For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా డబ్బు సంపాదించడం ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి?

|

చేతితోలో కొంత డబ్బు ఉంది. దాంతో అప్పుడే అవసరం లేదు. షార్ట్ పీరియడ్ (అంటే నెల, రెండు లేదా ఆరు నెలలు, ఏడాది...)లో అవసరమైన సమయంలో ఆ మొత్తాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దానిని సురక్షితంగా దాచిపెట్టడంతో పాటు దానికి కనీస వడ్డీ వచ్చే పద్ధతులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే అన్నీ చూసుకున్న తర్వాతే డబ్బులు ఆయా చోట్ల ఇన్వెస్ట్ చేయడం మంచిది. చాలామంది లాంగ్ టర్మ్‌లో అంటే.. అయిదేళ్లు, పదేళ్లు.. కోసం పెట్టుబడులు పెడతారు. కొంతమంది షార్ట్ టర్మ్ కావాలనుకుంటారు. ఈ షార్ట్ టర్మ్‌లో కూడా కొంత రిటర్న్స్ వచ్చేవి ఉన్నాయి. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు.

అత్యవసరమా?: 2 రోజుల్లో పాన్‌కార్డ్ పొందడం ఎలా?అత్యవసరమా?: 2 రోజుల్లో పాన్‌కార్డ్ పొందడం ఎలా?

లిక్విడ్ ఫండ్

లిక్విడ్ ఫండ్

ఒకటి రెండు నెలల కోసం మీరు లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇవి డెబ్ట్ మ్యుచువల్ ఫండ్స్. ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కాల్ మనీ వంటి వాటిల్లో పెట్టవచ్చు. రిస్క్ తక్కువగా ఉంటుంది. ఈ ఫండ్స్ మెచ్యూరిటీ పీరియడ్ సాధారణంగా నెల, రెండు నెలలో ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్ ద్వారా 6.5 నుంచి 7 శాతం వరకు ప్రీ ట్యాక్స్ రిటర్స్ పొందొచ్చు. ఇతర పెట్టుబడుల కంటే ఇందులో రిస్క్ తక్కువ.

అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్

అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్

అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కూడా తక్కువ కాలపరిమితి కలిగిన మ్యుచువల్ ఫండ్స్. ట్రెజరీ బిల్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్, కార్పోరేట్ బాండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. మూణ్ణాలుగు నెలల కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కొన్ని అల్ట్రా షార్ట్ టర్మ్ మ్యుచువల్ ఫండ్స్ ఆరు నెలల నుంచి ఏడాది వరకు కూడా ఉంటాయి.

ఆర్బిటేజ్ ఫండ్

ఆర్బిటేజ్ ఫండ్

ఆర్బిటేజ్ ఫండ్స్.. క్యాష్, ఫ్యూచర్ మార్కెట్‌ను అనుసరించి ఉంటాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టేముందు అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవడం మంచిది. అవి మీకు సరిపోతాయో చూసుకోవాలి. ఆర్బిటేజ్ ఫండ్స్ కూడా ఒకరకమైన మ్యుచువల్ ఫండ్. కొనుగోలు చేసి ధరలు పెరిగిన తర్వాత విక్రయించవచ్చు. అయితే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కంటే ఇవి ఎక్కువ రిస్క్. అలాగే ఈక్విటీ ఫండ్స్ కంటే తక్కువ రిస్క్.

షార్ట్ టర్మ్ ఫండ్

షార్ట్ టర్మ్ ఫండ్

ఆరు నుంచి తొమ్మిది నెలలు, ఏడాది కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే లిక్విడ్, ఆర్బిట్రేజ్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కంటే ఇది ఎక్కువ రిస్క్. ఇందులో 7 నుంచి 7.25 శాతం వరకు రిటర్స్ వస్తాయి.

English summary

త్వరగా డబ్బు సంపాదించడం ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి? | Investments: How to earn money fast!

Best Ultra short term funds are very short term Mutual Funds that invest in a combination of debt instruments including treasury bills, certificate of deposits, commercial papers and corporate Bonds.
Story first published: Sunday, May 26, 2019, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X