For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

By Jai
|

నేటి తరం జీవన శైలి మారింది. ఉరుకులు పరుగుల జీవితమే అందరిదీ. చేస్తున్న ఉద్యోగం, ఆ ఉద్యోగ పనివేళలు భిన్నంగా మారిపోయాయి. సమయానికి సరిగ్గా తినే పరిస్థితి లేదు. తింటున్న ఆహారంలోనూ అనేక రకాల మిశ్రమాలు. రోజులో కనీసం గంట సేపు వ్యాయామం లేదా నడి చేసేందుకు కూడా సమయం లేని బద్ద కస్తులు పెరిగి పోతున్నారు. అందుకే చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, షుగర్ వంటివి ఒంటిని పట్టి వేధిస్తున్నాయి. ఇవికాకుండా ప్రాణాలను తోడేసే కేన్సర్లు, జ్వరాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రాణాంతక వ్యాధులకు కూడా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అందుకు అయ్యే ఖర్చు భరించే ఆర్ధిక స్థోమత ఉండాలి. కొన్ని వ్యాధుల చికిత్స కోసం ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పని సరిగా ఆరోగ్య బీమా తీసుకోవాల్సిందే. ఈ బీమా తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అవేంటంటే...

సమగ్ర బీమా ఎంపిక

సమగ్ర బీమా ఎంపిక

ఆరోగ్య బీమా పాలసీలను 25కు పైగా బీమా కంపెనీలు అందిస్తున్నాయి. ఈ మార్కెట్లో రెండువందల పైగా పోలసీలున్నాయి. ఈ పాలసీలను ఆన్ లైన్ ద్వారా లేదా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు తీసుకునే పాలసీ సమగ్రంగా ఉండాలి. ఎందుకంటే వ్యాధుల చికిత్సకు వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టి మీరు ఆస్పత్రిలో చేరినప్పుడు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా మీ బిల్లు చెల్లించే పాలసీ తీసుకోవాలి. మెడికల్ వ్యయాలు, హాస్పిటలైజషన్ వ్యయాలు, మెడికేషన్, లేబొరేటరీ టెస్ట్ వ్యయాలు కవరయ్యే పాలసీ తీసుకోవాలి. మీరు పాలసీ తీసుకునే ముందే అన్ని వివరాలు తెలుసుకోవాలి.

పోల్చిచూసుకోవాలి..

పోల్చిచూసుకోవాలి..

అన్ని బీమా కంపెనీల పాలసీలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఒక పాలసీతో ఇంకొక పాలసీని పోల్చి చూసుకునే అవకాశం ఉంటుంది. ఆయా బీమా పాలసీలు సంబంధించి సమాచారాన్ని కొన్ని వెబ్ సైట్లు కూడా అందిస్తున్నాయి. వీటిలో ఆయా పాలసీల వాళ్ళ కలిగి ప్రయోజనాలు, అలాంటి వాటికి కవరేజి ఉండదనే వివరాలు స్పష్టంగా ఉంటాయి. కొన్ని బీమా కంపెనీలు పాలసీ కొనుగోలు చేసిన కొంతకాలం దాకా బీమా కవరేజి ని ఇవ్వవు. కొన్ని కంపెనీలు హాస్పిటల్ బెడ్ చార్జీలు, అంబులెన్సు వ్యయాలు, టెస్టుల వ్యయాలు భరించడానికి కొర్రీలు పెడుతుంటాయి. అందుకే పాలసీ తీసుకునే ముందే అన్ని వివరాలు తెలుసుకోవాలి. మీరు బీమా పాలసీ కొనుగోలు చేయాలనుకునే కంపెనీ చరిత్రతో పాటు ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఒక్కసారి పరిశీలించాలి.

ఏది దాచవద్దు...

ఏది దాచవద్దు...

బీమా ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని కొంతమంది తమకు ముందునుంచి ఉన్న ఆరోగ్య ససమస్యల గురించి చెప్పారు. ఆస్పత్రిలో చేరినప్పుడు వ్యాధి ఎప్పటి నుంచి ఉందొ నిర్ధారణ అవుతుంది కాబట్టి బీమా కంపెనీ మీ ఆస్పత్రి ఖర్చులను భరించడానికి ముందుకు రాక పోవచ్చు. అందుకే ఆరోగ్య సమస్యలకు సంబందించిన వివరాలను దాచవద్దు.

బీమా పాలసీలో రకాలు

బీమా పాలసీల్లో పలు రకాలున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్, సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్స్, సర్జరీ-క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు, మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్సు, పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ వంటివి ఉన్నాయి.

ఫ్యామిలీ పాలసీ బెటర్...

వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం కన్నా కుటుంబ సభ్యులకు కలిపి బీమా పాలసీ తీసుకోవడం మంచిది. బీమా పాలసీ ప్రీమియం మొత్తం కూడా తగ్గుతుంది.

20 శాతం మందికే ఆరోగ్య బీమా

20 శాతం మందికే ఆరోగ్య బీమా

మన దేశంలో ఆరోగ్య బీమాపై అవగాహన ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీ గడువు ఏడాది ఉంటుంది. ఈ ఏడాదిలో తమకు ఏమి కానీ పక్షంలో బీమా కోసం అనవసరంగా సొమ్ము చెల్లించామని అనుకునే వారే ఎక్కువగా ఉంటారు. జీవిత బీమా కోసం చెల్లించిన సొమ్ము నిర్ణీత కాలం తర్వాత చేతికి అందుతుంది. బీమా గడువు లోపు వ్యక్తి మరణిస్తే ఆ సొమ్ము నామినీకి అందుతుంది. కానీ ఆరోగ్య బీమాలో మాత్రం చెల్లించిన బీమా సొమ్ము వెనక్కి రాదు. ఆ ఏడాదిలో హాస్పిటల్ లో చేరితే అందుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది. మనదేశంలో కేవలం 20 శాతం మందికే ఆరోగ్య బీమా ఉందట. పట్టణాల్లో 18 శాతం మంది, గ్రామాల్లో 14 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య బీమా కవరేజి కలిగి ఉన్నారట.

English summary

ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. | Things to know before buying Health Insurance Plan for your Family

A family health insurance policy is specially formulated to fulfill the health insurance needs of your entire family.
Story first published: Saturday, May 18, 2019, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X