For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NPS స్కీం: రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.5,000: దరఖాస్తు ఎలా?

|

నేషనల్ పెన్షన్ సిస్టం (NPS)లో 65 ఏళ్ల వరకు చేరవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA) రెండేళ్ల క్రితం వయో పరిమితిని 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. వృద్ధులకు ఆదాయ భద్రత కోసం NPS మంచి ప్లాట్‌ఫారం. అరవై ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సులోని వారి కంటే మెరుగైన యాన్యుటీ రేట్ ఉంటుంది.

ప్రయివేటు సెక్టార్ ఉద్యోగులు (అల్ సిటిజన్ మోడల్ మరియు కార్పోరేట్ మోడల్) NPS చేరేందుకు వయస్సును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. అంతకుముందు 18-60 ఏళ్ల మధ్య వయస్సుగలవారు NPSలో చేరేందుకు అర్హత ఉండేది.

PMJJBYని ఎందుకు రెన్యూవల్ చేయించుకోవాలి?PMJJBYని ఎందుకు రెన్యూవల్ చేయించుకోవాలి?

65 ఏళ్లు అయితే ఇలా...

65 ఏళ్లు అయితే ఇలా...

అరవై ఏళ్ల తర్వాత NPSలో చేరినవారు 70 ఏళ్ళ వరకు కొనసాగించవచ్చు. అరవై ఏళ్లకు ముందు NPSలో జాయిన్ అయినటువంటి వారిలాగే వీరికి కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఛాయిస్, పెన్షన్ ఫండ్ చాయిస్ ఉంటాయి.

NPS కాలిక్యులేషన్ ప్రకారం ఎస్పీఐ పెన్షన్ ఫండ్ ఇలా ఉంది. 65 ఏళ్ల వయస్సులో NPS స్కీం ప్రారంభించి 70 ఏళ్ళ వరకు నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నెలకు రూ.4924 వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ రేటు 8 శాతం. పెన్షన్ రూపంలో మనకు వచ్చే సొమ్ము ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా నెలకు రూ.10,000 చెల్లిస్తే వారు నెలకు రూ.3939 పొందుతారు. నెలకు రూ.5000 చెల్లిస్తే రూ.1969 పెన్షన్ వస్తుంది.

NPS ఖాతా ఇలా తెరవండి?

NPS ఖాతా ఇలా తెరవండి?

ఆదాయపన్ను మినహాయింపుకు NPS తోడ్పడుతుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులను ఇది ఆకర్షిస్తుంది. NPS ఖాతా తెరిచేందుకు 73 ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. వీటినే పాయింట్ ఆప్ ప్రెసెన్స్ అంటారు. NPS సేవలు మరింతమందికి విస్తరించేందుకు పాయింట్ ఆప్ ప్రెసెన్స్ ... మరిన్ని శాఖలను ఏర్పాటు చేశాయి. NPS ఖాతాను దరఖాస్తు ఫారంతో కేవైసీ పత్రాలు సమర్పించడం ద్వారా ఆఫ్‌లైన్లో, ఆన్‌లైన్లో అయితే ఈ-ఎన్పీఎస్ ఖాతా ద్వారా తెరవచ్చు. NPS ఖాతాను తెరిచాక తొలుత కొంత సొమ్ము జమ చేయాలి. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపవచ్చు. కొన్ని పాయింట్ ఆప్ ప్రెసెన్స్‌లు ఆన్‌లైన్ చెల్లింపు వెసులుబాటు కల్పిస్తున్నాయి.

పాన్‌కార్డ్

పాన్‌కార్డ్

ఆన్‌లైన్‌లో NPS ఖాతా తెరిచేందుకు మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఉండాలి. మరికొన్ని డాక్యుమెంట్లు అవసరమవుతాయి. కేవైసీ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు ఉండాలి. కేవైసీని పూర్తి చేసేందుకు మీ ఐడెంటిటీ, బర్త్ డేట్, అడ్రస్‌లకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. పాన్‌కార్డ్ తప్పనిసరి కాదు. దీనినిఈ-ఎన్పీఎస్ ఖాతాగా పేర్కొంటారు. రిజిస్ట్రేషన్ దరఖాస్తు పూర్తయ్యాక, ప్రాసెస్ అనంతరం NSDL నుంచి ఓ వెల్‌కం కిట్ వస్తుంది. దీంతో పాటు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (PRAN) కార్డు కేటాయిస్తారు.

English summary

NPS స్కీం: రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.5,000: దరఖాస్తు ఎలా? | National Pension System: Subscribe till 65!

National Pension System (NPS) age limit. You can become an NPS subscriber till the age of 65. The age limit was increased by the Pension Fund Regulatory Authority of India (PFRDA) two years ago.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X