For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు కొత్త కారు కొంటున్నారా..ఐతే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి?

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు మనలో చాలా మంది కొత్త కారుని కొనుగోలు చేద్దామనే ఆలోచనలో ఉంటారు. ఇప్పటికే ఏ కారు కొనాలి? అనేది ముందుగానే నిర్ణయించుకుని ఉంటారు.

By bharath
|

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు మనలో చాలా మంది కొత్త కారుని కొనుగోలు చేద్దామనే ఆలోచనలో ఉంటారు. ఇప్పటికే ఏ కారు కొనాలి? అనేది ముందుగానే నిర్ణయించుకుని ఉంటారు. అయితే కొత్త కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తే మంచిదా లేదా ఏక మొత్తంలో ఒకేసారి నగదు చెల్లించి కొనుగోలు చేస్తే మంచిదా అని ఆలోచిస్తుంటారు.

నిపుణుల ప్రకారం కారు కొనాలని అనుకున్నప్పుడు ఎంతో కొంత సొమ్ముని సిద్ధం చేసుకుని మిగతా సొమ్ము కోసం కారు లోన్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అందు కోసం రుణం ఎంత తీసుకోవాలి? తర్వాత ఏ బ్యాంకును సంప్రదించాలి? అనేది నిర్ణయించుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకుని ఎంచుకోవాలి. దీంతో పాటు పండుగ సీజన్‌లో కారు ఉత్పత్తిదారులే స్వయంగా అనేక రాయితీలను ప్రకటిస్తుంటారు. డీలర్లు సైతం రకరకాల ఆఫర్లు అందిస్తారు. ఇలాంటి వాటిని అందిపుచ్చుకుంటే మీకు కాస్త డబ్బు ఆదా అవుతుంది.

కారు డెలివరీ ముంది:

కారు డెలివరీ ముంది:

కారు కోనుగోలు విషయంలో అన్ని లాంఛనాలూ పూర్తయి, ఇక కారును డెలివరీ తీసుకోవడమే మిగిలిందా? ఈ సమయంలో మీరు కారును పూర్తి స్థాయిలో పరిశీలించాలి. దీనినే ప్రీ డెలివరీ ఇన్‌స్పెక్షన్‌ (పీడీఐ) అంటారు. సాధారణంగా డీలర్లే దీనిని నిర్వహిస్తుంటారు. కానీ, మన వంతు బాధ్యతగా కారుని పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకోవాలి.

క్షుణ్నంగా తనిఖీ చేయాలి

క్షుణ్నంగా తనిఖీ చేయాలి

కారు లోపలా, బయటా క్షుణ్నంగా తనిఖీ చేయాలి. లోపల భాగాల్లో ఎక్కడైనా దుమ్ము పట్టి ఉందా? పూర్తిగా శుభ్రంగా ఉన్నాయా? చూసుకోండి. సాధారణంగా షోరూంలో ఉండే కొత్త కారు 50 కిలోమీటర్లకు మించి తిరగదు. ఒకవేళ 50 కిలోమీటర్లకు మించి తిరిగితే అందుకు కారణం అడిగి తెలుసుకోండి.

కారు గురించి అన్ని వివరాలూ

కారు గురించి అన్ని వివరాలూ

కారుతోపాటు అదనపు టైరు, టూల్‌ కిట్‌ వస్తాయి. దీనికి తోడుగా మీరు బిగించుకునే అదనపు విడిభాగాలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా సరి చూసుకోండి. దీంతో పాటు షోరూంలో ఉండే వారి వద్ద నుంచి మీ కారు గురించి అన్ని వివరాలూ అడిగి తెలుసుకోండి.

 కారుకు సంబంధించిన

కారుకు సంబంధించిన

చివరగా మీ కారుకు సంబంధించిన పూర్తి బిల్లులను తీసుకోవడం మర్చిపోకండి. దీంతో పాటు కారు బీమా పత్రాలను కూడా తీసుకోండి. వాహనానికి సంబంధించి అదనపు తాళంచెవి, వారంటీ పత్రాలు అన్నీ తీసుకోండి. వాహన రిజిస్ట్రేషన్‌, రోడ్డు పన్నుకు సంబంధించిన పత్రాలనూ మర్చిపోకండి.

Read more about: loan car loan
English summary

మీరు కొత్త కారు కొంటున్నారా..ఐతే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి? | These Rules Should Follow Before Buying A New Car

Consumer ‘sentiment’ has improved and to tap into this opportunity, car makers are ready with several new launches, and attractive deals to go with them. Most cars are bought on loan; almost 80%, say experts.
Story first published: Tuesday, November 13, 2018, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X