For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5వ తేదీ తర్వాత నష్టపోతారు: PPF డిపాజిట్స్‌పై ఎక్కువ వడ్డీ ఎలా పొందాలి?

|

2019-20 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ సమయంలో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తారు. మీరు తరుచూ ఇన్వెస్ట్ చేసేవారైనా, కొత్తగా సేవింగ్ చేద్దామని భావించేవారైనా పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)ను ఎంచుకోవడం మంచిది. ఇది ఈఈఈ (EEE - మినహాయింపు - మినహాయింపు - మినహాయింపు) కిందకు వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ డిపాజిట్లకు గ్యారెంటీ ఉంటుంది. ఇది భద్రత కలిగినది. అలాగే, ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. పీపీఎప్ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఏప్రిల్ - జూన్ మాసానికి పీపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. వడ్డీ రేటును ప్రతి క్వార్టర్‌కు రివైజ్ చేస్తారు. ఇక్కడ ఆకర్షణీయమైన వడ్డీ మీరు తెలివిగా డిపాజిట్ చేయవలసి ఉంటుంది.

మీరు ఉద్యోగస్తులా? అయితే పిపిఎఫ్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 15 ముఖ్యమైన విషయాలు!మీరు ఉద్యోగస్తులా? అయితే పిపిఎఫ్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 15 ముఖ్యమైన విషయాలు!

వడ్డీ రేటు

వడ్డీ రేటు

పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రతి నెల లెక్కిస్తారు. కానీ క్రెడిట్ అయ్యేది మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌లో మాత్రమే. మార్చి 31వ తేదీన క్రెడిట్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే మినిమం బ్యాలెన్స్ పైన ప్రతి నెల 5 లోపు, నెల చివరలో వడ్డీని లెక్కిస్తారు. ప్రతి నెల 5వ తేదీలోపు ప చేస్తేనే వడ్డీ వస్తుంది. 5వ తేదీ తర్వాత చెల్లిస్తే.. కనుక మీ మినిమం బ్యాలెన్స్ పైన మీరు వడ్డీని నష్టపోవాల్సి ఉంటుంది. వడ్డీ రేటును మినిమం బ్యాలెన్స్ X 8 శాతంగా లెక్కిస్తారు.

నెల డిపాజిట్ (రూ.లలో) 5వ తేదీ లోపు డిపాజిట్ చేసే మినిమం బ్యాలెన్స్‌పై (రూ.లలో) నెలకు వడ్డీ (రూ.లలో) 5వ తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే మినిమం బ్యాలెన్స్‌పై (రూ.ల్లో) నెలకు వడ్డీ (రూ.లలో)
ఏప్రిల్ 10,000 10,000 66.67 0 0
మే 10,000 20,000 133.33 10,000 66.67
జూన్ 10,000 30,000 200.00 20,000 133.33
జూలై 10,000 40,000 266.67 30,000 200.00
ఆగస్ట్ 10,000 50,000 333.33 40,000 266.67
సెప్టెంబర్ 10,000 60,000 400.00 50,000 333.33
అక్టోబర్ 10,000 70,000 466.67 60,000 400.00
నవంబర్ 10,000 80,000 533.33 70,000 466.67
డిసెంబర్ 10,000 90,000 600.00 80,000 533.33
జనవరి 10,000 100,000 666.67 90,000 600.00
ఫిబ్రవరి 10,000 110,000 733.33 100,000 666.67
మార్చి 10,000 120,000 800.00 110,000 733.33
మొత్తం 120,000 మొత్తం 5,200.00 మొత్తం 4,400.00
మీరు ఎంత నష్టపోతారు

మీరు ఎంత నష్టపోతారు

పైన లెక్క ప్రకారం చూస్తే, ప్రతి నెల 5వ తేదీలోపు డిపాజిట్ చేయకుంటే రూ.800 వందలు కోల్పోతారు. ఒకవేళ మీరు రూ.1,20,000 పెద్ద మొత్తం బ్యాంకులో వేయాలనుకున్నా 5 ఏప్రిల్ వేయాలి. అప్పుడు మీకు ఒక నెల వడ్డీ (8 శాతం) కలిసి వస్తుంది.

నిబంధనలు

నిబంధనలు

ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎవరైనా 12 కంటే ఎక్కువగా డిపాజిట్స్ చేయరాదు. అకౌంట్ యాక్టివ్‌గా ఉండేందుకు ఏడాదికి కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌లు ఏడాదికి రూ.1.50 లక్షలకు మించవచ్చు. కానీ అలాంటి డిపాజిట్లపై వడ్డీ ఉండదు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం. మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు ఉంటుంది.

Read more about: ppf public provident fund
English summary

5వ తేదీ తర్వాత నష్టపోతారు: PPF డిపాజిట్స్‌పై ఎక్కువ వడ్డీ ఎలా పొందాలి? | How to earn maximum interest on PPF deposits?

As the new financial year begins, you may be planning on some investments for 2019-20. If you are a conservative investor or new to savings instruments, you can choose PPF (public provident fund) which enjoys the EEE (exempt-exempt-exempt) tax status and comes with a government guarantee on your deposits. It is secure and tax exemption can be claimed at the time of deposit as well as maturity.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X