For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద్దె ఆస్తికి సంబంధించి ఆదాయం కావాలా? అద్దెకిచ్చే ఆస్తుల‌ మీద రుణం తీసుకోండి!

అద్దెల మీద ఋణం అంటే ఇళ్ళు వున్న వారు ఆర్ధిక సంస్థల నుంచి భవిష్యత్తులో వచ్చే అద్దెల మీద ఋణం తీసుకోవడం అన్నమాట. ఈ ఋణం పొందడానికి అర్హతలు ఏమిటో, ప్రక్రియ ఏమిటో చూద్దాం.

|

మీకు అద్దెకిచ్చిన ఆస్తి వుండి డబ్బులు కావాలా? అద్దెల మీద అప్పుతీసుకోండి!

అద్దెల మీద ఋణం అంటే ఇళ్ళు వున్న వారు ఆర్ధిక సంస్థల నుంచి భవిష్యత్తులో వచ్చే అద్దెల మీద ఋణం తీసుకోవడం అన్నమాట. ఈ ఋణం పొందడానికి అర్హతలు ఏమిటో, ప్రక్రియ ఏమిటో చూద్దాం.

1. క్రెడిట్ లైన్

1. క్రెడిట్ లైన్

దాదాపు అన్ని ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లు, భవిష్యత్తులో వచ్చే అద్దె ఆస్తిని త‌న‌ఖా పెట్టుకుని రుణాలు అందిస్తున్నాయి. ఈ సౌకర్యంతో, అద్దెలకు ఇచ్చే ఇళ్ళ కోసం భవిష్యత్తులో అద్దెలపై ఆధారపడి గృహ యజమానులు క్రెడిట్ లైన్ ని పొందవచ్చు.

2. అద్దె ఆస్తిపై రుణాన్ని ఎవరు పొందవచ్చు?

2. అద్దె ఆస్తిపై రుణాన్ని ఎవరు పొందవచ్చు?

వాణిజ్య లేదా గృహ ఆస్ది కలిగిన యజమాని ఎవరైనా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఆస్తికి యజమాని ఒకరే ఉండవచ్చు లేదా సంయుక్త యాజమాన్యం కలిగి ఉండవచ్చు. ఉమ్మడి యాజమాన్యం విషయంలో, యజమానులు అందరూ ఈ ఆస్ధికి దరఖాస్తుదారులుగా మారాలి. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఆస్ధుల కోసం లేదా లీజ్ ఒప్పందం లోకి ప్రవేశించిన ఆస్దులకి రుణక్రమం అందుబాటులో ఉంది.

3. అద్దె ఆస్తికి సంబంధించి రుణ ప్రయోజనం

3. అద్దె ఆస్తికి సంబంధించి రుణ ప్రయోజనం

భవిష్యత్తు అద్దెలకు వ్యతిరేకంగా రుణాల ద్వారా సేకరించిన డబ్బును, ఇంటిని కొనడానికి లేదా మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఎటువంటి ప్రయోజనలకైనా ఉపయోగించుకోవచ్చు. ఈ డబ్బును మీరు ఇంటి మరమ్మత్తులకి లేదా పునరుద్ధరణకి కూడా ఉపయోగించవచ్చు. పెంచిన డబ్బును ఉపయోగించుకోవడానికి, ఉన్న రుణాన్ని చెల్లించడానికి రునదాతలు కూడా అనుమతిస్తారు.

4. ఇది కూడా చూడండి: ఆస్తి హామీగా ఋణం: మీరు తెల్సుకోవాల్సిన అవసరం ఏమిటి

4. ఇది కూడా చూడండి: ఆస్తి హామీగా ఋణం: మీరు తెల్సుకోవాల్సిన అవసరం ఏమిటి

అద్దె ఆస్తి హామీ రుణాలను పొందే ఆస్తులు

వాణిజ్యపరమైన ఆస్తికి సంబంధించి మీరు ఈ రుణాన్ని పొందవచ్చు, ప్రభుత్వ సంస్ధలు, బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపేసీ లేదా పెద్ద రిటైల్ హౌస్ వంటి ప్రముఖ వ్యక్తులకు అద్దెకు ఇవ్వొచ్చు లేదా లీజుకు ఇవ్వొచ్చు. రుణదాతలు సాధారణంగా ఇటువంటి సంస్ధల ముందస్తు అనుమతి జాబితాను కలిగి ఉంటారు.

అద్దెకు ఇచ్చిన ఇళ్ళ కోసం కూడా మీరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు, అద్దెకు వ్యతిరేకంగా రుణాన్ని తిరిగి చెల్లించే కాలానికి ఒక ఒప్పందాన్ని కలిగి ఉండాలి. దానితోపాటు, భవిష్యత్తు అద్దెలకు వ్యతిరేకంగా బ్యాంక్ రుణాన్ని మంజూరు చేసే ముందు, మీరు అద్దె/లీజు ఒప్పందాన్ని కలిగి ఉన్నట్లుగా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి.

5. అవసరమైన డాక్యుమెంట్లు

5. అవసరమైన డాక్యుమెంట్లు

బ్యాంక్ ప్రాధమిక KYC (నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్ ను ఏర్పాటు చేయమని అడుగుతుంది, అంటే అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, వీటిని అప్లికేషన్ ఫారం పూర్తిచేసి దానితో జతచేసి ఇవ్వాలి. మీ తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని ఏర్పాటుచేయడానికి రుణదాత కూడా ప్రూఫ్ అడుగుతాడు. జీతాలు తీసుకునేవారయితే, ఇన్కంటాక్స్ రిటన్ (ITR) అందుబాటులో లేకపోతే, ఫామ్ 16 ఇస్తే సరిపోతుంది. అయితే, స్వయం ఉపాధి దరఖాస్తుదారులు ఆడిట్ చేసిన అకౌంట్స్ సబ్మిట్ చేయాలి, అకౌంట్స్ ఆడిట్ చేయకపోతే, మీరు గత రెండు లేదా మూడు సంవత్సరాల ITR ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు రుణాలకు వ్యతిరేకంగా డబ్బు ఇచ్చినప్పటికీ, ఇదొక సందర్భంలో లీజ్ కి ఇచ్చినపుడు, రుణదాతలు మీరు తిరిగి చెల్లించే సామర్ధ్యానికి సంబంధించి ఏదైనా హామీని అడుగుతారు.

6. సెక్యూరిటీ

6. సెక్యూరిటీ

లీజుకి ఇచ్చిన ఆస్తిపై ఋణం చార్జ్ ద్వారా సురక్షితంగా ఉంటుంది. పర్యవసానంగా, మీరు ఇప్పటికే గృహ రుణాన్ని కలిగిఉంటే, ఇతర రుణదాత నుండి మీరు ఈ రుణాన్ని పొందడం కష్టమవుతుంది, ఎందుకంటే వారు రాబోయే డబ్బుపై రెండో చార్జ్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి సందర్భాలలో, మీరు అద్దె ఋణం కోసం సెక్యూరిటీ గా ఏదైనా ఇతర ఆస్థిని ఆఫర్ చేయవచ్చు, ఇది రుణదాత మార్జిన్ అవసరాల సంతృప్తి పై ఆధారపడి ఉంటుంది.

అయితే ప్రారంభ గృహ రుణాలు చెల్లించిన తరువాత, ఆస్తి విలువ గణనీయంగా పెరిగితే, ప్రస్తుత గృహ రుణదాత మీ అద్దె రుణాన్ని అనుకూలంగా పరిగణించవచ్చు.

7. ఈ త‌ర‌హా రుణాలలో వడ్డీ, చార్జీలు, పదవీ కాలం

7. ఈ త‌ర‌హా రుణాలలో వడ్డీ, చార్జీలు, పదవీ కాలం

రుణదాతలు సాధారణంగా ఋణం మొత్తంపై 1% వరకు ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తారు. రుణదాతల మొత్తం విషయంలో రుణగ్రహీతలు ప్రొఫైల్ పై ఆధారపడి వడ్డీ మారుతుంది.

ప్రతుతం వడ్డీ రేటు సంవత్సరానికి దాదాపు 10% నుండి 13% వరకు ఉంది. అద్దెకు వ్యతిరేకంగా ఋణానికి ఇచ్చే గరిష్ట కాలం 10 సంవత్సరాలు.

అయితే, రుణ వ్యవధి లీజ్ ఒప్పంద౦ మిగిలిన కాలానికి మించకూడదు, అదనంగా, అద్దెకు వ్యతిరేకంగా రుణాలతో సహా ఎటువంటి రుణాన్నైనా పొందడానికి, మీ క్రెడిట్ చరిత్ర బాగుండాలి. లేకపోతే, మీరు ఋణం పొందడం చాలా కష్టమవుతుంది.

Read more about: rent house income loan
English summary

అద్దె ఆస్తికి సంబంధించి ఆదాయం కావాలా? అద్దెకిచ్చే ఆస్తుల‌ మీద రుణం తీసుకోండి! | Have a let-out property and need money Take a loan against rentals

Have a let-out property and need money? Take a loan against rentalsA loan against rental, allows home owners to borrow money from financing institutions, against future rental income. We examine the eligibility and process for obtaining such a loan
Story first published: Friday, January 19, 2018, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X