For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్త‌మ‌మైన ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలంటే ఈ అంశాల‌ను తెలుసుకోవాల్సిందే...

వైద్యానికే ఎంతో డ‌బ్బులు ఖ‌ర్చులు పెడుతున్న భార‌త్ లాంటి దేశాల్లో ఆరోగ్య బీమా అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఏటా ఆసుప‌త్రి ఖ‌ర్చులు పెరుగుతూ ఉంటాయి. మ‌న సంపాద‌న పెరుగుద‌ల అంత మేర‌కు ఉండొచ్చు, ఉండ‌క‌పోవ‌చ్చు. హ‌

|

ఆరోగ్య బీమా అంటే ఏమిటి? ఎంత మొత్తానికి పాల‌సీని కొనుగోలు చేయాలి?

వైద్య ఖ‌ర్చుల‌కు క‌వ‌రేజీ క‌ల్పించేదే ఆరోగ్య బీమా. వైద్యానికే ఎంతో డ‌బ్బులు ఖ‌ర్చులు పెడుతున్న భార‌త్ లాంటి దేశాల్లో ఆరోగ్య బీమా అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఏటా ఆసుప‌త్రి ఖ‌ర్చులు పెరుగుతూ ఉంటాయి. మ‌న సంపాద‌న పెరుగుద‌ల అంత మేర‌కు ఉండొచ్చు, ఉండ‌క‌పోవ‌చ్చు. హ‌ఠాత్తుగా ఆసుప‌త్రి పాల‌యితే పొదుపు చేసిన డ‌బ్బంతా ఆసుప‌త్రి బిల్లుల‌కే స‌రిపోతుంది. అందుకే ఈ సంద‌ర్భంలో ఆరోగ్య బీమా పాల‌సీ అవ‌స‌రాన్ని, పాల‌సీ ఎంచుకునేట‌ప్పుడు గ‌మనించాల్సిన అంశాల‌ను చూద్దాం.

ఆరోగ్య బీమా పాల‌సీ ప‌రిధిలోకి వ‌చ్చే అంశాలు

ఆరోగ్య బీమా పాల‌సీ ప‌రిధిలోకి వ‌చ్చే అంశాలు

పాలసీదారుకు వ‌చ్చిన ఆరోగ్య స‌మ‌స్య ఆధారంగా బీమా కంపెనీలు కొన్ని ర‌కాల ఖ‌ర్చుల‌ను చెల్లిస్తాయి. వాటిలో ముఖ్య‌మైన‌వి కొన్ని:

1) ఆసుప‌త్రి గ‌దికయ్యే ఖ‌ర్చులు

2) ఆసుప‌త్రి, న‌ర్సింగ్ హోం, క్లినిక్‌ల‌లో న‌ర్సింగ్ ఖ‌ర్చులు(ఇవి కంపెనీని బ‌ట్టి మార‌తాయి)

3) ఫిజీషియ‌న్‌, క‌న్సెల్టెంట్‌, నిపుణులు, మ‌త్తు మందు ఇచ్చే డాక్ట‌రు, స‌ర్జ‌న్‌, శ‌స్త్ర‌చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చులు

4) మ‌త్తుమందు, ర‌క్తం, ఆక్సిజ‌న్ అందించేందుకు అయ్యే ఖ‌ర్చులు, శ‌స్త్ర‌చికిత్స గ‌దికి, వైద్య ఉప‌క‌ర‌ణాలు(మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్‌), మందుల‌కు, ఎక్స్‌రే, డ‌యాల‌సిస్‌, కీమోథెర‌పీ, రేడియో థెర‌పీ, పేస్ మేక‌ర్‌, కృత్రిమ అవ‌య‌వాల‌ను అమ‌ర్చ‌డం వంటి వాటికి అయిన ఖ‌ర్చును సైతం ప‌రిమితి ఆధారంగా బీమా కంపెనీలు భ‌రిస్తాయి.

ఆరోగ్య బీమా పాల‌సీ ప‌రిధిలోకి రాని అంశాలు:

ఆరోగ్య బీమా పాల‌సీ ప‌రిధిలోకి రాని అంశాలు:

  • పాల‌సీ కొనుగోలుకు ముందు ఉన్న వ్యాధులు(ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్‌)

  • అందానికి మెరుగులు దిద్దేందుకు చేసే శ‌స్త్ర‌చికిత్స‌లు(కాస్మోటిక్‌)

  • క‌ళ్ల‌ద్దాలు, లెన్స్‌లు, వినికిడి ప‌రికరాల‌కు

  • దంత సంబంధ స‌మ‌స్య‌ల‌కు(ప్ర‌మాదంలో ఏదైనా జ‌రిగి దంత చికిత్స‌లు చేస్తే వాటికి వ‌ర్తిస్తాయి.)

  • గ‌ర్భ‌స్థ‌, శిశు జ‌న‌న సంబంధ‌
  • బీమా పాల‌సీ ప‌రిధిలోకి రాని అంశాలు కంపెనీని, పాల‌సీని బ‌ట్టి మారుతూ ఉండొచ్చు.
ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు

ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు

ఆరోగ్య బీమా పాల‌సీని నేరుగా ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవ‌చ్చు(తీసుకోవ‌చ్చు). లేదా బీమా ఏజెంటు(ఇన్సూరెన్స్ ఏజెంట్‌)ను సంప్ర‌దించి అయినా తీసుకోవ‌చ్చు. మ‌రో విధంగా నేరుగా బీమా కంపెనీ కార్యాల‌యానికి వెళ్లి అయినా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

బీమా మొత్తం: ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకునేట‌ప్పుడు బీమా మొత్తం(స‌మ్ అస్యూర్డ్‌) అనేది ముఖ్య‌మైన‌ది. మ‌న కుటుంబ అవ‌స‌రాల‌ను అంచ‌నా వేసుకుని దీన్ని నిర్ణ‌యించుకోవ‌చ్చు.

ప్రీమియం: పాల‌సీదారు(లు) వ‌య‌సు, ప్ర‌స్తుత ఆరోగ్య స్థితి, కుటుంబ పూర్వ వైద్య చ‌రిత్ర‌, వ్య‌క్తి అల‌వాట్లు వంటి వాటిపై ప్రీమియం ఆధార‌ప‌డి ఉంటుంది. చాలా పాల‌సీల‌కు కొనుగోలుకు ముందు వైద్య‌ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

ఆరోగ్య ప‌రీక్ష‌ల ఖ‌ర్చు

ఆరోగ్య ప‌రీక్ష‌ల ఖ‌ర్చు

ఆరోగ్య పాలసీలు ఆరోగ్య పరీక్షల ఖర్చును కూడ తిరిగి చెల్లించే వెసులుబాటును కలిగియుండవచ్చును. వేటిని అనుమ‌తిస్తారో అర్థం చేసుకోవడానికి మీ పాలసీని జాగ్రత్తగా చదవాలి. ఆసుపత్రిలో ఉండవలసిన కనీస వ్యవధిని సైతం తెలుసుకోవాలి. పాలసీ క్రింద ప్ర‌యోజ‌నం పొంద‌డానికి, ఆసుప‌త్రిలో క‌నీసం కొన్ని నిర్ణీత గంట‌లు ఉండాల‌నే నిబంధ‌న ఉంటుంది. అవసరం మామూలుగా ఇది 24 గంటలు ఉంటుంది. ఈ సమయం పరిమితి దుర్ఘటన వల్ల కలిగిన గాయాల చికిత్సలకు వర్తించకపోవచ్చును.

నగదు రహిత సౌకర్యం(క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్)

నగదు రహిత సౌకర్యం(క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్)

దేశంలోని ప్ర‌ముఖ ఆసుపత్రుల నెట్ వర్క్ తో కంపెనీలు ఒప్పందాల‌ను చేసుకొని ఉంటాయి. పాలసీ దారుడు కనుక ఆయా నెట్ వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే, అప్పుడు బీమా చేయంచుకున్న వ్యక్తి ఆసుపత్రి బిల్లులు చెల్లించాల్సిన పని లేదు. బీమాకంపెనీ తన థర్డ్ పార్టి ఎడ్మిన్ స్ట్రేటర్ (టిపిఎ) ద్వారా ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది . పాలసీ ద్వారా నిర్దారించబడిన ఉప పరిమితులను మించిన ఖర్చులు లేదా పాలసీ క్రింద క‌వ‌ర్ కాని అంశాలకు ఖర్చులు స్వ‌యంగా పాల‌సీదారే చెల్లించాలి. నెట్‌వ‌ర్క్‌ల్లో లేని ఆసుపత్రిలో కూడా చికిత్స చేయించుకోవచ్చును, అలా చేస్తే, బిల్లులను అతడు ముందుగా చెల్లి0చాలి, తరువాత బీమా కంపెనీ నుండి తిరిగి చెల్లింపును పొందాల్సి ఉంటుంది. ఇక్కడ నగదు రహిత సౌకర్యం లభ్యం కాదు.

బీమా హామీ మొత్తం ఎంత ఉండాలి

బీమా హామీ మొత్తం ఎంత ఉండాలి

వ్యక్తిగతంగానూ, కుటుంబానికి అంతటికీ కలిపి ఎంత మొత్తం ఆరోగ్య బీమా తీసుకుంటే సరిపోతుంది అనే విషయంలో పాల‌సీదారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. అవ‌స‌ర‌మైతే ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణుల స‌ల‌హా తీసుకుని బీమా హామీ మొత్తాన్ని నిర్ణ‌యించుకోవాలి. వ్య‌క్తి వయసు, పురుషుడు/మహిళ, వ్యక్తిగతం/కుటుంబం, ఇప్పటికే ఉన్న పాలసీలు, ఉన్న వ్యాధులు, కుటుంబ ఆరోగ్య చరిత్ర తదితరాలను బట్టి బీమా హామీ మొత్తం(స‌మ్ అస్యూర్డ్‌) ఆధారపడి ఉంటుంది. వైద్య పరిజ్ఞానం పెరగడంతో చికిత్సలో ఆధునిక పరికరాల వాడకం పెరిగింది. దీంతో వైద్యానికవుతున్న వ్యయమూ పెరుగుతోంది. కాబట్టి మ‌న సంపాద‌న‌ను బ‌ట్టి కాస్త ఎక్కువ బీమా హామీ మొత్తానికే పాల‌సీని కొనుగోలు చేయాల్సిందిగా సూచించడ‌మైన‌ది.

Read more about: health insurance insurance policy
English summary

ఉత్త‌మ‌మైన ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలంటే ఈ అంశాల‌ను తెలుసుకోవాల్సిందే... | Things to know Before buying a health insurance policy in India

In this time and date, it is very difficult to choose a health insurance plan, because, each one is tailor made and sold as a unique proposition.However, there are some health insurance plans that are unique and have some top features. We have chosen 6 such health insurance plans that have some great feature
Story first published: Thursday, December 1, 2016, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X