For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిసాన్ వికాస్ పత్ర: ఇక్కడ డబ్బులు పెడితే తొమ్మిదేళ్లలో రెట్టింపు

|

స్మాల్ సేవింగ్స్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన స్కీం కిసాన్ వికాస్ పత్ర పథకం. 112 నెలల్లో అంటే 9 సంవత్సరాల నాలుగు నెలల్లో మీ డబ్బు రెండింతలు అవుతాయి. గతంలో ఇది 118 నెలలుగా ఉండేది. అంటే 9 సంవత్సరాల పది నెలలు. అన్ని పోస్టాఫీసుల్లో కిసాన్ పత్ర ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కిసాన్ అనే పేరు ఉందని రైతులకు మాత్రమే సంబంధించినదిగా భావించవద్దు. అయితే కిసాన్ వికాస్ పత్రాల ద్వారా జమచేసిన పెట్టుబడిని రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. దీర్ఘకాలం సేఫ్టీ, లాభం కోరుకునేవారికి ఇది ఉపయోగకరం.

ఐటీఆర్ దాఖలు చేయడానికి ఇబ్బందా?: ఈ యాప్స్ సహకరిస్తాయి!ఐటీఆర్ దాఖలు చేయడానికి ఇబ్బందా?: ఈ యాప్స్ సహకరిస్తాయి!

 కిసాన్ వికాస పత్రకు ఎవరు అర్హులు అంటే?

కిసాన్ వికాస పత్రకు ఎవరు అర్హులు అంటే?

పద్దెనిమిదేళ్లు నిండిన భారతీయులు దీనికి అర్హులు. అదే విధంగా మైనర్ల పేరిట కూడా పెద్దవారు పెట్టుబడి పెట్టవచ్చు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములు పెట్టుబడి పెట్టే అవకాశముంది. ట్రస్ట్‌లు ఈ కిసాన్ వికాస పత్రాలను కొనుగోలు చేయవచ్చు. ప్రవాస భారతీయులు ఇన్వెస్ట్ చేయలేరు. సర్‌ప్లస్ మనీ ఉండి, సమీప భవిష్యత్తులో అవసరం లేదనుకునే వారు ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో రెండింతలు వస్తాయి.

 కిసాన్ వికాస్ పత్ర అకౌంట్

కిసాన్ వికాస్ పత్ర అకౌంట్

కనీసం రూ.1000 మొత్తంతో కిసాన్ వికాస్ పత్ర ఖాతాను తెరవవచ్చు. గరిష్టంగా పత్రం విలువ రూ.50వేలు. అయితే ఒక వ్యక్తి ఎన్ని పత్రాలైనా పొందేందుకు వీలుంది. అంటే గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. రూ.50వేలు అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. కిసాన్ వికాస్ పత్ర వార్షిక వడ్డీ 7.7 శాతంగా ఉంది. కిసాన్ వికాస పత్రాలకు లాకిన్ పీరియడ్ రెండు సంవత్సరాల ఆరు నెలలు. ఈ గడువు దాటిన తర్వాత డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. నామినీలుగా ఎవరినైనా ప్రతిపాదించవచ్చు. మీరు ఎప్పుడైనా మార్చుకునే వీలుఉంది. ఈ స్కీంను ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేసేవారు ఈ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం కూడా పొందవచ్చు. గుర్తుంచుకునే మరో విషయం ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపులు ఉండవు.

ఏ పోస్టాఫీస్‌లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు

ఏ పోస్టాఫీస్‌లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు

ఏదైనా పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారంలో వివరాలు నింపాలి. ఇన్వెస్ట్ చేసే వారి ఫోటోలు ఇవ్వాలి. నగదు, చెక్కు, డీడీ ద్వారా డబ్బు చెల్లించవచ్చు. అప్పుడు ఫోటో, పత్రం, ముఖ విలువ, మెచ్యురిటీ తేదీ, మెచ్యూరిటీ సమయానికి రాబడి తదితర వివరాలు కలిగిన సర్టిఫికేట్ జారీ చేస్తారు. అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు.

English summary

కిసాన్ వికాస్ పత్ర: ఇక్కడ డబ్బులు పెడితే తొమ్మిదేళ్లలో రెట్టింపు | What is the interest rate of KVP?

Kisan Vikas Patra (KVP) is a savings scheme available at India Post Offices in the form of certificates. It is a fixed rate small savings scheme that focuses on doubling your investment after a predetermined period of time (112 months in the currently available issue)
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X