For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రముఖ బ్యాంకుల్లో మినిమం బ్యాలన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి?

రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల వినియోగదారులకు ప్రతి నెలా యావరేజ్ మినిమం బ్యాలన్స్(AMB) నిర్వహించాల్సిన అవసరం ఉంది.

By bharath
|

రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల వినియోగదారులకు ప్రతి నెలా యావరేజ్ మినిమం బ్యాలన్స్(AMB) నిర్వహించాల్సిన అవసరం ఉంది.AMB అనేది వారి సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాలలో బ్యాంకు ఖాతాదారులకు అవసరమైన కనిష్ట డిపాజిట్లు. పట్టణ, మెట్రో, పాక్షిక పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్ల ఖాతా యొక్క స్థానం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి), హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకుల్లో మినిమం బ్యాలన్స్ నెలవారీ నిలువ ఉంచాలి. బ్యాంకులు వారి పొదుపు ఖాతాలో నెలవారీ బ్యాలెన్స్ నిర్వహించడంలో విఫలమైన వినియోగదారుల నుండి పెనాల్టీని వసూలు చేస్తాయి.

ఎస్బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి), హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్లలో సగటు నెలవారీ బ్యాలెన్స్ పోలిక:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)

మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న ఎస్బిఐ బ్రాంచీలలో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ..3,000 రూపాయలు నిలువ ఉండాలని దాని అధికారిక వెబ్ సైట్- sbi.co.in లో తెలిపింది.పాక్షిక పట్టణ మరియు గ్రామీణ శాఖలలో ఎస్బీఐ పొదుపు ఖాతాల ఖాతాదారులు కనీస సగటు బ్యాలన్స్ రూ.2,000 మరియు రూ. 1,000, రూపాయలు నిర్వహించాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB):

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB):

మెట్రో, పట్టణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఉన్న PNB లో ఉన్న సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నవారు కనీస త్రైమాసిక సగటు బ్యాలెన్స్ రూ. 2,000 రూపాయలు అని దాని అధికారిక వెబ్సైటు- pnbindia.in లో తెలిపింది. గ్రామీణ శాఖలలో పొదుపు ఖాతాల ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ రూ. 1,000 రూపాయలు నిర్వహించాలి.

హెచ్డిఎఫ్సి బ్యాంక్

హెచ్డిఎఫ్సి బ్యాంక్

మెట్రో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖల్లో సాధారణ పొదుపు ఖాతా కలిగిన వినియోగదారులు సగటున నెలసరి బ్యాలెన్స్ రూ.10,000 రూపాయలు ఉండాలని బ్యాంక్ తన అధికారిక వెబ్ సైట్- hdfcbank.com లో తెలిపింది. సెమీ పట్టణ శాఖలలో, సాధారణ పొదుపు ఖాతాదారులు సగటున రూ.5,000 రూపాయలు ప్రతి నెల నిర్వహించాలని తెలిపింది. గ్రామీణ శాఖలు, వినియోగదారులు సగటున త్రైమాసిక బ్యాలెన్స్ (AQB). రూ.2,500 రూపాయలు నిర్వహించాలి లేదా స్థిర డిపాజిట్ కనీసం ఒక సంవత్సరం మరియు ఒక రోజు పరిపక్వత కోసం రూ.10,000 రూపాయలు ఉండాలి.

ICICI బ్యాంక్

ICICI బ్యాంక్

మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచీలలో సాధారణ పొదుపు ఖాతాను కలిగి ఉన్న ఖాతాదారులు సగటు నెలవారీ బ్యాలన్స్ రూ. 10,000 ఉండాలని బ్యాంకు అధికారిక వెబ్సైట్- icicibank.com లో తెలిపింది.పాక్షిక పట్టణ,రూరల్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో సగటు నెలసరి బ్యాలెన్స్ రూ. 5,000 మరియు రూ. 2,000 మరియు రూ.1,000 రూపాయలు.

Read more about: minimum balance banks sbi
English summary

ప్రముఖ బ్యాంకుల్లో మినిమం బ్యాలన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి? | Minimum Balance Rules Of Top Banks Explained Here

Regular savings bank accounts require customers to maintain a certain average monthly balance (AMB) every month. AMB is the minimum average of deposits required by the bank customers in their regular savings bank accounts.
Story first published: Monday, December 17, 2018, 11:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X