For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీర్ఘ‌కాల పొదుపు కోసం పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ల్లో ఏది బెట‌ర్?

మ్యూచువ‌ల్ ఫండ్స్, ఈక్విటీలు, యులిప్లు, ఎన్‌పీఎస్, పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు, పీపీఎఫ్‌, ఈపీఎఫ్ ప‌థ‌కాలు వంటి వాటిలో పొదుపు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన పొ

|

ఒక‌ప్పుడు గ్రామీణ జీవితం మీద ఎక్కువ మంది ఆధార‌ప‌డ‌టం మూలంగా భ‌విష్య‌త్తు కోసం ఎక్కువ‌గా డ‌బ్బు కూడ‌బెట్టడం గురించి పెద్ద‌గా ఆలోచించేవారు కాదు. ఇప్పుడంతా న‌గ‌రీక‌ర‌ణ ఎక్కువైంది. ఉద్యోగాల‌పై ఆధార‌ప‌డే వారి సంఖ్య క్ర‌మంగా ఎక్కువ అవుతున్న‌ది. 25 ఏళ్ల‌కే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి సైతం ఆలోచించే వారున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారు మ్యూచువ‌ల్ ఫండ్స్, ఈక్విటీలు, యులిప్లు, ఎన్‌పీఎస్, పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు, పీపీఎఫ్‌, ఈపీఎఫ్ ప‌థ‌కాలు వంటి వాటిలో పొదుపు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన పొదుపు ప‌థ‌కాల్లో ఈపీఎఫ్‌, పీపీఎఫ్ మార్గాల్లో వేటిలో పొదుపు చేస్తే ప్ర‌యోజ‌న‌మో తెలుసుకుందాం.

1. PPF ప్రజా భవిష్య నిధి పథకం

1. PPF ప్రజా భవిష్య నిధి పథకం

మీరు ఉద్యోగం చేస్తున్నా, స్వ‌యం ఉపాధి క‌ల వారైనా దీర్ఘ కాల‌ పొదుపుకు మ‌రో మంచి మార్గం పీపీఎఫ్‌. ఈ ప‌థ‌కం కాల వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. పొడిగించిన కాలంలో అద‌నంగా సొమ్ము జమ చేసినా, చేయకపోయిన ఫర్వాలేదు. జమ చేసినా లేదా అప్పటి వరకూ ఉన్న మొత్తం పైన మాత్రం వడ్డీ లభిస్తుంది. జులై 1, 2017 నుంచి వడ్డీ రేటు 7.8శాతంగా ఉంది. ఏడాదిలో కనిష్టంగా 500 వరకు, గరిష్టంగా 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. వ‌డ్డీ ఎప్పుడు చూసినా స‌గ‌టున 8% వ‌స్తుంది. గడువులోపు ఖాతాను పూర్తిగా మూసివేసేందుకు అవకాశం లేదు. కానీ, ఆరవ ఏట చివర్లో అంటే ఏడవ ఏడాదిలోకి ప్రవేశించిన వెంటనే కొంత మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. అది ఎలా అంటే అప్పటి వరకూ పీపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలన్స్ నుంచి కాకుండా... నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్ మొత్తం నుంచి 50 శాతం ఉపసంహరించుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. ఇక ఆ తర్వాత నుంచి ఏడాదికోసారి అవసరాలను బట్టి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. పెట్టే పెట్టుబడులకు, గడువు తీరిన తర్వాత అందుకునే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండూ వ్యవస్థీకృత రంగంలోని వారికి పరిమితం. పీపీఎఫ్ అందరికీ అందుబాటులో ఉన్న పథకం.

2. పీపీఎఫ్ తో ప్రయోజనాలు...

2. పీపీఎఫ్ తో ప్రయోజనాలు...

పీపీఎఫ్ ఖాతాను సంపాదించడం మొదలు పెట్టిన తొలి నాళ్లలోనే ప్రారంభించడం ద్వారా ఎక్కువ ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. కుటుంబ అవసరాలు పెరిగి డబ్బులు అవసరం అయ్యాయనుకోండి. ఆరో ఏడాది వరకు ఆగాల్సిందే. అందుకే ముందే ప్రారంభిస్తే అవసరంలో ఆదుకుంటుంది. నెల నెలా క్రమం తప్పకుండా పీపీఎఫ్ లో జమ చేస్తేనే ఎక్కువ నిధి సమకూరుతుంది. అందుకే అవకాశం ఉన్నంత మేర, అదనంగా చేతికి అందే మొత్తాన్ని పీపీఎఫ్ లోకి మళ్లించడం ప్రయోజనకరం. ప్రతి నెలా 5వతేదీ లోపే పీపీఎఫ్ లో జమ చేయాలి. ఆ తర్వాత జమ చేస్తే ఆ మొత్తంపై ఆ నెలలో వడ్డీ రాదు. 5వ తేదీన ఖాతాలో ఉన్న బ్యాలన్స్ పైనే వడ్డీ లభిస్తుంది. పీపీఎఫ్ పై తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే రుణంపై వడ్డీ రేటు కేవలం రెండు శాతమే అదనం. కనుక పర్సనల్ లోన్ కంటే పీపీఎప్ పై లోన్ తీసుకోవడమే నయం.

3. EPF ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్

3. EPF ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్

వ్య‌వ‌స్థీకృత రంగంలో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసిన పొదుపు మార్గం పీఎఫ్‌(ఉద్యోగుల భవిష్యనిధి పథకం). ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత‌ ప్రైవేటు రంగ కంపెనీల్లో పనిచేసే వారి భవిష్యత్ అవసరాల కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.8 శాతంగా ఉంది. ఉద్యోగి మూలవేతనం+డీఏ కలపగా వచ్చిన మొత్తంలోంచి 12 శాతాన్ని ఉద్యోగి వేతనం నుంచి సంబంధిత కంపెనీ ప్రతి నెలా మినహాయించి ఈపీఎఫ్ కు జమ చేస్తుంది. అదే విధంగా సంబంధిత కంపెనీ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని (12%) ఉద్యోగి భవిష్య నిధి ఖాతాకు జమ చేస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ లేదా సదరు కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసేవరకు ఇది అమల్లో ఉంటుంది. కంపెనీ వాటాగా అందే మొత్తంలో కొంత భవిష్య నిధికి, మరికొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కు ఈపీఎఫ్ మళ్లిస్తుంది. దీంతో పదేళ్ల సర్వీసు ఉండి పదవీ విరమణ వయసుకు వచ్చిన వారికి నెలనెలా కొంత మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందిస్తుంది. కంపెనీ మారినప్పుడు ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాను అదే నంబర్ తో కొత్త కంపెనీలోనూ కొనసాగించుకోవచ్చు. లేదా ఒక కంపెనీలో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి మరో ఉద్యోగం లేకుండా రెండు నెలల పాటు ఖాళీగా ఉంటే ఈపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేసుకుని అందులో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులు, రాబడులకు పన్ను మినహాయింపు పూర్తిగా కలదు. అయితే, ఓ కంపెనీలో కనీసం ఐదేళ్లు కూడా పనిచేయకుండా ఉద్యోగం మానేసి ఆ లోపే భవిష్యనిధి ఖాతాలోని నగదును వెనక్కి తీసుకోదలిస్తే పన్ను వర్తిస్తుంది.

4. VPF వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్

4. VPF వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్

ఈపీఎఫ్ చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న అవకాశం ఇది. వీపీఎఫ్ అనేది ప్రత్యేక పథకం కాదు. ఈపీఎఫ్ చందాదారులు తమ వేతనం నుంచి అదనంగా మరికొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని అనుకుంటే అందుకు వీపీఎఫ్ వీలు కల్పిస్తుంది. ఉద్యోగి తన మూలవేతనం+డీఏకు సమాన స్థాయి వరకు వీపీఎఫ్ లో పొదుపు చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై ఈపీఎఫ్ వడ్డీ రేటే అప్లయ్ అవుతుంది. ఈపీఎఫ్ పథకానికి వర్తించే పన్ను మినహాయింపులు, నిబంధనలు కూడా దీనికి వర్తిస్తాయి. వీపీఎఫ్ రూపంలో పెట్టే పెట్టుబడులు ఈపీఎఫ్ ఖాతాలోనే జమ అవుతాయి.

5. ఉద్యోగుల విష‌యానికి వ‌స్తే

5. ఉద్యోగుల విష‌యానికి వ‌స్తే

వేతన జీవులు అయితే పీపీఎఫ్ లో కంటే వీపీఎఫ్ లోనే జమ చేసుకోవడం ప్రయోజనం. ఎందుకంటే వీపీఎఫ్ ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది. అయితే, ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్ లో జమచేసిన నిధి నుంచి పదవీ విరమణ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంలో 60 శాతంపై పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో దాన్ని వెంటనే పక్కన పెట్టింది. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చినట్టయితే వీపీఎఫ్ లో పెట్టుబడులపై పన్ను పోటు పడుతుంది.

6. ముఖ్య అవ‌స‌రాల కోసం

6. ముఖ్య అవ‌స‌రాల కోసం

వీపీఎఫ్ ద్వారా నెలనెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేసుకోవాలనుకునే ఉద్యోగులు తమ కంపెనీ హెచ్ఆర్ విభాగంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండింటిలోనూ ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వివాహాలు, ఇళ్ల కొనుగోలు, తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అలాగే ముఖ్య అవసరాలకు రుణాన్ని కూడా పొందే సదుపాయం ఉంది. అధిక వడ్డీ రేటు ఉన్న దృష్ట్యా పీపీఎఫ్, వీపీఎఫ్ ఎక్కువ ప్రయోజనకరం. కానీ ఈ రెండు ఉద్యోగులకే పరిమితం. వృత్తులతో ఉన్నవారు, స్వయం ఉపాధితో జీవించే వారు, కార్మిక శాఖ వద్ద నమోదు కానీ చిన్న కంపెనీల్లో పని చేసేవారికి పీపీఎఫ్ ఒక్కటే అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన ఆప్షన్.

Read more about: ppf epf provident fund
English summary

దీర్ఘ‌కాల పొదుపు కోసం పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ల్లో ఏది బెట‌ర్? | EPF vs PPF which one is better for long term savings

Retirement planning has become the most talked about topic among people as young as 25. With so many investment options (Mutual Funds, Equity, ULIPs, NPS, Post office schemes, PPF, EPF Pension Plans etc.) coming up, it is becoming more difficult for youngsters to zero in on the most suitable retirement option. Going by the low risk average return (and vice versa) rule, the young population considers it wise to prefer EPF, VPF and PPF over all other options for investment/retirement.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X