For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు! మీకోసం కొన్ని జాగ్రతలు మరియు పాలసీలు!

By Sabari
|

ముందుగా సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.

నెల్లూరు జిల్లాలో

నెల్లూరు జిల్లాలో

నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

వర్షాకాలం

వర్షాకాలం

ఇది వర్షాకాలం తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. అయితే వర్షాల వల్ల మానవాళికి ఎంతటి మేలు జరుగుతుందో.. అంతటి నష్టాలూ ఉంటాయనేది తెలిసిందే. భారీ వర్షాల వల్ల చేతికి అందివచ్చే పంటలే కాదు.. వినియోగ వస్తువులకూ నష్టం వాటిల్లే ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా బైకులు, స్కూటర్లు, ఆటోలు, కార్లు వంటివి అనుకోకుండా వర్షం, వరదల్లో చిక్కుకుపోయి వినియోగదారులు నష్టపోయే సందర్భాలూ ఎదురవుతుంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయా వాహనాలకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే.. అందుకు రక్షణగా నిలిచే బీమా పాలసీలూ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం!

 బీమా పాలసీ

బీమా పాలసీ

వానాకాలంలో రోడ్లు చిత్తడిగా ఉండటం, గుంతలు పడటం, రోడ్డుమీద నీళ్లు నిలబడటం వల్ల జరిగే ప్రమాదాలకు తోడు జోరు వర్షం పడుతుంటే సరిగా కనిపించక, రెండు వాహనాలు ఢకొీనడం లాంటి సంఘటనలూ చూస్తుంటాం. సాధారణ రోజుల్లో కంటే వర్షాకాలంలో 15-20 శాతం వాహన క్లెయింలు అధికంగా ఉండటం బీమా సంస్థలు దృష్టిలో ఉన్నదే. అనుకోకుండా ప్రమాదం జరిగినా, వాహనం పాడైనా బీమా పాలసీ నుంచి పరిహారం కోసం అనుసరించాల్సిన మార్గాలేమిటో తెలియాలి.

ముందుగా కొన్ని జాగ్రత్తలు

ముందుగా కొన్ని జాగ్రత్తలు

వాహనాలకు బీమా చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అలా తీసుకున్న పాలసీ వివరాలు, పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవడమూ చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్‌ పత్రాల విషయంలోనే కాదు, వర్షాకాలంలో వాహనం విషయంలోనూ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వాహనానికి ఉన్న బీమా పాలసీ డిజిటల్‌ కాపీని మీ ఈ మెయిల్‌ బాక్స్‌లో ఉండేలా చూసుకోండి. వాహన బీమా పాలసీపత్రం వాన నీటిలో తడిచిపోతే ఈ డిజిటల్‌ కాపీ ఉపయోగపడుతుంది. బీమా సంస్థకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లు, ఈ మెయిల్‌ లాంటివి మీ ఫోన్‌లో ఉండేలా చూసుకోవాలి.

క్లెయిమ్స్‌ ఇలా చేసుకోండి

క్లెయిమ్స్‌ ఇలా చేసుకోండి

వర్షాకాలంలో బీమా సంస్థలకు ప్రమాదాలకు సంబంధించిన క్లెయిములే ఎక్కువగా వస్తుంటాయి. ప్రధానంగా తడిగా ఉన్న రోడ్లపై వాహనం పట్టు కోల్పోయి, ప్రమాదానికి గురైనవే ఉంటాయి. చాలామంది చిన్న చిన్న వాటికీ క్లెయిం చేస్తుంటారు. క్లెయిం చేసేప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది.. పాలసీ ఏడాదిలో ఎలాంటి క్లెయిం లేకుంటే.. మరుసటి ఏడాది పునరుద్ధరణ సమయంలో 20-50 శాతం వరకూ నో క్లెయిం బోనస్‌ లభిస్తుంది. ఒకసారి క్లెయిం చేసుకుంటే.. ఈ బోనస్‌ పోతుంది. కాబట్టి, క్లెయిం చేసుకునే ముందు.. ఈ నో క్లెయిం బోనస్‌, మీ క్లెయిం మొత్తం రెండింటి మధ్య ఎంత తేడా ఉందో చూసుకోండి. ఆ తర్వాతే క్లెయిం చేసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి.

ఉదాహరణకు

ఉదాహరణకు

పూర్తిస్థాయి బీమా పాలసీ తీసుకున్నప్పుడు అటు వాహనానికీ, ఇటు థర్డ్‌ పార్టీకి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం లభిస్తుంది. అయితే, వర్షపు నీటి వల్ల జరిగిన నష్టానికి ఎలాంటి పరిహారమూ వర్తించకపోవచ్చు. ఉదాహరణకు, వాన నీరు నిలిచిన ప్రాంతంలో బండి చిక్కుకుపోయినప్పుడు. ఇలాంటప్పుడు వాహనానికి నష్టం వాటిల్లినప్పుడు, ప్రత్యేక పాలసీల ద్వారా రక్షణ లభిస్తుంది.

వాహన సమస్యలు

వాహన సమస్యలు

వరద నీటిలో చిక్కుకొని, వాహనం ఇంజన్‌ పాడయినప్పుడు పరిహారం వచ్చేందుకు 'ఇంజన్‌ ప్రొటెక్ట్‌' పాలసీని అనుబంధంగా తీసుకోవాలి. కొన్నిసార్లు వాహనం రోడ్డుపైన ఆగిపోవచ్చు. ఇలాంటప్పుడు సమీపంలోని మరమ్మతు కేంద్రం వరకూ దాన్ని తీసుకెళ్లేందుకు 'రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌' పాలసీ ఉపయోగ పడుతుంది. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లూ ఈ పాలసీ ద్వారా అందుతుంది. అలాగే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు.. కారుకు పూర్తి పరిహారం లభించేలా 'జీరో డెప్రిసియేషన్‌' తోడ్పడుతుంది. ముఖ్యంగా మీ కారు మూడేళ్లలోపుదే అయితే.. కచ్ఛితంగా ఇది ఉండేలా చూసుకోండి.

కారు విలువ ఎంత ఉందో చూసుకొని, దానికి తగ్గట్టుగా బీమా విలువ ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు ప్రీమియం తగ్గుతుందన్న ఉద్దేశంతో తక్కువ విలువకు పాలసీ తీసుకుంటారు. ఇది సరికాదు. ప్రమాదంలో కారుకు పూర్తిగా నష్టం వాటిల్లినా.. లేదా దొంగతనం జరిగినా.. తక్కువ బీమా ఉంటే.. మన జేబు నుంచి భరించాల్సి వస్తుంది. దీనిని నివారించేందుకు కారుకు పూర్తి విలువతో పాలసీని తీసుకోవడమే మేలు.

48 గంటల్లోగా బీమా

48 గంటల్లోగా బీమా

కారు లేదా బైక్‌ ప్రమాదానికి గురైనా వర్షపు నీళ్లల్లో పడి కొట్టుకుపోయినా లేదా నీళ్లల్లో మునిగిపోయినా ముందుగా రోడ్డుపైన సురక్షిత ప్రదేశానికి తరలించాలి. సంఘటన జరిగిన 48 గంటల్లోగా బీమా సంస్థకు విషయాన్ని తెలియజేయాలి. జరిగిన నష్టం ఏమిటి? ఎక్కడ, ఏ సమయంలో ఎలా జరిగిందనే విషయాన్ని వివరించాలి. ప్రమాదంలో ఎవరైనా గాయపడిన వారు, డ్రైవింగ్‌ ఎవరు చేస్తున్నారు తదితర వివరాలూ నమోదు చేయించాలి. సంఘటన తాలూకు ఫొటోలు తీసుకొని పెట్టుకోవడమూ మంచిది.

క్లెయిం ఫారంతోపాటు మనం ఇచ్చిన సమాచారం ఆధారంగా వినియోగదారుడి క్లెయిం దరఖాస్తును స్వీకరించాలా? తిరస్కరించాలా? అనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ప్రమాదానికి దారితీసిన సందర్భాన్ని విశ్లేషించేందుకు కొన్ని సందర్భాల్లో బీమా సంస్థ ఆ ప్రదేశాన్ని తనిఖీ చేస్తుంది. కాబట్టి, బండిని మరమ్మతుల కోసం తరలించేప్పుడు బీమా సంస్థకు విషయం తెలియజేయాలి. బీమా సంస్థ నుంచి వచ్చిన సర్వేయర్‌ వచ్చి, నష్టాన్ని అంచనా వేసేవరకూ వాహనాన్ని మరమ్మతు చేయించడంగానీ, విడిభాగాలను విప్పదీయడంగానీ చేయకూడదు.

పాలసీపై అవగాహన ఉండాలి

పాలసీపై అవగాహన ఉండాలి

కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఇంజన్‌ పనిచేయకుండా మొరాయిస్తుంది. అలాంటి సందర్భాల్లోనూ బలవంతంగా దాన్ని స్టార్ట్‌ చేయాలని ప్రయత్నిస్తే మరోభాగం దెబ్బతింటుంది. ప్రమాదం లేదా వర్షపు నీరు.. ఇలా సందర్భం ఏదైనా సరే.. వాహనదారుడు చేయాల్సిన పనేమిటంటే.. మంచి మెకానిక్‌కు చూపించాలి. వాహనాన్ని వేరే వాహనానికి కట్టి, దగ్గర్లోని గ్యారేజీకి తరలించాలి. ఇంజన్‌ను పూర్తిగా పరీక్షించి, అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు మాత్రమే నడిపేందుకు ప్రయత్నించాలి. దీంతోపాటు సాధారణ వాహన బీమా పాలసీకి అదనంగా 'ఇంజన్‌ ప్రొటెక్టర్‌, రోడ్‌ సైడ్‌ అసిస్టెంట్‌' తదితర అనుబంధ పాలసీలను తీసుకోవడం మేలు

ఆన్‌లైన్లో

ఆన్‌లైన్లో

ప్రస్తుతం అంతా డిజిటలే. చాలామంది చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉంటాయి. దీనికి తగ్గట్టుగా బీమా సంస్థలూ డిజిటల్‌ సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. యాప్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. పాలసీ తీసుకోవడం, పునరుద్ధరణ, క్లెయిం చేసుకోవడం అంతా ఫోన్‌ నుంచే చేసుకోవచ్చు. దీనివల్ల పాలసీదార్లకు చాలా సమయం కలిసొస్తుంది. క్లెయిం సమాచారాన్ని నమోదు చేయడమూ ఎంతో సులువు అవుతుంది.

డాక్యుమెంట్స్‌

డాక్యుమెంట్స్‌

కొన్ని గ్యారేజీలకు బీమా సంస్థతో ఒప్పందం ఉంటుంది. అక్కడ మరమ్మతు చేయిస్తే చేతి నుంచి డబ్బు పెట్టక్కర్లేదు. అంటే నగదు రహిత మరమ్మతు అన్నమాట. బీమా సంస్థ వెబ్‌సైట్లలోనూ ఈ వివరాలు లభిస్తాయి. లేదంటే వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే సరిపోతుంది. అయితే, దీనికన్నా ముందు మీరు బీమా క్లెయిం ఫారం, పాలసీ కాపీ, వాహన రిజిస్ట్రేషన్‌ అసలు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వాహనం వల్ల ఇతరులకు నష్టం వాటిల్లినప్పుడు పోలీస్‌ ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) కూడా అవసరం అవుతుంది. వీటన్నింటితోపాటు వాహనాన్ని తిరిగి సిద్ధం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో గ్యారేజీ నుంచి అంచనా పత్రాన్ని తీసుకోవాలి. వాహన బీమాను క్లెయిం చేసుకోవడానికి ఇవన్నీ తప్పనిసరిగా కావాల్సిన పత్రాలన్న సంగతిని మర్చిపోవద్దు. వీలైనంత వరకూ క్లెయిం ఫారాన్ని మీరే నింపడం మంచిది.

అందుకే

అందుకే

అందుకే, బైక్‌, కారు వంటి వాహనాలకు బీమా ఉండటం చట్టపరంగా తప్పనిసరి. అంతేకాకుండా మీకు ఆర్థిక నష్టం రాకుండానూ చూసుకుంటుంది. అందువల్ల మీ వాహనానికి సరైన బీమా రక్షణ, తగినంత మొత్తానికి ఉండేలా చూసుకోవాలి. అది అన్ని కాలాల్లోనూ అటు వినియోగదారుడికి, ఇటు ఖరీదైన వస్తువుకి రక్షణగా నిలుస్తుంది. అందుకే మీ వాహనానికి సంబంధించిన బీమాస్థితిని పరిశీలించండి.

Read more about: insurance
English summary

రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు! మీకోసం కొన్ని జాగ్రతలు మరియు పాలసీలు! | Thinks To Know For Insurance for Vehicles in Rainy Season

Nandamuri Harikrishna, a prominent film actor and politician, was died in a road accident on Wednesday morning.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X