For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీ అవ‌స‌ర‌మేంటి?

ప్రమాదాలు మనకు చెప్పి రావు. ఈ రోజుల్లో ఇంటి నుంచి బ‌య‌ట‌కి వెళ్లామంటే ఎప్పుడు తిరిగివస్తామో, క్షేమంగా వస్తామో రామో అని ఇంట్లో వాళ్లు కంగారు ప‌డే ప‌రిస్థితి నెలకొంది. మనం జాగ్రత్తగా వాహనం నడిపినా ఎదుటి

|

ప్రమాదాలు మనకు చెప్పి రావు. ఈ రోజుల్లో ఇంటి నుంచి బ‌య‌ట‌కి వెళ్లామంటే ఎప్పుడు తిరిగివస్తామో, క్షేమంగా వస్తామో రామో అని ఇంట్లో వాళ్లు కంగారు ప‌డే ప‌రిస్థితి నెలకొంది. మనం జాగ్రత్తగా వాహనం నడిపినా ఎదుటి వాళ్ల ర్యాష్ డ్రైవింగ్ వ‌ల్ల‌ ఇబ్బందులు పడే ఉంటాం. అందుకే మన చేతుల్లో ఏదీ ఉండదు కాబట్టి, కనీసం దుర్ఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టకుండా జాగ్రత్త పడాల్సిన సమయమిది. ఈ నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌త ప్ర‌మాద పాల‌సీ గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుందాం.

ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట్ పాల‌సీ ప్ర‌యోజ‌న‌మేంటి?

ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట్ పాల‌సీ ప్ర‌యోజ‌న‌మేంటి?

అనుకోని సంఘటనల వల్ల పాలసీదారుడికి జరగరానిది జరిగితే కుటుంబానికి జీవిత బీమా ఆర్థికంగా అండగా నిలిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరినా ఆర్థిక భారం పడకుండా చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పించేంది ఆరోగ్య బీమా పాలసీ. అయితే, ప్రమాదంలో గాయపడి కొన్నాళ్లపాటు పనిచేయలేనప్పుడే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగం లేక ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంటే మరోవైపు ఆస్పత్రి ఖర్చులు మీ స‌న్నిహితుల‌ను మరింత కుంగదీస్తాయి. ఇలాంటి సమయాల్లోనే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఉంటే మిమ్మ‌ల్ని, కుటుంబాన్ని ఎంత‌గానో ఆదుకుంటుంది.

ఈ బీమా ప్రత్యేకతలు ఏంటి ?

ఈ బీమా ప్రత్యేకతలు ఏంటి ?

యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రధానంగా నాలుగు సందర్భాల్లో పరిహారాన్ని అందిస్తుంది.

* ప్రమాదంలో మరణం: ఏదైనా ప్రమాదంలో పాలసీదారుడు మరణించినప్పుడు బీమా మొత్తాన్ని నామినీకి అందిజేస్తారు.

* శాశ్వత పూర్తి వైకల్యం: (permanent total disability) ప్రమాదంలో గాయపడినప్పుడు కొన్నిసార్లు పూర్తి వైకల్యం (కాళ్లూ, చేతులు విరిగిపోవడం, కళ్లు దెబ్బతినడం, చూపు పోవడం వంటివి) సంభవించే ఆస్కారం ఉంది. దీనివల్ల సదరు వ్యక్తి ఎలాంటి పనిచేసేందుకూ వీలు కాకపోవచ్చు. దీన్నే శాశ్వత పూర్తి వైకల్యం అంటారు. అప్పుడు పాలసీ మొత్తంలో 25శాతం వరకూ అదనంగా పరిహారం అందుతుంది. అయితే, ఇది బీమా కంపెనీనిబట్టి మారుతుంది. పాలసీ తీసుకునేప్పుడు ఈ విషయాన్ని అడిగి తెలుసుకోవాలి.

* పాక్షిక శాశ్వత వైకల్యం ( permanent Partial disability) ప్రమాదం జరిగినప్పుడు పాక్షికంగా శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు(చేతి వేళ్లు పూర్తిగా తెగిపోవడం, ప్రమాదం వల్ల చూపు కొద్దిగా మందగించడం). ఇలాంటప్పుడు వైకల్యం సంభవించిన శాతాన్ని బట్టి నష్టపరిహారం అందుతుంది.

* తాత్కాలిక పాక్షిక వైకల్యం: (Temporary partial disability) ఎముకలు విరగడంలాంటి సందర్భాల్లో కొన్నాళ్లపాటు ఏ పనీ చేసేందుకు వీలు ఉండదు. ఈ సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసేందుకు వారానికి కొంత మొత్తం చొప్పున పాలసీ పరిహారం ఇస్తుంది. ఇది దాదాపు 100 వారాల పాటు ఇస్తారు. వ్యక్తి తీసుకున్న పాలసీని బట్టి ఎంత మొత్తం పరిహారం అందేదీ ఆధారపడుతుంది. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు, కుటుంబ పోషణకూ అవసరమైన మొత్తం దీని ద్వారా పొందేందుకు వీలుంటుంది.

ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం

ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం

* ఎలాంటి వారికి ఈ పాల‌సీ ఉప‌యోగం - వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు ఇది కూడా చాలా ముఖ్యం. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ పాలసీ చాలా ముఖ్యం.

మీతోపాటు, మీ జీవిత భాగస్వామి పిల్లల పేర్ల మీద కూడా తీసుకోవచ్చు. ఒకే పాలసీలో అందరూ కూడా రక్షణ పొందవచ్చు.

* ఒకే పాలసీలో: మీ అవసరాలు, ఆర్థిక స్తోమతను బట్టి ఈ పాలసీని ఎంచుకోవచ్చు. పూర్తి స్థాయిలో బీమా పాలసీని తీసుకున్నప్పుడు ప్రమాదంలో మరణించినా, పూర్తి, పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు పరిహారం ఇచ్చేలా ఉండాలి. పూర్తి స్థాయి బీమా పాలసీ మాత్రమే శాశ్వత, పాక్షిక వైకల్యం, మరణం సందర్భంలో పరిహారం ఇస్తుంది. ప్రాథమిక పాలసీ తీసుకున్నప్పుడు కేవలం చనిపోయినప్పుడు మాత్రమే పరిహారం అందుతుంది. మీరు ఎంచుకున్న పాలసీని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

పాల‌సీ ఎంత మొత్తానికి తీసుకోవాలి?

పాల‌సీ ఎంత మొత్తానికి తీసుకోవాలి?

వ్యక్తిగత ప్రమాద పాలసీలు మీ ఆదాయాన్ని బట్టి ఇస్తారు. మీ నెలవారీ ఆదాయానికి 100 నుంచి 120 రెట్ల వరకూ పాలసీని పొందేందుకు వీలుంది. అయితే, ఇందుకోసం ఒక్కో బీమా కంపెనీ ఒక్కో నిబంధనను పాటిస్తుంది. ఒక ఏడాదిలో ఎలాంటి పరిహారం పొందకపోతే మరుసటి ఏడాది 10శాతం క్యుములేటివ్‌ బోనస్‌ అందిస్తారు.

పరిహారం ఎలా?

పరిహారం ఎలా?

ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. అవసరమైన అన్ని పత్రాలు (ఆసుపత్రి బిల్లులు, పోలీస్‌ ఎఫ్‌ఐఆర్‌, వైద్య పరీక్షల, డాక్టర్ల నివేదికలు, వైకల్యానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం) బీమా కంపెనీకి అందించాలి. ఒకవేళ మరణిస్తే.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని నామినీ సమర్పించి పాలసీని క్లెయిం చేసుకోవచ్చు.

Read more about: policy insurance
English summary

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీ అవ‌స‌ర‌మేంటి? | What is the need of Personal accidental insurance policy for an Individual

Personal Accident Insurance will financially cover a policyholder against accidental deaths, disabilities, and will take care of any monetary expenses during hospitalization. A Personal Accident Insurance will ensure the financial stability for you and your family in the event of an accident.What is the need of Personal accidental insurance policy for an Individual
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X