For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌తి నెలా రూ.5000 సిప్‌, పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం...

ప్ర‌తి త‌ల్లిదండ్రులు ముందు నుంచే ప్ర‌ణాళిక వేసుకుని ఉండాలి. ఉన్న‌త విద్య కోసం అయ్యే ఖ‌ర్చు పోనూ పోనూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబ‌ట్టి ఈ విధంగా చేయాలి.

|

ప్ర‌స్తుతం విద్య అంతా ప్ర‌యివేటు రంగం చేతుల్లోకి వెళుతుండ‌టంతో చ‌దువును కొనాల్సి వ‌స్తోంది. భ‌విష్య‌త్తులో పిల్ల‌ల‌ను ఉన్నత చ‌దువులు చ‌దివించాలంటే నెల‌వారీ సంపాద‌న స‌రిపోదు. అందుకే ప్ర‌తి త‌ల్లిదండ్రులు ముందు నుంచే ప్ర‌ణాళిక వేసుకుని ఉండాలి. ఉన్న‌త విద్య కోసం అయ్యే ఖ‌ర్చు పోనూ పోనూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబ‌ట్టి ఈ విధంగా చేయాలి.

 మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు

పిల్ల‌లు పుట్ట‌గానే పొదుపు మొద‌లుపెట్టాలి. అంతే కాకుండా ఒక కాల‌ప‌రిమితి పెట్టుకుని పెట్టుబ‌డులు పెడుతూ ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కు పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుని ల‌క్ష్యంగా ఉంచుకుని నెల‌కు రూ.5000 మొద‌లుకొని మీ స్తోమ‌త‌, సామ‌ర్థ్యానికి త‌గిన విధంగా మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ చేయ‌వ‌చ్చు. సిప్ లేదా సిస్ట‌మ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మూలంగా ఒక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన పెట్టుబ‌డి అల‌వాటు అవుతుంది. ఇది మీ ఆర్థిక ల‌క్ష్యాల‌ను దీర్ఘ‌కాలంలో చేరుకునేందుకు తోడ్ప‌డుతుంది.

ఇది ఎలా జ‌రుగుతుందో చూద్దాం...
మీ పిల్ల‌ల వ‌య‌సు 3-4 ఏళ్ల మ‌ధ్య ఉంద‌నుకుందాం. అంటే వారి ఉన్న‌త చ‌దువు కోసం మ‌రో 10 నుంచి 15 ఏళ్ల స‌మ‌యం ఉంది. రూ.5000 ప్ర‌తి నెలా సిప్ మార్గంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడుతూ పోతే అప్ప‌టికి మీకు పిల్ల‌ల చ‌దువుకు కావాల్సిన డ‌బ్బు స‌మ‌కూరుతుంది. అంతే కాకుండా డ‌బ్బు ఇంత‌లింత‌ల‌వ‌డం మీరు గ‌మ‌నిస్తారు. చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌యోజ‌నాలు పొందుతారు.

ఉదాహ‌ర‌ణ‌కు రూ.12 వేల మొద‌టిసారి పెట్టుబ‌డి 20 ఏళ్ల‌కు 13% రాబ‌డి రేటుతో చివ‌ర‌కు రూ.57,27,596 అవుతుంది. ఇది మీ అస‌లు రూ.45,27,596 కంటే చాలా ఎక్కువే. మీ పెట్టుబ‌డితో పోలిస్తే రాబ‌డి బాగానే ఉండి, పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు చేతికి డ‌బ్బు అందుతుంది.

కాబ‌ట్టి పిల్ల‌ల చ‌దువుకు ఎక్కువ‌గా అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బును సిప్ రూపంలో పొదుపు చేస్తూ, పెట్టుబ‌డి పెడుతూ వెళ్లండి. ద్ర‌వ్యోల్బ‌ణానికి మించిన రాబ‌డుల ద్వారా దీర్ఘ‌కాలంలో స‌మ‌కూరే డ‌బ్బుతో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్ల‌ల‌ను చ‌దివించ‌వ‌చ్చు.

Read more about: mutual fund sip
English summary

ప్ర‌తి నెలా రూ.5000 సిప్‌, పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం... | monthly mutual fund sip can help for child higher education

The burgeoning cost of education has now made every parent cautious and proactive as it is the desire of every parent to provide the best of education they can. And the cost of education is likely to tread higher in the coming days.
Story first published: Tuesday, September 12, 2017, 16:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X