For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్15 బ్యాంకుల personal loan వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు EMI వివరాలు ఇలా

|

వివిధ అవసరాల నిమిత్తం ఇప్పుడు ఎంతోమంది పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు బ్యాంకులో అకౌంట్ ఉంటే, అకౌంట్ రెగ్యులర్‌గా మెయింటైన్ చేస్తే మీకు పర్సనల్ లోన్ గురించి తరుచూ ఫోన్లు వస్తుంటాయి. పర్సనల్ లోన్లు పొందడం సులభమే. అయితే కారు లోన్ వంటి వాటి కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. పర్సనల్ లోన్ అన్‌సెక్యూర్డ్ లోన్. ఈ లోన్ తీసుకోవడానికి మీ ఏ ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. బంగారం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే మీ ఆదాయం, క్రెడిట్, రీపేమెంట్ తదితర లెక్కలు వేసి, వాటి సామర్థ్యం ఆధారంగా పర్సనల్ లోన్ ఇస్తారు.

వివిధ రకాల పర్సనల్ లోన్లు ఉన్నాయి. ఉదాహరణకు ఇన్‌స్టాంట్ లోన్. ఇవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్. ఇలాంటివి తీసుకోవడం సులభమే. కానీ తిరిగి చెల్లించడం అంత సులభం ఏమీ కాదు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే వ్యక్తిగత రుణాలకు ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. డిఫాల్టర్‍‌గా ఉంటే వడ్డీ రేటు పెరుగుతుంది. ఇక్కడ టాప్ ప్రయివేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల కొన్ని పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, ఇతర కాస్ట్స్ చూడండి. ప్రాసెసింగ్ ఫీజు ట్యాక్స్ లేకుండా ఇలా ఉన్నాయి.

<strong>నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!</strong>నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

PNB, Alahabad, Uco, IDIB బ్యాంకుల పర్సనల్ లోన్

PNB, Alahabad, Uco, IDIB బ్యాంకుల పర్సనల్ లోన్

- అలహాబాద్ బ్యాంక్ - వడ్డీ రేటు 8.65 నుంచి 13.15 వరకు - రూ.2,059 నుంచి రూ.2,283 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 1.06 శాతం ఉంటుంది. కనీసం రూ.1,068.

- పంజాబ్ నేషనల్ బ్యాంక్ - వడ్డీ రేటు 9.45 నుంచి 15 వరకు - రూ.2,098 నుంచి రూ.2,379 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 1.80 శాతం ఉంటుంది. మరియు అప్లికబుల్ ట్యాక్స్‌లు.

- యూకో బ్యాంక్ - వడ్డీ రేటు 9.80 నుంచి 11.65 వరకు - రూ.2,115 నుంచి రూ.2,207 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 1 శాతం ఉంటుంది. కనీసం రూ.750.

- ఐడీబీఐ బ్యాంక్ - వడ్డీ రేటు 10.15 నుంచి 12.90 వరకు - రూ.2,132 నుంచి రూ.2,270 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 1 శాతం ఉంటుంది. అప్లికబుల్ ట్యాక్స్.

OBC, UBI, Indian Bank, Canara, Yes, Kotak, sbi

OBC, UBI, Indian Bank, Canara, Yes, Kotak, sbi

- ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ - వడ్డీ రేటు 10.50 నుంచి 12.50 వరకు - రూ.2,149 నుంచి రూ.2,250 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 1 శాతం ఉంటుంది. అప్లికబుల్ ట్యాక్స్.

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 10.60 నుంచి 14.60 వరకు - రూ.2,154 నుంచి రూ.2,358 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 0.50 శాతం ఉంటుంది. కనీసం రూ.500 మరియు అప్లికబుల్ ట్యాక్స్.

- ఇండియన్ బ్యాంక్ - వడ్డీ రేటు 10.65 నుంచి 11.25 వరకు - రూ.2,157 నుంచి రూ.2,187 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 0.51 శాతం ఉంటుంది. కనీసం రూ.512.

- కెనరా బ్యాంక్ - వడ్డీ రేటు 10.95 నుంచి 14.10 వరకు - రూ.2,172 నుంచి రూ.2,332 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 2.5 శాతం ఉంటుంది. అప్లికబుల్ ట్యాక్స్.

- కొటక్ మహీంద్రా బ్యాంక్ - వడ్డీ రేటు 10.99 నుంచి 24 వరకు - రూ.2,174 నుంచి రూ.2,877 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 2.5 శాతం ఉంటుంది. అప్లికబుల్ ట్యాక్సులు.

- యస్ బ్యాంక్ - వడ్డీ రేటు 10.99 నుంచి 17.5 వరకు - రూ.2,174 నుంచి రూ.2,512 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 2.5 శాతం ఉంటుంది. కనీసం రూ.999. అప్లికబుల్ ట్యాక్సులు.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 11 నుంచి 17.05 వరకు - రూ.2,174 నుంచి రూ.2,488 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 1 శాతం ఉంటుంది. అప్లికబుల్ ట్యాక్సులు.

 HDFC, ICICI, Indus Ind, Central bank of India

HDFC, ICICI, Indus Ind, Central bank of India

- హెచ్‌డీఎఫ్‌సీ - వడ్డీ రేటు 11.25 నుంచి 20 వరకు - రూ.2,187 నుంచి రూ.2,649 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 2.5 శాతం ఉంటుంది. కనీసం రూ.1,999.

- ఐసీఐసీఐ - వడ్డీ రేటు 11.25 నుంచి 17.99 వరకు - రూ.2,187 నుంచి రూ.2,539 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 2.5 శాతం ఉంటుంది. అప్లికబుల్ ట్యాక్సులు.

- ఇండస్ ఇండ్ బ్యాంక్ - వడ్డీ రేటు 11.25 నుంచి 30.50 వరకు - రూ.2,187 నుంచి రూ.3,266 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 2.5 శాతం ఉంటుంది. కనీసం రూ.1,000 మరియు అప్లికబుల్ ట్యాక్స్‌లు.

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 11.35 నుంచి 20 వరకు - రూ.2,192 నుంచి రూ.2,204 వరకు EMI - ప్రాసెసింగ్ ఫీజు రూ.500 మరియు అప్లికబుల్ ట్యాక్సులు.

English summary

టాప్15 బ్యాంకుల personal loan వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు EMI వివరాలు ఇలా | Top 15 banks that offer the lowest personal loan rates

One must remember that personal loans come with high interest rates, so continuous default will put you on a downward spiral. Here are some personal loan rates and other costs of the top private and public sector banks in India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X