స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ రకాల డెబిట్ కార్డులు జారీ చేస్తోంది. ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. బేసిక్ కార్డ్స్, ప్రీమియమ్ కార్డ్స్. ఎస్బీఐ ప్రీమియం డెబిట్ కార్డు పైన కాంప్లిమెంటరీ ఇన్సురెన్స్ కవర్ ఉంటుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్, పర్చేస్ ప్రొటక్షన్ కవర్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ ఉంటాయి. SBI Gold, SBI Platinum, SBI Pride, SBI Premium, SBI VISA Signature డెబిట్ కార్డ్సు పైన కూడా ఇన్సురెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి.

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ (డెత్) నాన్ ఎయిర్
ఈ ఇన్సురెన్స్ నాన్ ఎయిర్‌లో ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇన్సురెన్స్ కవర్ ఉంటుంది. అంటే విమాన ప్రమాదాల్లో మృతి చెందితే మాత్రం ఇది వర్తించదు. ఆయా ఎస్బీఐ డెబిట్ కార్డులకు ఇన్సరెన్స్ ఇలా ఉంటుంది.
- ఎస్బీఐ గోల్డ్ (మాస్టర్/వీసా) - రూ.2,00,000
- ఎస్బీఐ ప్లాటినమ్ (మాస్టర్/వీసా) - రూ.5,00,000
- ఎస్బీఐ ప్రైడ్ (బిజినెస్ డెబిట్) (మాస్టర్/వీసా) - రూ.2,00,000
- ఎస్బీఐ ప్రీమియం (బిజినెస్ డెబిట్) (మాస్టర్/వీసా) - రూ.5,00,000
- ఎస్బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డు - రూ.10,00,000

పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ (డెత్)
పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ (డెత్): విమాన ప్రమాదంలో మరణిస్తే ఈ పాలసీ ఉంటుంది. అలాగే ఈ పాలసీ ప్రయోజనాలు పొందాలంటే సదరు వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్న ఎస్బీఐ డెబిట్ కార్డుతోనే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకోవాలి. ఇన్సరెన్స్ ఇలా ఉంటుంది.
- ఎస్బీఐ గోల్డ్ (మాస్టర్/వీసా) - రూ.4,00,000
- ఎస్బీఐ ప్లాటినమ్ (మాస్టర్/వీసా) - రూ.10,00,000
- ఎస్బీఐ ప్రైడ్ (బిజినెస్ డెబిట్) (మాస్టర్/వీసా) - రూ.4,00,000
- ఎస్బీఐ ప్రీమియం (బిజినెస్ డెబిట్) (మాస్టర్/వీసా) - రూ.10,00,000
- ఎస్బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డు - రూ.20,00,000

పర్చేస్ ప్రొటక్షన్ ఇన్సురెన్స్
మీరు కొనుగోలు చేసిన గూడ్స్ పైన ఇన్సురెన్స్ ఉంటుంది. దొంగతనం, ఎత్తుకెళ్లడం, వెహికిల్ నుంచి ఎత్తుకెళ్లడం, హౌస్ బ్రేకింగ్ వంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తులు కొనుగోలు చేసిన 90 రోజులలోపు అయితేనే పాలసీ పని చేస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న కార్డు ద్వారా ఉత్పత్తులు కొంటేనే ఈ పాలసీ వర్తిస్తుంది.
- ఎస్బీఐ గోల్డ్ (మాస్టర్/వీసా) - రూ.5,000
- ఎస్బీఐ యువ (వీసా) - రూ.5,000
- ఎస్బీఐ ప్లాటినమ్ (మాస్టర్ కార్డ్/వీసా) - రూ.50,000
- ఎస్బీఐ ప్రైడ్ (బిజినెస్ డెబిట్) (మాస్టర్ కార్డ్/వీసా) - రూ.5,000
- ఎస్బీఐ ప్రీమియం (బిజినెస్ డెబిట్) (మాస్టర్ కార్డ్/వీసా) - రూ.50,000
- ఎస్బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డు - రూ.1,00,000

లాస్ట్ కార్డ్ లయబిలిటీ
మీ కార్డ్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన సమయంలో ఇది వర్తిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా లావాదేవీలు నిర్వహిస్తే ఈ పాలసీ వర్తిస్తుంది. పిన్/ఓటీపీ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితో పాలసీ పని చేయదు.
- ఎస్బీఐ గోల్డ్ (మాస్టర్ కార్డ్/వీసా) - రూ.80,000
- ఎస్బీఐ యువ (వీసా) - రూ.80,000
- ఎస్బీఐ ప్లాటినమ్ (మాస్టర్ కార్డ్/వీసా) - రూ.2,00,000
- ఎస్బీఐ ప్రైడ్ (బిజినెస్ డెబిట్) (మాస్టర్ కార్డ్/వీసా) - రూ.80,000
- ఎస్బీఐ ప్రీమియం (బిజినెస్ డెబిట్) (మాస్టర్ కార్డ్/వీసా) - రూ.2,00,000
- ఎస్బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డు - రూ.4,00,000
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications