English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

బాబోయ్‌! వీటికి కూడా బీమా పాల‌సీలు ఉంటాయా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

2011 లెక్క‌ల ప్రకారం దేశంలో ప్ర‌తి వేయి మందికి ఒక సొంత వాహ‌నం ఉంది. ద్విచ‌క్ర‌వాహ‌నం అయినా, కార‌యినా మొద‌ట చేయాల్సిన ప‌ని బీమా తీసుకోవ‌డం. భార‌త‌దేశంలో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే వాహ‌న బీమా, గృహ బీమా తీసుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా తీసుకోవ‌డంలోనే నిర్ల‌క్ష్యం చూపుతున్న నేటి రోజుల్లో మిగ‌తా ఇన్సూరెన్స్ గురించి ఆలోచించ‌డం హాస్యాస్ప‌దం అవుతుంది. ట‌ర్మ్ ఇన్సూరెన్స్ అన‌గానే త‌టుక్కున గుర్తొచ్చేది ఆటో, గృహ‌, ఆరోగ్య బీమాలే. మీరు మంచి గాయ‌కులు హ‌ఠాత్తుగా మీ గొంతుకు ఏమైనా అయితే మీ ఉపాధి ఎలా? లేదా మీ అబ్బాయి మంచి డ్యాన్స‌ర్ అనుకోకుండా అత‌ని శ‌రీరానికి ఏమైనా అయితే ఏం చేస్తారు? అందుకే కొంత మంది సెల‌బ్రిటీలు వారి గొంతు, చెవులు, ముక్కు వంటి శ‌రీర భాగాల‌కు ప్ర‌త్యేక బీమా చేయిస్తారు. ఈ నేప‌థ్యంలో ఇండియాలో మీరు ఊహించ‌ని ఐదు బీమా పాల‌సీల గురించి తెలుసుకుందాం.

శ‌రీర భాగాల‌కు బీమా

శ‌రీర భాగాల‌కు బీమా

బెట్టె డెవిస్ న‌డుము భాగానికి, జులియా రాబ‌ర్ట్స్ స్మైల్ కోసం సైతం బీమా పాల‌సీలు తీసుకున్నారు. చాలా మంది సెల‌బ్రిటీలు ముఖ్య‌మైన శ‌రీర భాగాల‌కు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇందుకోసం ఎంత ఖ‌ర్చైనా చేసేందుకు వెనుకాడ‌రు. ప్ర‌స్తుతం స్పోర్ట్స్ స్టార్స్ సైతం ఈ బాట ప‌డుతున్నారు. సానియా మీర్జా త‌న రెండు చేతుల‌కు బీమా పాల‌సీ తీసుకోగా విజేంద‌ర్ సింగ్ సైతం ఈ విధంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఒక‌సారి ప్ర‌స్తావించారు.

బాలీవుడ్ తార‌లు

బాలీవుడ్ తార‌లు

పాశ్చాత్య దేశాల్లో మ‌డోనా, కైలీ మినోగ్ త‌మ శ‌రీర భాగాల‌కు బీమా పాల‌సీల‌ను తీసుకున్నారు. బాలీవుడ్ తార‌లు మ‌ల్లికా శెరావ‌త్‌, మినీషా లంబా వంటి వారు త‌మ శ‌రీర భాగాల‌కు ఇన్సూరెన్స్ చేయించుకున్న‌ట్లు స‌మాచారం. మేల్ సెల‌బ్రిటీల్లో జాన్ అబ్ర‌హం త‌న పిరుదుల భాగానికి బీమా తీసుకున్నాడంట. రాఖీ సావంత్ సైతం త‌న శ‌రీరానికి మొత్తం బీమా చేయించాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు భోగ‌ట్టా.

వాయిస్ ఇన్సూరెన్స్‌

వాయిస్ ఇన్సూరెన్స్‌

భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ప్రముఖ గాయ‌కుల్లో ల‌తా మంగేష్క‌ర్ ఒక‌రు. చాలా మంది సంగీత‌మే జీవితంగా శ్వాసిస్తారు. అలాంటి వారిలో ఈమె ఒక‌రు. ఆమె త‌న గొంతు(స్వ‌రానికి)కు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. త‌మ వాయిస్ ఆస‌క్తికరంగా ఉండేందుకు చాలా మంది గాయ‌కులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అదే విధంగా త‌మిళ న‌టుడు ర‌జ‌నీకాంత్ సైతం త‌న వాయిస్‌కు బీమా చేయించుకున్నారు.

పెట్ (పెంపుడు జంతువుల‌) ఇన్సూరెన్స్‌

పెట్ (పెంపుడు జంతువుల‌) ఇన్సూరెన్స్‌

కొంత మంది త‌మ కుటుంబ స‌భ్యుల‌ను ప్రేమించిన‌ట్లుగా పెంపుడు జంతువుల‌కు ప్రాముఖ్య‌త‌నిస్తారు. ప్ర‌స్తుత రోజుల్లో పెంపుడు జంతువుల‌కు సైతం ఇన్సూరెన్స్ చేయించేందుకు మెగ్గుచూపుతున్నారు. పెట్ ఇన్సూరెన్స్ పాల‌సీలు చాలా రైడ‌ర్ల‌తో వ‌స్తున్నాయి. ఒక‌వేళ త‌మ పెట్ చ‌నిపోతే కొత్త‌ది కొనుక్కునేందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బును పొంద‌వ‌చ్చనేది కొంత మంది ఆలోచ‌న‌. మ‌రి కొంత మంది దాని ఆరోగ్యానికి అయ్యే ఖ‌ర్చుల నుంచి కొంత ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని పాల‌సీ తీసుకుంటుంటారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ చాలా మంది సామాన్యుల‌కు ఇది కొంత వింత‌గానే అనిపిస్తుంది.

వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌

వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌

ఎవరి జీవితంలోనైనా వివాహం అనేది ఒక ముఖ్య ఘ‌ట్టం. వివాహం చాలా జాగ్ర‌త్త‌గా జ‌రిగేవ‌ర‌కూ ఊపిరి బిగ‌ప‌ట్ట‌కుని ఉంటారు ఇరువైపుల కుటుంబాలు. ఎందుకంటే ఏ చిన్న అన‌ర్థం జ‌రిగినా క‌ష్ట‌మే. అంతేకాకుండా హంగులు,ఆర్బాటాలు ఎక్కువైన ఈ రోజుల్లో వివాహ వేడుక‌లు ఖ‌రీద‌వుతున్నాయి. అందుకే ఆర్థికంగా న‌ష్టాల నుంచి గ‌ట్టేక్కెందుకు కొన్ని మేజ‌ర్ రిస్క్‌ల‌ను క‌వ‌ర్ చేస్తూ వివాహానికి సైతం బీమా తీసుకోవ‌చ్చు. ఒక్కోసారి అనుకోకుండా పెళ్లి వాయిదా ప‌డ‌టం, ర‌ద్ద‌వ‌డం వంటివి జ‌రిగిన సంద‌ర్భాల్లో బీమా మీకు, మీ కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి ఇన్సూరెన్స్‌

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి ఇన్సూరెన్స్‌

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి ప్రోగ్రామ్ ఎంత పేరు తెచ్చుకుందో మీకంద‌రికీ తెలిసిందే. వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బు ఎక్కువ ఉండ‌టం వ‌ల్లే నిర్వాహ‌కులు కోటి రూపాయ‌ల‌ను సులువుగా ఇవ్వ‌గ‌లుగుతున్నార‌ని భ్ర‌మ‌ప‌డుతుంటారు. దీని వెన‌కాల చాలా బిజినెస్ ఉంటుంది. అందుకే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప్రైజ్ మ‌నీ(బ‌హుమ‌తి సొమ్ము)కి సైతం బీమా చేయించారు. కాబ‌ట్టి రూ.5 కోట్ల‌ను సుశీల్ కుమార్ గెలుచుకున్న‌ప్పుడు నిర్వాహ‌కులేమీ త‌మ సొంత డ‌బ్బును ఖ‌ర్చుపెట్ట‌లేదు. మొద‌ట చెల్లించినా త‌ర్వాత‌ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ స‌ద‌రు మొత్తాన్ని వారికి బీమా హామీ మొత్తం కింద వెన‌క్కు ఇచ్చింది. ఇలాగే చాలా రియాల్టీ షోలు ప్ర‌స్తుతం ఇన్సూరెన్స్ పాల‌సీలు తీసుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి.

ముగింపు

ముగింపు

మీ ద‌గ్గ‌ర కూడా ఇటువంటి విలువైన ఆస్తులు ఉన్నాయ‌ని యోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం. మీరు ఒక పాల‌సీ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. స‌రైన బీమా క‌వ‌రేజీ ఉంటే మీరు దాని గురించి చింతించాల్సిన పని ఉండ‌దు. ఇన్సూరెన్స్ ఎంత విచిత్రంగా అనిపించినా మీరొక్క‌రే తీసుకుంటున్న‌ట్లు భావిస్తున్నా అందుకోసం బీమా కంపెనీ వ‌ద్ద ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు. బీమా కంపెనీని సంప్ర‌దించండి మ‌రి.

Read more about: insurance
English summary

You Won't Believe that These Insurance Covers Exist In India

Rarely do people own a car, house, bike or a building etc without having insurance to protect them from the worst that can happen. But are you covered for your most valuable assets? When we hear the term insurance, we always think about the basics like auto,real estate and health only. You are a singer and what happen if you loose your voice ? Certain celebrities are known for insuring assets like voice, body parts etc. Check out this five odd insurance covers that exists.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC