For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహ‌రుణం తీసుకునే ముందు ఈ 5 ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు తెలుసుకున్నారా?

సొంత ఇల్లు అనేది చాలా మంది దంప‌తుల‌కు ఏళ్ల నాటి క‌ల‌. ఎంతో ఆలోచన చేసిన త‌ర్వాత ఎన్నో ర‌కాల‌ త్యాగాలు చేసిన త‌ర్వాత, ఎంతో కాలంగా సంసిద్ధంగా ఉంటే త‌ప్ప చ‌క్క‌ని ఇంటిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదు.

|

సొంత ఇల్లు అనేది చాలా మంది దంప‌తుల‌కు ఏళ్ల నాటి క‌ల‌. ఎంతో ఆలోచన చేసిన త‌ర్వాత ఎన్నో ర‌కాల‌ త్యాగాలు చేసిన త‌ర్వాత, ఎంతో కాలంగా సంసిద్ధంగా ఉంటే త‌ప్ప చ‌క్క‌ని ఇంటిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇల్లు కొనేందుకు చాలా మంది గృహ రుణంపైనే ఆధార‌ప‌డుతున్నారు. ఇంటిపై రుణం పొందేందుకు ఎంతలా శ్ర‌ద్ధ చూపిస్తారో అంతే శ్ర‌ద్ధ‌ను గృహ‌రుణ ద‌ర‌ఖాస్తు పై సంత‌కం చేసేట‌ప్పుడు చూపిస్తే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు ప‌డ‌కుండా ఉంటాం. రుణం అంగీక‌రించే ముందు నియ‌మ‌నిబంధ‌న‌ల ద‌గ్గ‌ర‌ సంత‌కం చేసేట‌ప్పుడు ఈ అయిదు ప్ర‌శ్న‌ల‌ను అడ‌గండి. వీటికి స‌మాధానాలు తెలుసుకోవ‌డం వ‌ల్ల రుణానికి సంబంధించిన విష‌యాల‌ పునాదిపై గ‌ట్టి అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది.

1. స్థిర వడ్డీనా... చ‌ర వ‌డ్డీ రేటా?

1. స్థిర వడ్డీనా... చ‌ర వ‌డ్డీ రేటా?

గృహ‌రుణాల‌పై స్థిర‌, చ‌ర అనే రెండు ర‌కాల వ‌డ్డీ రేట్లుంటాయి. స్థిర వ‌డ్డీ రేటుతో గృహ రుణం పొందితే రుణ కాలానికి మొత్తంగా ఒకే వ‌డ్డీ రేటు ఉంటుంది. అంటే రుణ‌గ్ర‌హీత రుణ కాల‌వ్య‌వ‌ధి తీరేంత వ‌ర‌కు నెల నెలా ఒకే మొత్తంలో వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. చ‌ర వ‌డ్డీ రేటుతో గృహ‌రుణం పొందితే మాత్రం మార్కెట్ ప‌రిస్థితులను బ‌ట్టి వ‌డ్డీ రేటు మారుతూ ఉంటుంది. చ‌ర వ‌డ్డీ రేటు ఆర్బీఐ నిర్దేశించిన బేస్ రేటును ఆధారం చేసుకొని ఉంటుంది. బేస్ రేటు మారితే గృహ రుణ వ‌డ్డీ రేటులోను మార్పు చేస్తారు. రుణం తీసుకునేవారు కేవ‌లం వ‌డ్డీ త‌క్కువ‌గా ఉంది అనే ఒక్క అంశాన్ని మాత్ర‌మే చూడ‌కూడ‌దు. మ‌నం తీసుకునే గృహ‌రుణానికి స్థిర వ‌డ్డీ రేటును వ‌ర్తిస్తున్నారా లేక చ‌ర వ‌డ్డీ రేటును వ‌ర్తింప‌జేస్తున్నారా తెలుసుకోవ‌డం ముఖ్యం. వ‌డ్డీ రేట్లు త‌గ్గే క్ర‌మంలో చ‌ర రేటును ఎంచుకోవ‌డం మేలు. ఇక పెరిగే అవ‌కాశ‌ముంటే స్థిర రేటు ఎంపిక మేలు.

2. ముంద‌స్తు చెల్లింపు నిబంధ‌న‌లేమిటి?

2. ముంద‌స్తు చెల్లింపు నిబంధ‌న‌లేమిటి?

రుణ‌దాత‌లు రుణాన్ని ఇచ్చేట‌ప్పుడే నిర్ణీత కాలానికి తిరిగి తీసుకునేలా ప్ర‌ణాళిక వేసుకుంటారు. ఒక వేళ రుణం తీసుకున్న‌వారు ముందుగానే రుణాన్ని తీర్చేయాల‌నుకుంటే రుణం ఇచ్చిన‌వారికి వ‌డ్డీ రూపంలో న‌ష్ట‌మే క‌దా! అందుకే సాధార‌ణంగా రుణ‌మిచ్చేవారు ముంద‌స్తు చెల్లింపును నిరుత్సాహ‌రుస్తారు. ఇందుకోసం వారు పెనాల్టీ లాంటివి విధిస్తుంటారు లేదా ముంద‌స్తు రుణ చెల్లింపున‌కు కొంత‌కాలం త‌ర్వాతే అనుమ‌తిస్తారు.

రుణం తీసుకున్నవారు త‌మ వ‌ద్ద ఎప్పుడైనా ఎక్కువ సొమ్ము ఉంటే రుణాన్ని ముందే తీర్చేయాల‌నే ఆలోచ‌న చేస్తుంటారు. దీని వ‌ల్ల వ‌డ్డీ కొంతైనా మిగులుతుంద‌ని వారి ఆరాటం. అయితే ముంద‌స్తు రుణ చెల్లింపు చేసేట‌ప్పుడు అందుకు త‌గిన నియ‌మ నిబంధ‌న‌ల గురించి తెలుసుకోవ‌డం ముఖ్యం.

3. రుణం - విలువ‌ల నిష్ప‌త్తి?

3. రుణం - విలువ‌ల నిష్ప‌త్తి?

ఇది రుణ ప్రాసెసింగ్ చేసేట‌ప్పుడు తీసుకోవాల్సిన నిర్ణ‌యం. ఏ బ్యాంకు నుంచి రుణం పొందుతామో దాన్ని బ‌ట్టి రుణ‌-విలువ నిష్పత్తి నిర్ణ‌యమ‌వుతుంది. ఆర్‌బీఐ రుణ‌-విలువ నిష్ప‌త్తిపై కొన్ని నిబంధ‌న‌లు విధించినా బ్యాంకుల‌ను బ‌ట్టి దీని విలువ‌లో తేడా ఉంటుంది. అస‌లేంటీ రుణ‌-విలువ నిష్ప‌త్తి అనేగా మీ సందేహం. గృహ లేదా ఆస్తి విలువ‌కు స‌మానంగా రుణం మంజూరు చేయ‌రు. అందులో నిర్ణీత శాతానికి రుణం మంజూరు అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు రూ.50ల‌క్ష‌ల విలువ చేసే స్థిరాస్తి ఉంద‌నుకుందాం. రుణం ఇచ్చే సంస్థ 80శాతం రుణ‌-విలువ నిష్ప‌త్తి నిర్ణ‌యిస్తే అప్పుడు రూ.50లక్ష‌ల్లో 80శాతం అంటే రూ.40ల‌క్ష‌లు గృహ‌రుణంగా మంజూరు చేస్తారు. కాబ‌ట్టి త‌క్కువ‌ నిష్ప‌త్తి ఉంటే ఇంటిని కొనేందుకు మ‌న చేతి నుంచి ఎక్కువ నిధులు కావాలి. అదే ఈ నిష్ప‌త్తి ఎక్కువుంటే చేతిలో త‌క్కువ నిధులున్నా చాలు.

4. అద‌న‌పు ఛార్జీలున్నాయా?

4. అద‌న‌పు ఛార్జీలున్నాయా?

గృహ‌రుణం తీసుకున్న త‌ర్వాత కేవ‌లం వ‌డ్డీ ఒక్క‌టే భ‌రించాల్సి ఉంటుంద‌నే భావ‌న వ‌ద్దు. దీనికి తోడు అద‌న‌పు ఛార్జీలు ఉంటాయ‌న్న సంగ‌తి గుర్తుంచుకోవాలి. వీటిలో కొన్నింటిపై మీకు అవ‌గాహ‌న ఉండొచ్చు. మ‌రికొన్నింటి గురించి మీకు అస‌లు తెలియ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి రుణ ఎంపిక‌లో, ఎక్క‌డ రుణం పొందుతున్నామో తెలుసుకొని స‌రైన నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రు. అద‌న‌పు ఖ‌ర్చుల్లో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు, లీగ‌ల్ ఫీజుల‌ను రుణం తీసుకునేవారే భ‌రించాల్సి ఉంటుంది. ఇవి ఫిక్స్‌డ్‌గా ఉంటాయి లేదా రుణ మొత్తంలో ప‌ర్సెంటీజీగాను ఉంటాయి. కాబ‌ట్టి డీల్ కుదుర్చుకునే ముందు స్ప‌ష్ట‌త‌ తెచ్చుకోవ‌డం ముఖ్యం.

5. రుణంతో పాటు గృహ బీమా?

5. రుణంతో పాటు గృహ బీమా?

గృహ‌మ‌నేది ముఖ్య‌మైన ఆస్తి. కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ప్ర‌ధాన రుణ‌గ్ర‌హీతకు అనుకోకుండా ఏదైనా జ‌రిగి మిగ‌తా వాయిదాలు చెల్లించ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డితే అప్పుడు ఆ ఇంటిని వ‌దిలేసుకోవ‌డం ఏ కుటుంబానికైనా ఎంత బాధాక‌రం. అలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌కుండా ఉండాలంటే గృహ‌రుణానికి కూడా బీమా చేయించాలి. ఈ విష‌యంలో ట‌ర్మ్ పాల‌సీ కూడా ఆర్థిక‌ప‌రంగా స‌హాయ‌మందిస్తుంది. ఇలాంటి అవ‌కాశ‌ముంటే గృహ‌బీమా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అయితే కొన్ని సార్లు రుణం ఇచ్చేవారు బీమాను ఇచ్చేసి దానికి సంబంధించిన ఛార్జీల‌ను కూడా రుణంలో భాగం చేసేస్తారు. ఈ విష‌యం గురించి స‌రిగ్గా తెలుసుకోండి.

మీ క‌ల‌ల సౌధాన్ని సొంతం చేసుకునేందుకు మీకు అనువైన రుణమేదో తెలుసుకొని అన్ని విష‌యాలు బాగా ప‌రిశీలించాకే స‌రైన నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రు. రుణ సంబంధ అంశ‌మై ఏదైనా ముందే తెలిస్తే త‌గిన విధంగా సంసిద్ధంగా ఉండ‌గ‌లుగుతాం.

Read more about: home loan housing loan
English summary

గృహ‌రుణం తీసుకునే ముందు ఈ 5 ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు తెలుసుకున్నారా? | These things you should know before taking Home Loan

Buying a home is a joyous occasion and usually something that is done after a lot of preparation and careful thought. In current times most homes are bought with aid of home loans so while being vigilant when buying your home, make sure you also focus equally on your loan agreement specifics.
Story first published: Thursday, November 2, 2017, 17:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X