For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూజ్డ్ కార్ల కొనుగోలుకు పర్సనల్ లోన్ తీసుకోవడం బెటరా?

By Chanakya
|

యూజ్డ్ కార్ మార్కెట్ ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. రెగ్యులర్ న్యూ కార్ మార్కెట్‌తో పోలిస్తే ఇది రండంకెల వృద్దితో కొనసాగుతోంది. ఆర్గనైజ్డ్ కంపెనీలైన మారుతి ట్రూ వేల్యూ, మహీంద్రా, హుందాయ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాయి. వారెంటీ, సర్వీస్‌తో కార్లను అమ్మడం వల్ల ప్యాసింజర్లు సేఫ్ సైడ్‌లో ఉంటున్నారు. అయితే వీటికి ఉండాల్సిన చిక్కులు కూడా కొన్ని ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ విషయంలో ఇప్పటికే కొన్ని తలనొప్పులున్నాయి. కొత్త కార్లకు దొరికినంత చవకగా యూజ్డ్ కార్లకు రుణాలు దొరకవు. వీటికి తోడు భారీగా వసూలు చేసే వడ్డీ రేట్లు కూడా టెన్షన్ పెడ్తాయి.

రానున్న మూడేళ్లలో మూడో వంతు ఉద్యోగాలు హుష్‌కాకి!రానున్న మూడేళ్లలో మూడో వంతు ఉద్యోగాలు హుష్‌కాకి!

ఏ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్

ఏ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్

కొత్త కార్లకు అవసరమైన రుణం తీసుకునేందుకు ఇంట్రెస్ట్ రేట్ 9.25 నుంచి 9.5 శాతం వరకూ ఉంది. ప్రభుత్వ - ప్రైవేట్ బ్యాంకులు ఈ స్థాయిలో ఇంట్రెస్ట్ రేట్లను అందిస్తున్నాయి. మిగిలిన ఆర్థిక సంస్థలు దీనికంటే పావు, అర శాతం ఎక్కువగా వడ్డీని వసూలు చేస్తున్నా ఇది 10 శాతం లోపే ఉంటుంది. అయితే యూజ్డ్ కార్స్ కొనేందుకు మాత్రం వడ్డీ రేట్లు 3-7 శాతం వరకూ అధికంగా ఉంటాయి.

కాంప్లికేషన్స్ ఎక్కువ

కాంప్లికేషన్స్ ఎక్కువ

కొత్త కార్‌లో కేవలం బారోయర్ క్రెడిట్ రిస్క్ మాత్రమే ఉంటుంది. కాకపోతే యూజ్డ్ కార్‌లో అధిక కాంప్లికేషన్ ఉంటుందనేది కంపెనీల వాదన. ఎందుకంటే ఇందులో కార్ వేల్యుయేషన్, మోడల్, దాని ఏజ్, తిరిగిన కిలోమీటర్లు, బండి కండిషన్ వంటివన్నీ అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఒక వేళ సదరు రుణగ్రహీత లోన్ తీసుకుని డిఫాల్ట్ అయితే అప్పుడు మార్టిగేజ్‌లో ఉన్న కార్‌ను అమ్మి సొమ్ము రికవర్ చేసుకోవడం బ్యాంకులకు కష్టమవుతుంది. అందుకే యూజ్డ్‌కు లోన్ ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి.

ఏ బ్యాంక్ ఎంత వడ్డీ

ఏ బ్యాంక్ ఎంత వడ్డీ

ప్రస్తుతం యూజ్డ్ కార్లకు ఎస్బీఐ 10.75 నుంచి 12.05 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. దీనికి అధనంగా రూ.1500 వరకూ ప్రాసెసింగ్ ఫీజ్‌నూ తీసుకుంటోంది. అందే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే 13.75 నుంచి 16శాతం వరకూ ఇంట్రెస్ట్‌ను,రూ.2500 వరకూ ప్రాసెసింగ్ ఫీజ్ వసూలు చేస్తోంది. వీటికి అదనంగా ప్రీపేమెంట్, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా బాదుతోంది హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కూడా 17 శాతం వరకూ వడ్డీని తీసుకుంటోంది యూజ్డ్ కార్లపైన. ప్రభుత్వ బ్యాంకుల్లో కెనెరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం లోపే వడ్డీని తీసుకుంటున్నా వీటి నుంచి లోన్ పొందడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

మరి పర్సనల్ లోన్ బెస్ట్ ఆప్షనా?

మరి పర్సనల్ లోన్ బెస్ట్ ఆప్షనా?

వాస్తవానికి యూజ్డ్ కార్ లోన్ తీసుకునే కంటే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత లోన్ తీసుకున్నా బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రుణగ్రహీతకు బెటర్ క్రెడిట్ స్కోర్ ఉంటే బెటర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఒక వేళ యూజ్డ్ కార్ - పర్సనల్ లోన్ మధ్య వడ్డీ రేట్ వ్యత్యాసం 1-1.5 శాతం మధ్య ఉంటే పర్సనల్ లోన్‌కే ప్రయార్టీ ఇవ్వడం మంచిది. దీనికి ఫోర్ క్లోజర్ ఛార్జీల తలనొప్పి కూడా ఉండదు. అంతే కాదు కార్ కాస్ట్‌లో 100 శాతాన్ని పూర్తిగా పొందే వీలు కూడా ఉంది. ప్రస్తుతం వ్యక్తిగత రుణాలకు వడ్డీ రేట్ 12 నుంచి 15 శాతం వరకూ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో చూసి యూజ్డ్ కార్లకు వెహికల్ లోన్ తీసుకోండి. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సలహా కూడా తీసుకోండి.

English summary

యూజ్డ్ కార్ల కొనుగోలుకు పర్సనల్ లోన్ తీసుకోవడం బెటరా? | Is it better take Personal loan on used cars?

Avoid paying highest interest rates for used cars by taking personal loan. Here are some important points to check before taking vehicle loan for pre owned vehicle.
Story first published: Tuesday, March 19, 2019, 14:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X