For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ: ఎలిజిబులిటీ, బెనిఫిట్స్, ప్రీమియం వివరాలు

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వివిధ రకాల టర్మ్, ఎండోమెంట్ ఇన్సురెన్స్ ప్రోడక్ట్స్, పెన్షన్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. అలాంటి ఇన్సురెన్స్‌లలో న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ ఒకటి. అనుకోకుండా మృతి చెందితే ఫైనాన్షియల్ ప్రొటక్షన్ అందిస్తుంది. పాలసీ టర్మ్‌ను బట్టి చివరలో పెద్ద మొత్తంలో వస్తుంది.

రిచ్‌గా రిటైర్ కావాలనుకుంటున్నారా?: అందుకు 5 సులభ మార్గాలురిచ్‌గా రిటైర్ కావాలనుకుంటున్నారా?: అందుకు 5 సులభ మార్గాలు

న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ఎలిజిబులిటీ

న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ఎలిజిబులిటీ

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన వారు తీసుకోవచ్చు. కనీస హామీ లక్ష రూపాయలు. న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కింద గరిష్టంగా పరిమితి లేదు. కనీస పాలసీ టర్మ్ 15 ఏళ్లు. గరిష్ట పాలసీ టర్మ్ 35 ఏళ్లు. గరిష్ట మెచ్యూరిటీ ఏజ్ 75 సంవత్సరాలు.

ప్రీమియంలు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ లేదా మంత్లీగా చెల్లించవచ్చు. ఏదైనా పాలసీ ల్యాప్స్ అయితే చెల్లించని ప్రీమియం తేదీ నుంచి రెండు కాన్సిక్యూటివ్ ఇయర్స్‌లలో యాక్టివ్ చేసుకోవచ్చు. అయితే పాలసీ టర్మ్ పూర్తి కాకముందే దీనిని యాక్టివ్ చేసుకోవాలి. ఇంటరెస్ట్, బకాయిలు అన్ని కలిపి ఆ లోపు చెల్లించాలి.

ఉదాహరణ

ఉదాహరణ

ఓ ఉద్యోగి ఎల్ఐసీ న్యూజీవన్ ఆనంద్ పాలసీని 21 ఏళ్ల టర్మ్‌కు రూ.5,00,000 అస్యూర్డ్ అమౌంట్‌తో ఎంచుకుంటే అతను ఏడాదికి రూ.27,454 ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. పాలసీ పీరియడ్ పూర్తయ్యే వరకు అతనికి రూ.11,.02,000 మొత్తం వస్తుంది. ఒకవేళ అతను మెచ్యురిటీ పీరియడ్‌కు ముందే మృతి చెందితే నామినీకి 125 శాతం వస్తుంది. దీంతో పాటు ఇతర బోనస్ బెనిఫిట్స్ ఉంటాయి.

ఏం అవసరమవుతాయి

ఏం అవసరమవుతాయి

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ట్యాక్స్ బెనిఫిట్స్ కలిగి ఉంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ, సెక్షన్ 10(10డీ) కింద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. న్యూ జీవన్ ఆనంద్ పాలసీని కొనుగోలు చేయడానికి ఈ పత్రాలు అవసరం... ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, మెడికల్ హిస్టరీ, KYC డాక్యుమెంట్స్(ఆధార్, పాన్ కార్డ్, ట్యాక్స్ డిటైల్స్), మెడికల్ డయగ్నోస్టిక్ రిపోర్ట్స్ అవసరం.

Read more about: lic ఎల్ఐసీ
English summary

LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ: ఎలిజిబులిటీ, బెనిఫిట్స్, ప్రీమియం వివరాలు | LIC New Jeevan Anand Plan: Premium, Eligibility, Benefits Here

LIC Policy: LIC New Jeevan Anand Policy can be purchased by any individual between age group of 18 and 50 years for minimum sum assured of Rs.1 lakh.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X