For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య బీమా మిన‌హాయింపుల‌ను తెలుసుకున్నారా?

|

వైద్యానికే ఎంతో డ‌బ్బులు ఖ‌ర్చులు పెడుతున్న భార‌త్ లాంటి దేశాల్లో ఆరోగ్య బీమా అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఏటా ఆసుప‌త్రి ఖ‌ర్చులు పెరుగుతూ ఉంటాయి. మ‌న సంపాద‌న పెరుగుద‌ల అంత మేర‌కు ఉండొచ్చు, ఉండ‌క‌పోవ‌చ్చు. హ‌ఠాత్తుగా ఆసుప‌త్రి పాల‌యితే పొదుపు చేసిన డ‌బ్బంతా ఆసుప‌త్రి బిల్లుల‌కే స‌రిపోతుంది. అందుకే ఈ సంద‌ర్భంలో ఆరోగ్య బీమా పాల‌సీ అవ‌స‌రాన్ని, పాల‌సీ ఎంచుకునేట‌ప్పుడు గ‌మనించాల్సిన అంశాల‌ను చూద్దాం.

ఆరోగ్య బీమా అంటే ఏమిటి?

ఆరోగ్య బీమా అంటే ఏమిటి?

పాల‌సీదారుడు ఆస్ప‌త్రి పాలైన‌ప్పుడు న‌గ‌దు ర‌హిత చికిత్స‌కు లేదా చికిత్స‌కు అయిన ఖ‌ర్చును తిరిగి చెల్లించేదే ఆరోగ్య బీమా పాల‌సీ. పాలసీ తీసుకునేట‌ప్పుడు బీమాదారుకు, బీమా కంపెనీకి మ‌ధ్య ఒప్పందం జ‌రుగుతుంది. అందులో ఉన్న నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చెల్లింపులు జ‌రుగుతాయి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80డీ కింద ఆరోగ్య బీమా పాల‌సీ ప్రీమియంకు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ఆల‌స్యం చేయ‌కూడ‌దు

పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ఆల‌స్యం చేయ‌కూడ‌దు

చాలా మంది విద్యావంతులు సైతం బీమా పాల‌సీ తీసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు. ప్ర‌ధాన స‌మ‌స్య ఏమిటంటే అన్ని ఫీచ‌ర్లు ఒకే పాల‌సీలో ఉండే విధంగా కావాల‌నుకోవడం. త‌క్కువ ప్రీమియానికి ఎక్కువ క‌వ‌రేజీ ఉండేలా, ఉత్త‌మ సెటిల్‌మెంట్ కలిగిన వాటి కోసం చాలా మంది వెతుకుతుంటారు. నిజానికి అలాంటి పాల‌సీలు సాధార‌ణంగా ఉండ‌వు. మామూలుగా ఆరోగ్య బీమా పాల‌సీల‌ను రూపొందించేట‌ప్పుడు చాలా క‌ఠినంగా నియమ‌నిబంధ‌న‌ల‌ను రూపొందిస్తారు. ప్రీమియం రేట్లు అంత సులువుగా అర్థం కావు. ఎందుకంటే చాలా ఫీచ‌ర్లు వాటితో అనుసంధానించ‌బ‌డి ఉంటాయి. మీరు మొత్తం 10 ఫీచ‌ర్ల కోసం చూస్తున్నార‌నుకోండి ఒక మంచి పాల‌సీ మీకు దొరికింది కానీ అందులో 8 ఫీచ‌ర్లు ఉన్నాయి, మ‌రో రెండు ఫీచ‌ర్లు అందులో లేవు. సాధార‌ణంగా ఏంచేస్తారు? మొత్తం 10 ఫీచ‌ర్లు ఉన్న పాల‌సీ కోసమే మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తారు. ఇక్క‌డే చాలా మంది త‌ప్పు చేస్తున్నారు. మీరు భావించే విధంగా ఉండే పాల‌సీ దొర‌క్క‌పోవ‌చ్చు. అప్పుడు ఏళ్ల తర‌బ‌డి పాల‌సీ తీసుకోకుండా ఉండ‌టం ఏ విధంగానూ శ్రేయ‌స్క‌రం కాదు. వీలైనంత తొంద‌ర‌గా ఎక్కువ ఫీచ‌ర్లు ఉన్న పాల‌సీని కొనుగోలు చేయాలి.

పాల‌సీ ప‌రిధిలో ఎవ‌రు ఉండాలి?

పాల‌సీ ప‌రిధిలో ఎవ‌రు ఉండాలి?

మీ కుటుంబంలో ఎవ‌రెవ‌రిని ఈ పాల‌సీ ప‌రిధిలోకి తీసుకువ‌స్తున్నారో గ‌మ‌నించాలి. అలా చేసేటప్పుడు వారి ఆరోగ్య స్థితి ఎలా ఉందో ప‌రిశీలించాలి. సాధ్య‌మైనంత వ‌ర‌కూ కుటుంబంలో అంద‌రికీ క‌వ‌ర‌య్యేలా పాల‌సీ ఉండాలి. ఒక్కోసారి బీమాదారు జీవిత భాగ‌స్వామి, పిల్ల‌ల వ‌ర‌కూ తీసుకుని త‌ల్లిదండ్రుల‌ను క‌వ‌రేజీ ప‌రిధిలోకి తీసుకురారు. ఒక‌వేళ త‌ల్లిదండ్రులు 50 లోపు వ‌య‌సు ఉండి పెద్ద‌గా ఆరోగ్య స‌మ‌స్య‌లేమీ లేకుంటే ఇదే పాల‌సీని అంద‌రికీ క‌లిపి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. వీలైతే త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య పాల‌సీని తీసుకోవ‌చ్చు.

సాధార‌ణ ఆరోగ్య ప‌రిస్థితులు ఉన్న సంద‌ర్భంలో ఫ్యామిలీ ఫ్లోట‌ర్ తీసుకోవ‌డం సూచ‌నీయం. 50 పైబ‌డి వ‌య‌సు ఉండి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు వారికి ప‌త్ర్యేక పాల‌సీ ఉండ‌ట‌మే ఉత్త‌మం.

జీవ‌న‌శైలి

జీవ‌న‌శైలి

మీరు తీసుకునే అత్యుత్త‌మ పాల‌సీ ఏంటంటే మీ ఆరోగ్యాన్ని నిత్యం ప‌రిర‌క్షించుకోవ‌డం. మీ, మీ కుటుంబ జీవ‌న‌శైలి, ఆహార అల‌వాట్ల‌ను స‌రైన రీతిలో ఉండేలా చూసుకోవాలి. నిత్యం వ్యాయామం చేసే అలవాటు, ఆరోగ్యక‌ర‌మైన ఆహారం తిన‌డం, ధూమ పానం చేయ‌క‌పోవ‌డం వంటివి ప్రాథ‌మిక జాగ్ర‌త్తలు. బీమా హామీ మొత్తాన్ని నిర్ణ‌యించేట‌ప్పుడు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మంచి జీవ‌న‌శైలి, ఆహార అల‌వాట్లు ఉన్నంత మాత్రాన ఆరోగ్య బీమా పాల‌సీ అవ‌స‌రాన్ని కొట్టిపారేయ‌లేం. మీ జీవ‌న‌శైలిలో జాగ్ర‌త్త‌ల మూలంగా అనారోగ్యం రాకుండా చూసుకోవ‌చ్చు. కానీ న‌గ‌రాల్లో ప్ర‌మాదాలు మ‌న చేతిలో ఉండ‌వు. కొన్ని వ్యాధులు ఎంత మంచి జీవ‌న‌శైలి ఉన్నారికైనా వ‌స్తూ ఉన్నాయి. అందుకే పాల‌సీ అవ‌స‌రం.

ప్రీమియం-క‌వరేజీ నిర్ణ‌యం

ప్రీమియం-క‌వరేజీ నిర్ణ‌యం

ఆరోగ్య బీమా తీసుకునేట‌ప్పుడు ఎక్కువ మంది చేసే త‌ప్పు ప్ర‌స్తుత ఖ‌ర్చుల ఆధారంగా క‌వ‌రేజీని నిర్ణ‌యించుకోవ‌డం. వ‌చ్చే 20-25 ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని క‌వ‌రేజీని లెక్కించి ప్రీమియంను నిర్ణ‌యించుకోవాలి. ఈ రోజు ఆసుపత్రి ఖ‌ర్చులు రూ. 50 వేల నుంచి రూ.3 లక్ష‌ల వ‌ర‌కూ అవుతున్నాయ‌నుకుందాం. ప్ర‌స్తుతం మీ వ‌య‌సు 30గా భావిస్తే వైద్య రంగంలో పెరిగే ఖ‌ర్చులు 7.5% గా ఉన్నాయ‌నుకుంటే ఒక 20 ఏళ్ల త‌ర్వాత అదే ఖ‌ర్చు రూ. 13 ల‌క్ష‌ల‌వుతుంది. మీ జీవన‌శైలి స‌రిగా లేక‌పోతే ఈ ఖ‌ర్చు మ‌రో 25% ఎక్కువ కూడా కావ‌చ్చు.

మిన‌హాయింపులు

మిన‌హాయింపులు

మీ ఆరోగ్య బీమా పాల‌సీలో కొన్ని ప‌రిమితులు, మిన‌హాయింపులు ఉండి ఉండొచ్చు. అంటే కొన్ని వ్యాధుల‌కు పాల‌సీ వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు మీరు స్వ‌యంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధార‌ణంగా మిన‌హాయింపులు ఈ కింది వాటికి ఉంటాయి.

* ముందుగా ఉన్న వ్యాధులు (Pre-existing disorders)

* పైల్స్‌, క్యాటారాక్ట్‌, కిడ్నీలో రాళ్లు వంటి స‌మ‌స్య‌లు

* దంత, కంటి వ్యాధులు

* కాస్మొటిక్ ఆప‌రేష‌న్‌

* ప్నెగ్న‌న్సీ సంబంధిత చెక్అప్‌లు

* నాన్‌-అల్లోప‌తిక్ చికిత్స‌

ఉప పరిమితులు / స‌హ చెల్లింపు(కో పే)

ఉప పరిమితులు / స‌హ చెల్లింపు(కో పే)

ఎక్కువ శాతం బీమా పాల‌సీల్లో ఉప ప‌రిమితులు, స‌హ చెల్లింపు నిబంధ‌న‌లు ఉంటాయి. కొన్ని చికిత్స‌ల‌కు, కొన్ని అంశాలకు బీమా హామీ మొత్తంలో కొంత శాతాన్ని ప‌రిమితిగా నిర్ణ‌యిస్తారు. పాల‌సీ తీసుకునేట‌ప్పుడు వీటిని తెలుసుకుని ఉంటే మంచిది. మీ బీమా హామీ మొత్తం(క‌వ‌రేజీ) రూ.5 ల‌క్ష‌లుగా ఉన్న‌ప్ప‌టికీ కొన్ని స‌ర్జ‌రీల‌కు మొత్తం ఖ‌ర్చులో 50% భ‌రించే విధంగా నిబంధ‌న ఉండి ఉంటే మిగిలిన 50 శాతాన్ని స్వ‌యంగా మీ చేతి నుంచి చెల్లించాలి. ఇందుకోసం పాల‌సీలో Deductible, co-pay, limits ప‌దాల గురించి స‌రిగా తెలుసుకుని ఉండాలి. ఫిజీషియ‌న్ ఫీజులు, ప్ర‌యోగ‌శాల‌ల ప‌రీక్ష‌లు, కొన్ని ప్ర‌త్యేక డ్ర‌గ్స్ వంటి వాటికి పాల‌సీదారు ఖ‌ర్చు భ‌రించాల‌ని ఉంటుంది.

నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు (నెట్‌వ‌ర్క్ హాస్పిట‌ల్స్‌)

నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు (నెట్‌వ‌ర్క్ హాస్పిట‌ల్స్‌)

అన్ని ఫీచ‌ర్లు చూసేట‌ప్పుడు నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల‌ను గ‌మ‌నించ‌డం కూడా ముఖ్యం. పాల‌సీల్లో మీకు అనుకూలంగా ఉండే న‌గ‌రాల్లో ఏ ఏ ఆసుప‌త్రుల్లో చికిత్స స‌దుపాయం ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ప్ర‌తి బీమా కంపెనీ చిరునామాతో స‌హా నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితా ఇస్తోంది. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో ఆ జాబితాను ఒక‌సారి చూడాలి. పాల‌సీ ఎంపిక‌లో ఇది ఒక అంశంగా మాత్ర‌మే ఉండాలి. అంతే కానీ ఎక్కువ ఆసుప‌త్రులు క‌చ్చితంగా ఉండాల‌నేం కాదు.

English summary

ఆరోగ్య బీమా మిన‌హాయింపుల‌ను తెలుసుకున్నారా? | What to see before taking Health insurance policy

In this time and date, it is very difficult to choose a health insurance plan, because, each one is tailor made and sold as a unique proposition. However, there are some health insurance plans that are unique and have some top features
Story first published: Monday, October 17, 2016, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X