For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిలో పెట్టుబడితో మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు..

By Jai
|

వేతన జీవులు పన్ను అదా కోసం పలు రకాల పొదుపులు చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం తగిన విధంగా ప్రణాళికలు చేసుకోక పోవడం వల్ల ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. కానీ పన్ను ఆదాకు కు ఉపయోగ పడే పెట్టుబడులు చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అవేమిటంటే...

కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ఉందా?కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ఉందా?

ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్

ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్

ఈఎల్ఎస్ఎస్ (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్) కాస్త రిస్కుతో కూడుకున్నవే. అయితే దీని ద్వారా పన్ను ఆదా చేసుకునే మొత్తాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ కింద చేసే మీ పెట్టుబడుల్లో అధిక శాతం ఈక్విటీ సంబంధిత ఉత్పత్తుల్లో పెట్టుబడిగా పెడతారు. వీటిని అనుభవం కలిగిన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. ఈఎల్ఎస్ఎ పెట్టుబడులను క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్) లేదా ఏక మొత్తంగా పెట్టవచ్చు. దీని లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి వాటితో పోల్చితే ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. రూ. 500 తోను ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈఎల్ఎస్ఎస్ లో పెట్టిన పెట్టుబడిపై ఆదాయ పన్ను చట్టంలోని 80 సి కింద గరిష్టంగా మొత్తం వార్షిక ఆదాయంలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపును పొందవచ్చు. రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టడంద్వారా గరిష్టంగా రూ. 46,800 వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఈఎల్ఎస్ఎస్ లో రూ. 1.50 లక్షల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ పన్నును తగ్గించు కోవాలనుకునేవారెవరైనా ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘ కాలంలో దీని ప్రతిఫలాలు అందుకోవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా

వేతన జీవులకే కాకుండా వేతనాలు పొందని వారికి కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మంచి పెట్టుబడి మార్గం గా చెప్పవచ్చు. ఇది దీర్ఘకాలికమైనది. ఇందులో పెట్టుబడిపై ఆదాయ పన్ను చట్టంలోని 80 సి కింద పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. గరిష్టంగా పన్ను మినహాయింపు రూ. 1.50 లక్షలు. పీపీఎఫ్ లాకిన్ పీరియడు 15 సంవత్సరాలు. అవసరం అనుకుంటే దీన్ని మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఈ ఖాతాను తెరిచినా ఐదేళ్ల తర్వాత ఖాతాలో సొమ్ములో కొంత మొత్తాన్ని అవసరమనుకుంటే ఉపసంహరించుకునే అవకాశము ఉంటుంది. పీపీఎఫ్ మెచ్యురిటీ తర్వాత వచ్చే సొమ్ముపైన కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్ పై రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది. పీపీఎఫ్ పై ఖాతాపై ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేటును సవరిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 30 వరకు వడ్డీ రేటును 8 శాతంగా నిర్ణయించారు.

పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు

పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు

పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల లాంటివే. అయితే వీటికి లాకిన్ పీరియడ్ ఉంటుంది. అది ఐదేళ్లు. వీటిపై 80 సి కింద మినహాయింపు లభిస్తుంది. బ్యాంకులు విభిన్న రకాల టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. వీటిపై వడ్డీ రేటు కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది. అయితే ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై మాత్రం పన్ను ఉంటుంది. తక్కువ రిస్కుతో మంచి రిటర్న్ రావాలని కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఇది సరైనదిగా చెప్పవచ్చు.

English summary

వీటిలో పెట్టుబడితో మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు.. | Invest in ELSS, PPF and tax exemption FD

Tax saver fixed deposit (FD) is a type of fixed deposit, by investing in which, you can get tax deduction under section 80C of the Indian Income Tax Act, 1961.
Story first published: Tuesday, June 18, 2019, 15:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X