English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పిల్ల‌ల చ‌దువు కోసం పొదుపు చేయండిలా....

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

త‌మ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన‌ ఉన్న‌త విద్యను అందించ‌డం ద్వారా వారు మంచిగా స్థిర‌ప‌డాల‌ని ప్ర‌తి త‌ల్లిదండ్రులు క‌ల‌లు కంటారు. చదువు వారి భవిష్యత్తకు భద్రతను కల్పిస్తుంది. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం సరైన అవ‌గాహ‌న లేకుండా పెట్టుబడులు పెడుతున్నారు. అది సరైన రాబడిని ఇస్తుందా లేదా అనే విషయం కూడా అలోచించడం లేదు. ఒక చ‌క్క‌టి ఆర్థిక ప్ర‌ణాళిక త‌యారుచేసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంటే అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో పిల్లల చ‌దువు ఖ‌ర్చుల‌కు వెనుకాడే అవ‌స‌రం ఉండ‌దు. లేదంటే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సరైన ప్రణాళిక వేసుకుని మీ చిన్నారి చదువుకు బంగారు బాట వేయాలంటే మనం చేయాల్సిన పనులేంటో చూద్దామా?

1. వివిధ ఆలోచ‌న‌లు ఇలా....

1. వివిధ ఆలోచ‌న‌లు ఇలా....

ప్ర‌తి నెలా కొంత‌ పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారు రికరింగ్ డిపాజిట్ తెరవచ్చు. బీమా పథకాలు బీమా రక్షణ కల్పించడంతోపాటు పన్ను మినహాయింపులు కూడా ఉండటంతో పిల్లల బీమా పథకాలకు డిమాండ్ అధికంగా ఉంది. దాదాపు అన్ని బీమా కంపెనీలూ పిల్లలకు ప్రత్యేకమైన బీమా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి మనీ బ్యాక్ పాలసీ కాగా, మరొకటి మొత్తం సొమ్ము చేతికి వచ్చే ఎండోమెంట్ పాలసీ. అయితే ఈ రెండు పాల‌సీల్లోనూ బీమా హామీ మొత్తం ఎక్కువ‌గా ఉండ‌దు కాబ‌ట్టి అధిక మొత్తంలో క‌వ‌రేజీ ఇచ్చే ట‌ర్మ్ పాల‌సీ తీసుకుని ఉండాలి.

2. పాల‌సీల ద్వారా ఇలా...

2. పాల‌సీల ద్వారా ఇలా...

సాధారణంగా పిల్లల మనీ బ్యాక్ పాలసీలు వారికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పాలసీ కాలపరిమితి పూర్తి అయ్యేవరకు ఏటా కొంత మొత్తం చొప్పున అందిస్తుంటాయి. ఇక ఎండోమెంట్ పాలసీల విషయానికి వస్తే పిల్లల చదువు లేదా పెళ్లికి అక్కరకు వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరుగుతాయి. పిల్లల పేరు మీద పాలసీలు తీసుకున్నప్పుడు పేయర్ బెనిఫిట్ లేదా వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్‌ను తీసుకోవడం మరిచిపోవద్దు. దీనివల్ల ప్రీమియం చెల్లించే వ్యక్తికి ఏదైనా సంఘటన జరిగినా తదుపరి ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీని కొనసాగించేందుకు వీలుంటుంది. ఎల్ఐసీతో పాటు ప‌లు ప్ర‌యివేటు రంగ బీమా కంపెనీలు పిల్ల‌ల‌కు సంబంధించి ప్ర‌త్యేక పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటాయి.

3. యులిప్స్ స‌రైన‌దేనా....

3. యులిప్స్ స‌రైన‌దేనా....

బీమా పథకాల్లో ప్రధానమైన ఆకర్షణ ఏమిటంటే... చెల్లించే ప్రీమియంపై పన్ను రాయితీలు లభించడంతోపాటు అందించే రాబడిని కూడా పూర్తిగా పన్నురహిత ఆదాయంగా పరిగణిస్తారు. ఇవి కూడా రిస్క్‌లేని స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. యులిప్స్ బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీల ప్రవేశంతో యూనిట్ ఆధారిత బీమా పథకాలకు ఆద‌ర‌ణ పెరిగింది. పైన చెప్పుకున్న రెండు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌తో పోలిస్తే ఇవి రిస్క్‌తో కూడుకున్నవి. వీటి రాబడులు స్టాక్, మనీ మార్కెట్ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

4. యులిప్‌ల ప‌నితీరు

4. యులిప్‌ల ప‌నితీరు

దాదాపు అన్ని యులిప్స్‌లను పిల్లల పేరు మీద తీసుకునే అవకాశమున్నా పిల్లల కోస‌మే ప్రత్యేకంగా కొన్ని యులిప్స్ పథకాలను బీమా కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. ఇలా పిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలను సాధారణంగా ఈక్విటీల్లో తక్కువగా, డెట్, మనీ మార్కెట్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే విధంగా తీర్చిదిద్దారు. మిగిలిన బీమా పథకాల తరహాలోనే యులిప్స్ కూడా అన్ని పన్ను ప్రయోజనాలు అందిస్తాయి. పాల‌సీల‌కు ప్ర‌త్యేకంగా ప‌న్ను మిన‌హాయింపులు ఏమైనా ఉన్నాయోమో బీమా సంస్థ‌ల ఏజెంట్ల‌ను అడిగి తెలుసుకోవాలి. సంప‌ద పెంపుకు 10 ఉత్త‌మ స‌ల‌హాలు

5. మ్యూచువల్ ఫండ్స్

5. మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ కూడా వివిధ రకాల చిన్న పిల్లల పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి ఈక్విటీ డైవర్సిఫైడ్, బ్యాలెన్స్‌డ్, డెట్ ఫండ్స్ రూపంలో లభిస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌లో అత్యధిక శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అధిక రిస్క్‌ను, అధిక రాబడిని కలిగి ఉంటాయి. ఇక బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ విషయానికి వస్తే సగం ఈక్విటీ, మిగిలిన సగం డెట్, మనీ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో రిస్క్ సగానికిపైగా తగ్గుతుంది. అదే డెట్ ఫండ్స్ అయితే రిస్క్ తక్కువ, రాబడి వడ్డీరేట్లు, మనీ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటుంది. పైన చెప్పుకున్నట్లు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొద్దిగా రిస్క్‌తో కూడుకున్నవన్న విషయం మర్చిపోవద్దు.

6. స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు:

6. స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు:

రిస్క్‌ను తట్టుకునే వారు నేరుగా పిల్లల పేరు మీద షేర్లను కొనుగోలు చేయడం మరో ఇన్వెస్ట్‌మెంట్ మార్గం. రాబడి అనేది పూర్తిగా ఆ కంపెనీ షేరు కదలికలపై ఆధారపడి ఉంటుంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసేటప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం మంచిది. బ్రోక‌రేజీల‌పైనే పూర్తిగా ఆధార‌ప‌డి షేర్లలో పెట్టుబ‌డులు పెట్ట‌డం సూచ‌నీయం కాదు. కొద్దిగానైనా అవ‌గాహ‌న ఉంటేనే ఈక్విటీల‌పై దృష్టి సారించండి. ఇటీవ‌ల కొన్నివెబ్‌సైట్లు షేర్ల‌కు సంబంధించి నిత్యం విశ్లేష‌ణ‌ల‌ను ఇస్తున్నాయి. క్ర‌మంగా వాటిని చ‌దివి షేర్ మార్కెట్ జ్ఞానం పెంచుకునే ప్ర‌య‌త్నం చేయండి.

7. అస‌లే అవ‌గాహ‌న లేక‌పోతే వ‌ద్దు

7. అస‌లే అవ‌గాహ‌న లేక‌పోతే వ‌ద్దు

అలాగే స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేని వారు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ జోలికి వెళ్లొద్దు. చిన్న మొత్తాల‌తో పెట్టుబ‌డులు మొద‌లు పెట్టొచ్చు. అలాంటి దాని కోసం మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో ప్రారంభం మంచిది. సిప్ మార్గం మ‌ధ్య‌త‌ర‌గ‌తికి బాగా న‌ప్పుతుంది. ఒకేసారి భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయలేని వారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చు. దీనికి ముందుగా మీరు చేయాల్సిందల్లా... నిధులు ఏమేరకు అవసరమవుతాయన్న దానిపై స్పష్టత ఏర్పర్చుకోవడమే.

8. స్ప‌ష్ట‌త త‌ర్వాతే పెట్టుబ‌డులు

8. స్ప‌ష్ట‌త త‌ర్వాతే పెట్టుబ‌డులు

ఉదాహరణకు 15 సంవత్సరాల తర్వాత రూ.50 లక్షల నిధిని సమకూర్చుకోవాలన్నది మీ లక్ష్యం అనుకుందాం. మీరు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తంపై ఏటా 12 శాతం రాబడిని ఆశిస్తున్నారనుకోండి.. దీని ప్రకారం ప్రతి నెలా మీరు సుమారు రూ.10,500 మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా ఇంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం కష్టమనుకుంటే ముందుగా మీరు రూ.6,000తో మొదలు పెట్టండి. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని ఏటా 10 శాతం పెంచుకుంటూ పోవడం ద్వారా 15 ఏళ్లలో రూ.50 లక్షల నిధిని సమకూర్చుకోవచ్చు.

7 ఉత్త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

9. ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) సైతం మంచిదేనా...

9. ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) సైతం మంచిదేనా...

పీపీఎఫ్ లేదా ఆర్‌డీల‌పై 8.0 శాతంపైనే వ‌డ్డీ వ‌స్తోంది. పీపీఎఫ్‌లోని పెట్టుబ‌డుల‌కు ప్ర‌భుత్వ హామీ ఉన్నందున ఇవి సుర‌క్షిత‌మైన‌వి. పిల్ల‌ల ఆర్థిక భ‌విష్య‌త్తు కోసం చేసే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు సైతం ఉన్నాయి. పీపీఎఫ్‌పై లాక్ఇన్ పీరియ‌డ్ ఎక్కువ ఉంటుంది అని భావించే వారు రిక‌రింగ్ డిపాజిట్ల‌కు మొగ్గుచూప‌వ‌చ్చు. పీపీఎఫ్‌కు ప్ర‌భుత్వ హామీ ఉంటుంది కాబ‌ట్టి భ‌ద్ర‌త ఎక్కువ‌. రిస్క్ భ‌రించ‌లేని వారికి ఇది ఒక మంచి దీర్ఘ‌కాలిక పొదుపు మార్గం.

దీర్ఘ‌కాలిక పొదుపు కోసం పీపీఎఫ్ ఖాతాను ఎలా ఉప‌యోగించుకోవాలి?

10. అమ్మాయిల కోసం సుక‌న్య స‌మృద్ది

10. అమ్మాయిల కోసం సుక‌న్య స‌మృద్ది

కేవ‌లం అమ్మాయిల కోసం పొదుపు చేయాల‌నుకుంటే సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం బాగా ఉంటుంది. ఈ ప‌థ‌కంలో ఖాతా తెరిచేందుకు అమ్మాయిల వ‌య‌సు 10 ఏళ్ల లోపు ఉండాలి. ఒక సంవత్స‌ర కాలంలో క‌నీస డిపాజిట్ రూ. 1000 నుంచి గ‌రిష్టంగా రూ.1.50 ల‌క్ష వ‌ర‌కూ చేయ‌వ‌చ్చు.ఖాతా తెరిచిన‌ప్ప‌టి నుంచి 14 సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగించే వీలుంటుంది. మీ ద‌గ్గ‌ర్లో ఉన్న బ్యాంకులో, పోస్టాఫీసులో ఈ ఖాతా తెరిచే సదుపాయం ఉంటుంది. సుక‌న్య స‌మృద్ది యోజ‌న కింద జ‌మ చేయ‌బ‌డిన మొత్తానికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. Check gold rates in Hyderabad here

English summary

best child child investment planning in India

Many parents these days look at the Unit Linked Insurance Plans and the children saving plans that insurance companies and fund houses tend to provide. They do provide insurance and some sort of safety comfort for your child's education, but, the returns are poor. In fact, if you deduct the expense associated with these child's plans your returns are reduced. If you want to secure your child's education, expenses in case of your sudden demise go for a plain vanilla term insurance plan that will take care of everything.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC