“చిన్నచిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారుచేస్తాయి” అనే ప్రసిద్ధ నానుడి ఉంది అంటే అర్ధం మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంతో మొదలుపెట్టి దీర్ఘకాలంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయవచ్చు.
"చిన్నచిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారుచేస్తాయి" అనే ప్రసిద్ధ నానుడి ఉంది అంటే అర్ధం మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంతో మొదలుపెట్టి దీర్ఘకాలంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయవచ్చు. ఆదాయాన్ని, ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించే వారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క.
ఎదైనాసరే ముందు, ఒక బడ్జెట్ తయారుచేసుకుని, ఖర్చుల ప్రణాళిక వేసుకుని, ఒక డైరీ ని ఏర్పాటుచేసుకోవాలి, మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే, అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్నచిన్న ఖర్చులను లేక్కచేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తం అయి ఇబ్బంది పెడతాయి.
ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని 10 డబ్బు ఆదా చేసే సలహాలు మీ కోసమే...

కిరాణా బడ్జెట్
మీకు కావలసిన సరుకుల జాబితాను తయారుచేసుకుని బడ్జెట్ వేసుకోండి లేదా మీరు చివరకు అవసరంలేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారుచేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దానివల్ల అవసరంలేని వస్తువులను కొనకుండా ఉండవచ్చు. పండుగ సీజన్లలో లేదా అతిధులను ఆహ్వానించినపుడు ఒక జాబితాను పరిగణలోనికి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది.

ఆన్ లైన్, విడిగా కొనే వాటితో పోల్చుకోండి
మీరు ఆన్ లైన్ లేదా విడిగా కోనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏమైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చి చూసుకోండి. అంతేకాకుండా, ఉదాహరణకు మీరు ఒక మొబైల్ కొనాలి అనుకుంటే, ఒక ధర మత్రమే కాకుండా ఆన్ లైన్ లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్‌లైన్‌లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తుంటాయి. వాటిని వినియోగించుకోండి.

మందులపై ఆదా
మీరు మందులు కొనుగోలు చేసేటపుడు మీ బిల్ పై కొంత తగ్గింపు వచ్చే మెడ్ ప్లస్ లేదా అపోలో ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ID ని ఇస్తారు. పన్ను రిటర్నులు సమర్పించేటపుడు దీన్ని చూపించుకోవచ్చు. ఇటీవల చాలా రాష్ట్రాల్లో జనరిక్ దుకాణాలు ప్రారంభిస్తున్నారు. వీటిని సైతం కొనుగోలు చేసి మీ బిల్లును తగ్గించుకోవచ్చు.

విలాసాలకు ఒక ప్రణాళిక
ఒక నిజంగా విశ్రాంతి కావాలంటే, డిన్నర్ లేదా మూవీ కి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్లవద్దు. ఏ రెస్టారెంట్లలో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో సమాచార జాబితాను కొన్ని వెబ్ సైట్లలో పరిశీలించుకోండి. మీరు సినిమా టికెట్లు బుక్ చేసే ముందు ఆ ఆపరేటర్ ఏమైనా కార్డ్స్ పై ఆఫర్లు పెట్టదేమో తెలుసుకోండి, కొన్ని బ్యాంకులకు వీటితో టై అప్ ఉంది.

ఆఫర్ల కోసం తనిఖీ చేయండి
మీరు ఏదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురుచూడండి, పండగ సీజన్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండగ సమయాలలో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి, కొన్ని వస్తుమార్పిడి ఆఫర్లు కూడా ఉంటాయి. పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతకే ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే దాని కోసం మళ్లీ మళ్లీ ఖర్చు చేయాల్సిన అవసరం రాకూడదు.

అవసరంలేని వస్తువులను అమ్మడం
డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి, కొంతమంది అనవసరమైన వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే, వస్తువులను అమ్మేటపుడు తెలివి అవసరం. ఇటీవల ఓఎల్ఎక్స్ లాంటి వెబ్‌సైట్లు పాత వస్తువులను అమ్మడాన్ని సులభతరం చేశాయి.

క్రెడిట్ కార్డ్స్ వాడకంలో జాగ్రత్త
క్రెడిట్ కార్డు అత్యవసరాల్లోనే వాడండి. అవును, ఇది ప్రతి ఒక్కరికీ చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించడం చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం అనవసరమైన కొనుగోలు చేయకుండా ఉండడం. క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే, మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్ లో ఉంచితే అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు. ఇంధన స్టేషన్ల వంటి సర్ చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది.

కారు, ఇతర విలాస వస్తువులను వాడకంలో అప్రమత్తత
సాధ్యమైనంత వరకు కారుకు బదులు బైకును వాడండి. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్నే ఎంచుకోండి. ఇందుకు మీరు సమయ పాలన పాటించడం అవసరం. ఈ చిన్ని చిన్ని అంశాలు మీ ఇంధన చెల్లింపులను తగ్గించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మీ డబ్బును నగదు రూపంలో అందుబాటులో ఉంచొద్దు
మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. అనేక బ్యాంకులు ఆటో స్వీప్ సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి, అంటే మీ అకౌంట్ కొంత మొత్తానికి నిర్దేశిస్తే దానంతట అదే ఆ మొత్తం డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన FD లపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందవచ్చు.

మీ ఆర్ధిక నైపుణ్యాలను పెంపొందించుకోండి
అవును, ఆర్ధికపరమైన సమాచారం తెలుసుకుంటే, మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్లపై ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్ధిక వస్తువు కొనుగోలు చేసేముందు, ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి, సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications