For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిచ్‌గా రిటైర్ కావాలనుకుంటున్నారా?: అందుకు 5 సులభ మార్గాలు

|

వేతనజీవులు, మధ్య తరగతి వారు తమ రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ మొత్తాన్ని వెనుకేసుకోవాలని భావిస్తారు. ఇందుకు వారు ఉద్యోగం లేదా వ్యాపారం చేసే సమయంలోనే వెనుకేయాలి. రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ మొత్తం వెనుకేసుకోవాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఇది సుదీర్ఘంగా ఉపయోగకరంగా ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే అప్పుడప్పుడు కొంత మొత్తంతో లాంగ్ పీరియడ్‌కు ఇన్వెస్ట్ చేయడం సులభంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికతో రిచ్‌గా రిటైర్మెంట్ కావొచ్చు.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

సరైన ప్లాన్

సరైన ప్లాన్

సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. మన ఆదాయంతో పాటు సమీప భవిష్యత్తులో వచ్చే అవసరాలను, తప్పనిసరిగా అయ్యే ఖర్చులను పరిగణలోకి తీసుకొని ప్లాన్‌గా ముందుకు వెళ్లాలి. బ్లూప్లింట్ ఉంటే ఆయాచిత, ప్లాన్ లేకుండా వచ్చే ఖర్చులు తెలుస్తుంది.

ఇన్వెస్ట్ చేశాక ఖర్చు

ఇన్వెస్ట్ చేశాక ఖర్చు

దాదాపు ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కారు లేదా బైక్ లేదా ఇల్లు కొనుగోలు చేయాలని, అలా వెకేషన్‌కు వెళ్లాలని ఉంటుంది. పిల్లలను మంచి స్కూల్స్‌లలో చదివించాలని భావిస్తారు. వీటి కోసం చాలామంది లోన్లు తీసుకుంటారు. ఆ తర్వాత వడ్డీతో కలిపి కడతారు. కానీ ముందుగానే సేవ్ చేస్తే, మీరు సేవ్ చేసిన దానికి వడ్డీ కూడా వస్తుంది. అంటే మొదట ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత ఖర్చు చేయడం ఉత్తమ మార్గం. అంతేకాకుండా, ఇన్వెస్ట్ చేశాకే ఖర్చు చేస్తే కచ్చితమైన ప్లాన్ కారణంగా అనవసర ఖర్చులు ఉండవు.

అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి

అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి

ప్రతి ఒక్కరు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. ఇంటి రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటి ఫిక్స్డ్ ఖర్చులపై ప్లాన్ ఉండాలి. అనవసరంగా బయట చేసే ఫుడ్ ఖర్చులను ఎంత తగ్గిస్తే అంత మంచిది. షాపింగ్, వెకేషన్స్, పార్టీలు, గెట్ టుగెదర్ ఇతర ఫన్ రిలేటెడ్ ఖర్చుల విషయంలో ప్లాన్‌గా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ అంశానికి ఇంతకంటే ఖర్చు ఎక్కువ కావొద్దు అని ముందే నిర్ణయించుకోవాలి.

ఆదాయ మార్గాలు పెంచుకోండి

ఆదాయ మార్గాలు పెంచుకోండి

ఆదాయ మార్గాలు ఒక్కటి కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. సింగిల్ జాబ్ చేయడంతో పాటు వివిధ మార్గాల ద్వారా సంపాదన ఉంటే అది ఎంతో ప్రయోజనకరం. 9-5 ఉద్యోగం చేసేవారు మరో మూడు నాలుగు గంటలు కేటాయించి మరో ఆదాయ మార్గంపై దృష్టి పెట్టడం మంచిది.

ఇన్వెస్ట్

ఇన్వెస్ట్

మీ సంపాదనలో కొంతమొత్తాన్ని ప్రణాళికతో ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెండ్లీ రికమెండేషన్స్, బంధువులు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారని ఆయాచితంగా పెట్టుబడి పెట్టవద్దు. మొదట మీ అవసరాలు చూసుకొని ముందుకెళ్లాలి. ట్రెండ్స్ ఆధారంగా గుడ్డిగా ఇన్వెస్ట్ చేయవద్దు. తెలుసుకోకుండానే లాభం వస్తుందని ఇన్వెస్ట్ చేయవద్దు. ఆలోచించి, అన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి.

English summary

రిచ్‌గా రిటైర్ కావాలనుకుంటున్నారా?: అందుకు 5 సులభ మార్గాలు | Want to retire rich? Here are 5 smart ways

Being adequately rich at the time of retirement is one of the few dreams of the salaried class and middle-income people. In order to have a sufficient amount of funds after retirement, individuals are required to save money during the tenure of their job life.
Story first published: Monday, May 6, 2019, 14:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X