For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను ప్లానింగ్ లో జీవిత బీమా ఎంత కీలకమో తెలుసా!

By Jai
|

వేతన జీవులు ఒక ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే పన్ను ప్లానింగ్ ను మొదలుపట్టడం మంచిది. లేకపోతే తర్వాత కంగారు పడాల్సి వస్తుంది. హడావిడిలో కొంతమంది తమకు ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందో చూసుకోకుండా ఏదో ఒక పన్ను ఆదా పెట్టుబడి పెడుతుంటారు. ఆ తరువాత నాలుక్కర్చుకుంటారు. అయితే మీరు ఎంచుకునేది మీకు ఈకువగా ప్రయోజనం కలిగించేదిగా ఉండాలి. అది మీ సంపదకు రక్షణను కల్పించడంతో పాటు విలువను పెంచేవిధంగా, పన్నును ఆదా చేసేలా ఉండాలి. అలాంటివాటిని ఎంచుకోవాలి.

ఇందులో భాగంగా ఎక్కువ మంది ఎంచుకునేది జీవిత బీమానే. దురదృష్ట వశాత్తు ఏమైనా జరిగితే కుటుంబానికి ఆర్ధిక రక్షణను కల్పించే లక్ష్యంతోనే చాలా మంది జీవిత బీమాకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ బీమా పాలసీల్లో టర్మ్ ప్లాన్లు, మనీ బ్యాక్ ప్లాన్లు, జీవిత కాల పాలసీలు, యూనిట్ లింక్డ్ బీమా పాలసీలు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్లు పూర్తిగా రక్షణను కల్పిస్తాయి. వీటికి చెల్లించే బీమా తక్కువగా ఉంటుంది కానీ బీమా రక్షణ మాత్రం ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల బీమా పాలసీల వల్ల ప్రయోజనాలు ఏవిధంగా ఉన్నప్పటికీ ఆదాయ పన్ను శాఖ మాత్రం అన్నింటినీ ఒకే విధంగా పరిగణిస్తుంది.

Tax benefits on Insurance is very important

పన్ను ప్రయోజనాలు
* జీవిత బీమా పాలసీల కోసం ఒక ఆర్ధిక సంవత్సరంలో చెల్లించే ప్రీమియం మొత్తానికి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద గరిష్టంగా రూ. 1,50,000 వరకు ఈ మినహాయింపు ఉంటుంది. సొంత పాలసీతో పాటు భార్య/భర్త, పిల్లలకు చెల్లించే ప్రీమియం దీని పరిధిలోకి వస్తుంది.

* పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్ ను ఎంచుకుని ఉంటే సెక్షన్ 80సీసీసీ కింద రూ. 1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే మెచ్యూరిటీ వరకు సమకూరిన మొత్తంలో మూడింట రెండువంతులపై పన్ను ఉంటుంది. మిగతా మూడింట ఒక వంతుపై మాత్రం పన్ను ఉండదు.

* బీమా కలిగి ఉన్న వ్యక్తి దురదృష్ట వశాత్తు మరణిస్తే నామినీ పొందే సొమ్ముపై సెక్షన్ 10 డీ కింద పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది.

* ఇతర పొదుపు పథకాల మాదిరిగా కాకుండా బీమా పథకాలపై ఎక్కువగా పన్ను ప్రయోజనం ఉంటుంది. పెట్టుబడి పెట్టె సొమ్ముపై, పెట్టుబడిపై వచ్చే రాబడిపై, చివరకు పొందే మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

సరైన బీమా కవరేజీని ఎంచుకోవడం ఎలాగంటే?
* జీవిత బీమా అనేది మిగతా ఆర్ధిక ఉత్పత్తులకన్నా భిన్నమైనది ముందు గుర్తుంచుకోవాలి. దీని వల్ల బీమా పాలసీ తీసుకున్న వారికి రక్షణ లభిస్తుంది. మీ పాలసీ గడువు ముగిసే వరకు మీపై ఎలాంటి ఆర్ధిక భాద్యతలు ఉంటాయో దృష్టిలో ఉంచుకొని సమ్ అష్యురెన్సు ను ఎంచుకోవాలి.

* నిర్దేశిత కాలం తర్వాత లాయల్టీ బోనస్, వడ్డీ లభిస్తుంది. ఈ పాలసీలపై అవసరమైతే రుణం కూడా పొందవచ్చు. కాబట్టి ఇలాంటి ప్లాన్లను ఎంచుకునే ముందు మీకు ఎక్కువ ప్రయోజనం దేని ద్వారా లభిస్తుందో తెలుసుకొని ఎంచుకోవాలి.

*మీ వార్షిక ఆదాయం, మీ పై ఉన్న ఆర్థిక భాద్యతలు, మీ వయస్సు, కుటుంబ ఆర్ధిక పరిస్థితి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని బీమా పాలసీని ఎంచుకోవాలి.

English summary

పన్ను ప్లానింగ్ లో జీవిత బీమా ఎంత కీలకమో తెలుసా! | Tax benefits on Insurance is very important

Premium paid for life and medical insurance policies can be used to claim tax benefit under Section 80C and Section 80D of the Income Tax Act.
Story first published: Sunday, June 30, 2019, 8:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X