For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి?

రూపాయి రూపాయి కూడబెడితేనే సంపద వృద్ది అవుతుంది. సంప‌ద‌ను కాపాడుకునేందుకు, వృద్ది చేసుకునేందుకు, త్వ‌ర‌గా పెట్టుబ‌డి పెట్టి వాటి ల‌క్ష్యాల‌ను సాధించేందుకు అనువైన మార్గాలనూ తెలుసుకోవాలి. కుబేరులు అయ

|

రూపాయి రూపాయి కూడబెడితేనే సంపద వృద్ది అవుతుంది. సంప‌ద‌ను కాపాడుకునేందుకు, వృద్ది చేసుకునేందుకు, త్వ‌ర‌గా పెట్టుబ‌డి పెట్టి వాటి ల‌క్ష్యాల‌ను సాధించేందుకు అనువైన మార్గాలనూ తెలుసుకోవాలి. కుబేరులు అయిన వారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. బ్యాంకు వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న క్ర‌మంలో దీనికి బాగా ఉపయోగపడే మార్గ‌మే క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌). మరి దీని వ‌ల్ల‌ ఉపయోగాలేమిటో, ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకోవాలో వివ‌రంగా తెలుసుకుందాం.

ఆర్‌డీ లాగానే

ఆర్‌డీ లాగానే

మ‌న‌లో చాలా మంది బ్యాంకు డిపాజిట్ల వైపు మొగ్గుచూపుతుంటారు. బ్యాంకులో ఎఫ్‌డీ సుర‌క్షిమ‌నేది చాలా మంది భావ‌న‌. అలాగే కొంత మంది దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల్లో భాగంగా రికరింగ్‌ డిపాజిట్‌ చేయడం వంటివి చేస్తుంటారు. అచ్చం ఆర్‌డీలాగే మ్యూచువల్‌ ఫండ్లలో నెలనెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడాన్నే సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌-క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం) అంటాం. వారం మొద‌లుకొని నెలకోసారి, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి నిర్ణీత మొత్తాన్ని ఈ పద్ధతి ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే సౌల‌భ్యం ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో లాభ‌న‌ష్టాలు స‌మ‌తౌల్యం అయ్యే ప్రయోజనంతో పాటు, దీర్ఘకాలంలో రాబ‌డి పెరుగుతూ పోతుంది. కాలంతో పాటు పెట్టుబడుల విలువ పెరిగేందుకు ఈ క్రమానుగత పెట్టుబడుల విధానం బాగా ప‌నికొస్తుంది. సరైన సమయంలోనే మార్కెట్లో మదుపు చేస్తానంటే ఎవరికీ వీలుప‌డే విష‌యం కాదు. ఎప్పుడూ మార్కెట్లో కొనసాగుతూ ఉండటమే స‌రైన మదుపరి లక్షణంగా ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తారు.

 ఎలా పనిచేస్తుంది?:

ఎలా పనిచేస్తుంది?:

ఎంచుకున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో నెలనెలా కొంత మొత్తాన్ని పెట్టడమే సిప్‌. నెలలో నిర్ణయించుకున్న తేదీనాడు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ మీ బ్యాంకు ఖాతా నుంచి పెట్టుబడి మొత్తాన్ని సేక‌రించి అందుకు త‌గ్గ‌ యూనిట్లను కేటాయిస్తుంది. యూనిట్‌ ధరను ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వాల్యూ) అంటారు. దీనివల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. మార్కెట్లు ఒక్కోసారి ఒక్కోర‌కంగా ప‌ర్‌ఫార్మ్ చేస్తుంటాయి. కొన్నిసార్లు పెరుగుతుంటాయి. మరికొన్నిసార్లు బాగా త‌గ్గుతాయి. ఏది సరైన సమయం అన్నది నిర్ణయించుకోవడం మదుపర్లకు అంత తేలిక కాదు. సిప్‌ చేయడం వల్ల పెరిగినప్పుడూ.. తగ్గినప్పుడూ మనం పెట్టుబడులు పెడుతుంటాం. దాని వ‌ల్ల మ‌న పెట్టుబ‌డుల వ‌ల్ల బ్యాలెన్స్ అయి దీర్ఘ‌కాలంలో మంచి రాబడుల‌కు దారితీస్తుంది.

ఎంత మొత్తం పెట్టుబ‌డి పెట్టొచ్చు?

ఎంత మొత్తం పెట్టుబ‌డి పెట్టొచ్చు?

ఎంత మొత్తం?: ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని సాధించేందుకు ఉన్న వ్యవధి, అప్పటికి కావాల్సిన మొత్తం ఎంత అని నిర్ణయించుకోవాలి. దాని ఆధారంగా ఎంత మొత్తం సిప్‌ చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. సిప్‌ చేసేందుకు నెలకు రూ.1000 ఉన్నా చాలు. మంచి పనితీరు ఉన్న పథకాలను ఎంచుకోవాలి. అవసరమైతే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. లేదా ఫండ్‌ సంస్థల సేవా కేంద్రాలను సంప్రదించాలి. వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టే ఫండ్లను ఎంచుకొని, మదుపు చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించేందుకు ‘సిప్‌' ఉపకరిస్తుంది. వీలైనంత ఎక్కువ కాలం కొనసాగించినప్పుడు సగటు ప్రయోజనంతో మంచి లాభాలు ఆర్జించేందుకు వీలవుతుంది.

ఎలా పెట్టుబ‌డి పెట్టాలి?

ఎలా పెట్టుబ‌డి పెట్టాలి?

* మదుపరి తన వీలును బట్టి నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు ఎంత పెట్టుబడి పెట్టాలన్నది నిర్ణయించుకోవచ్చు. నేరుగా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును ఈసీఎస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ తీసుకుంటుంది. మీరు ఏ పథకంలో మదుపు చేయాలనుకుంటున్నారో దాని తాలూకు దరఖాస్తు పత్రం పూర్తి చేసి, సిప్‌ తేదీలను పేర్కొని ఇవ్వాలి. మొదటిసారి చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. పాన్‌ కార్డు కూడా అవసరం అవుతుంది.దాదాపు చాలా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు నెల‌కు క‌నీస పెట్టుబ‌డిని రూ. 1000గా నిర్ణ‌యిస్తున్నాయి. మ‌రికొన్ని రూ. 500 నుంచే పెట్టుబ‌డి పెట్టేందుకు వీలు క‌ల్పిస్తున్నాయి. మీకు ఏది బాగా న‌ప్పుతుందో చూసుకుని పెట్టుబ‌డి ప్రారంభించాలి.

ఏ అంశాలు గ‌మ‌నించాలి?

ఏ అంశాలు గ‌మ‌నించాలి?

* ఎన్ని నెలలు ‘సిప్‌' చేస్తారనేది నిర్ణయించుకోవాలి. కనీసం ఆరు నెలలు చేయాలి. నిర్బంధంగా ఎటువంటి నిర్ణీత కాల‌వ్య‌వ‌ధి అనేది ఉండదు. అంటే, మీరు 36 నెలలు చేద్దామనుకున్నారు. మధ్యలోనే మీరు వెనక్కి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాకపోతే అమ్మకపు రుసుముల సంగతి చూసుకోవాలి.

* ప్ర‌తి నెలా ఒక తేదీ నాడు సిప్ తేదీని మ‌దుప‌రి మొద‌ట ఎంచుకోవాలి. ఆ తర్వాత నుంచి మీరు పేర్కొన్న తేదీనాడు బ్యాంకు నుంచి నేరుగా పెట్టుబడి మొత్తం వెళ్తుంది. కావాలనుకుంటే మీరు ముందస్తు తేదీల(పోస్ట్ డేటెడ్‌) చెక్కులు కూడా ఇవ్వొచ్చు.

* మీ దగ్గరలో ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ సలహాదారు, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలో సంప్రదించి సిప్‌ ప్రారంభించవచ్చు. లేదా మీ సమీపంలోని బ్యాంకులను సంప్రదించినా ఈ విషయంలో తగిన సూచన లభిస్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు

  • క్రమానుగత పెట్టుబడుల వల్ల ఆర్థిక క్రమశిక్షణ అల‌వ‌డుతుంది.
  • మార్కెట్‌ను మీరు నిరంతరం పర్యవేక్షించే అవసరం లేకుండా ఫండ్ మేనేజ‌ర్ మొత్తం చూసుకుంటారు.

  • చిన్న వయసు నుంచే ప్రారంభిస్తే.. దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి.
  • ప్ర‌తి రోజూ ఎన్ఏవీ విలువ‌ను మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ ప్ర‌చురిస్తుంది. కాబ‌ట్టి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది.

Read more about: mf mutual funds investments savings
English summary

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి? | What is the benefit if we invest in the sip mode in Mutual funds

SIPs will ensure that you invest every month, thereby instilling discipline in your investment behaviour. This investment tool allows you to start investing in mutual funds with even as low as Rs. 1,000 per month, thereby ensuring you gradually build a large investment portfolio. By ensuring that you invest regularly, SIPs will help you average out your costs over the long term. You will not have to worry about timing the markets too. Thus, SIPs are the best way to build wealth over the long term.
Story first published: Saturday, February 11, 2017, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X