?

ఇతర రుణాల మాదిరిగానే కారు రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్వయంగా సంతకం చేసిన పాత్రలను ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో ఆదాయ ధ్రువీకరణ పత్రం, అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యూమెంట్, పాన్ కార్డు, అవసరమైతే ఆధార్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఆర్ధిక సంస్థలు మరిన్ని పాత్రలను కూడా కోరవచ్చు.

రుణ కాలపరిమితి ఎంత ఉంటుంది?

రుణ కాలపరిమితి ఎంత ఉంటుంది?

రుణ కాలపరిమితిని కారు కొనుగోలుదారు ఎంచుకోవచ్చు. ఇది ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. మన చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి రుణ కాలపరిమితిని నిర్ణయించుకోవచ్చు. తక్కువ రుణ కాలపరిమితి ఉంటే ఎక్కువ మొత్తంలో నెలవారీ వాయిదాల మొత్తాన్ని చెల్లించాలి ఉంటుంది. ఎక్కువ కాలపరిమితి ఉంటే తక్కువ చెల్లించాల్సి ఉంటుందన్న మాట.

ఆదాయం ఎంత ఉండాలి?

ఆదాయం ఎంత ఉండాలి?

కొన్ని బ్యాంకులు వేతన జీవులకు వారి ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని రుణాన్ని ఇస్తుంటాయి. మరికొన్ని వ్యక్తుల ఖాతాల్లోని సొమ్మును ఆధారంగా చేసుకొని రుణం ఇస్తాయి. ఇందుకు తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది.

*రుణం పొందడానికి క్రెడిట్ స్కోర్ చాలా కీలకంగా మారుతుంది. ఒక వేళ మీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోతే రుణ దరఖాస్తు తిరస్కరణకు గురికావచ్చు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ రేటు విషయంలో కాస్త బేరమాడవచ్చు.

* ఒకవేళ మీరు ఇప్పటికి బ్యాంకు నుంచి వేరే రుణం తీసుకుని ఉన్నట్టయితే మీ చెల్లింపు తీరు బ్యాంకు అధికారులకు తెలుస్తుంది. కాబట్టి వడ్డీ రేటు విషయంలో కాస్త పునరాలోచించమని కోరవచ్చు.

* నిధుల వ్యయ ఆధారిత వడ్డీ రేటు ఆధారంగా బ్యాంకులు కారు రుణ వడ్డీ రేటును నిర్ణయిస్తుంటాయి. కాబట్టి భారత రిజర్వ్ బ్యాంకు రేపో రేటును మార్చితే కార్ల రుణాలపై వడ్డీ రేట్లు మారుతాయి.

* కారు రుణం తీసుకున్న గృహ రుణం తీసుకున్న వారి మాదిరిగా ఎలాంటి పన్ను ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉండదు.

ముందే చెల్లించవచ్చా?

ముందే చెల్లించవచ్చా?

* గృహ రుణం మాదిరిగానే కారు రుణాన్ని కూడా ముందుగానే చెల్లించే సదుపాయం ఉంటుంది. అయితే ఇందుకు కొన్ని నిభందనలు ఉంటాయి.

* కాలపరిమితి కన్నా ముందుగానే రుణాన్ని చెల్లిస్తే బ్యాంకులు కొంత పెనాల్టీ చార్జీ లను విధించడానికి అవకాశం ఉంటుంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కారు రుణం తీసుకోవచ్చు.

English summary

అప్పు తీసుకో... కారు కొనుక్కో.. | Buy a car with loan amount

Get loan on your car value with flexible EMI repayment options, and quick disbursal of loans.
Story first published: Monday, July 15, 2019, 18:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X