For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓకే ఒక్క పాలసీ తో మీ జీవితాన్ని మార్చేసుకోండి..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే అవడంతో ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే దంపతులిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అంతేకాదు జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరం ఇద్దరికీ సమానంగా ఉంటోంది.

By bharath
|

ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే అవడంతో ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే దంపతులిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అంతేకాదు జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరం ఇద్దరికీ సమానంగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో కుటుంబంలో ఏ ఒక్కరికీ ఏ జరిగినా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తె ఆస్కారం ఉంటుంది.

అందువల్ల పనిచేసే దంపతులిద్దరూ కలిసి ఒకే పాలసీ తీసుకుంటే వారి భవిష్యత్తుకు తగిన భరోసా ఏర్పడుతుంది. కానీ, ఉమ్మడి జీవిత బీమా పాలసీలు తీసుకోవడం వల్ల భాగస్వాములిద్దరికీ బీమా ఉంటుంది. ఇద్దరిలో ఎవరికైనా అనుకోని సంఘటన జరిగినా బీమా పాలసీ పరిహారం అందిస్తుంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో ఇలాంటి పాలసీలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

సాధారణంగా భారత్‌లో దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, భర్తలు తమ పేరుమీద జీవిత బీమా పాలసీలు తీసుకొని, భార్యను నామినీగా పేర్కొంటారు. ఇలాంటి పాలసీల వల్ల కుటుంబంలో ఒక్కరికే బీమా రక్షణ ఉంటుంది. ఇలా కాకుండా విడిగా ఒక్కరి పేరు మీద తీసుకోవడం కన్నా ఇద్దరి పేరు మీద పాలసీ తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి.

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

ఒకటి ప్రీమియం తక్కువగా ఉండటం రెండోది కుటుంబానికి తగిన విధంగా ఆర్ధిక భద్రత కల్పించడం లాంటివి. ప్రస్తుతం మార్కెట్లో ఉమ్మడి జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంది.

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

పాలసీని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. కొన్ని పాలసీలు దంపతులిద్దరిలో ఒకరు మరణించగానే పాలసీ మొత్తాన్ని చెల్లిస్తాయి. మరికొన్ని పాలసీలు పాలసీ మొత్తాన్ని చెల్లించి, కొన్ని నెలల పాటు డబ్బును అందిస్తాయి. ఇప్పటికీ మార్కెట్లో మనీ బ్యాక్‌ లేదా ఎండోమెంట్‌ తరహా పాలసీలే అందుబాటులో ఉన్నాయి.

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

ఒక పాలసీ మీ జీవితాన్ని మార్చుతుంది..!

ఉమ్మడి పాలసీని అందించే సంస్ధలు, పాలసీని బట్టి ప్రీమియం, పాలసీ మొత్తం ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలసీని ఎంపిక చేసుకోవాలి. కొత్తగా వివాహం అయిన వారు ఉమ్మడి జీవిత బీమా పాలసీ తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

Read more about: insurance policy money
English summary

ఓకే ఒక్క పాలసీ తో మీ జీవితాన్ని మార్చేసుకోండి..? | One Insurance Policy For Everything

At present, small families have to work to do their job to get financial support.It is also same for life and health insurance policies for both.
Story first published: Wednesday, December 19, 2018, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X