మీరు క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకున్నంత మాత్రాన మీకు ప్రత్యేక బహుమతులు, ప్రోత్సాహకాలు ఏమీ ఉండవు. కానీ మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ వ్యక్తిగత రుణానికి, గృహ రుణ దరఖాస్తుకు అది బాగా ఉపయోగప
మీరు క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకున్నంత మాత్రాన మీకు ప్రత్యేక బహుమతులు, ప్రోత్సాహకాలు ఏమీ ఉండవు. కానీ మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ వ్యక్తిగత రుణానికి, గృహ రుణ దరఖాస్తుకు అది బాగా ఉపయోగపడుతుంది. అలాంటి క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు కొన్ని సూచనలు ఇక్కడ తెలుసుకోండి.

రీపేమెంట్ షెడ్యూల్
మీ క్రెడిట్ స్కోర్ ఇది వరకే చాలా బాగా ఉంటే, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఇది ఎలా సాధ్యమంటే సమయానికి చెల్లింపులు చేయడం వల్లే. అలా కాకుండా సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు ఇబ్బంది పడుతుంటే ఈసీఎస్ మ్యాండేట్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి పేమెంట్ తేదీకి చెల్లించే ఏర్పాటు చేసుకుంటే మంచిది.

క్రెడిట్ కార్డు పరిమితి విషయంలో
మన ఆర్థిక స్థితి, చేసే ఉద్యోగం, బ్యాంకు ఖాతాలో నిల్వ వంటివి చూసి క్రెడిట్ కార్డు పరిమితిని నిర్ణయించి ఉంటారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1 లక్షగా నిర్ణయించారని అనుకుందాం. అప్పుడు దానర్థం ప్రతిసారి అదంతా ఉపయోగించుకోమని కాదు. మీకు అంత అర్హత ఉంది. అనవసరమైన ఖర్చులు చేసి ఎక్కువ పరిమితిని ఉపయోగించుకోకూడదు. సాధారణంగా మీ క్రెడిట్ కార్డుకు ఉన్న పరిమితిలో 30 నుంచి 40 శాతం వరకూ ఉంచుకోవడం ఉత్తమం.

రుణం తీసుకునే ముందు
సాధారణంగా ఉద్యోగంలో చేరిన తర్వాత కనీసం ఒక క్రెడిట్ కార్డయినా వాడేవారు ప్రస్తుతం చాలా మంది ఉన్నారు. అయితే 30ల తర్వాత చాలా మంది వేతన ఉద్యోగులు ఇల్లు కొనేందుకు ప్లాన్ వేసుకుంటారు. ఒక వేళ వాహన రుణం లేదా గృహ రుణం వంటివి దరఖాస్తు చేసుకునే ఆలోచన ఉంటే దానికి ఆరు నెలల ముందు మళ్లీ కొత్తగా క్రెడిట్ కార్డు లేదా మరో వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేయకపోవడం సూచనీయం. అది మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఏ విధమైన ప్రభావం చూపుతుందంటే ఈ వ్యక్తి ఎక్కువగా రుణాల మీద ఆధారపడి జీవితం సాగిస్తున్నాడని.

ఇతర సలహాలు
ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డులు మీ దగ్గర ఉంటే లేదా కుటుంబ సభ్యులకు అదనపు కార్డును ఇచ్చి ఉంటే వాటన్నింటి చెల్లింపులు సమయానికి జరిగేలా చూడటం ముఖ్యం. లేదంటే అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయగలదు. హామీగా ఉన్న వ్యక్తుల ఖాతాలను, ఉమ్మడి బ్యాంకు ఖాతాలను అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఒక వేళ వారు రుణాలను సక్రమంగా చెల్లించకపోతే ఆ ప్రభావం హామీదారుపై ఉంటుంది. అది మీ రుణ మంజూరును సైతం నిర్ణయించే అవకాశం ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications