ప్రజా భవిష్య నిధి(పీపీఎప్)పై ప్రస్తుతం 8 నుంచి 8.1 శాతం వడ్డీ వస్తోంది. ఈ వడ్డీరేటును త్రైమాసికానికి ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తుంది. కొన్నేళ్లు గడిచిన తర్వాత పీపీఎఫ్ ఖాతాపై రుణం పొందే సదుప
ప్రజా భవిష్య నిధి(పీపీఎప్)పై ప్రస్తుతం 8 నుంచి 8.1 శాతం వడ్డీ వస్తోంది. ఈ వడ్డీరేటును త్రైమాసికానికి ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తుంది. కొన్నేళ్లు గడిచిన తర్వాత పీపీఎఫ్ ఖాతాపై రుణం పొందే సదుపాయం ఉంది.
ఏ ఇతర రూపంలో తీసుకునే రుణం కన్నా ఈ రుణంపై వడ్డీ రేటు ఉత్తమంగా ఉంటుంది. వ్యక్తిగత రుణంపై ఉండే వడ్డే రేటు కన్నా కూడా ఇది తక్కువగా ఉంటుంది.

పీపీఎఫ్ రుణం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు:
పీపీఎఫ్ ఖాతా తెరిచిన మూడో ఏడాది నుంచి ఆరో ఏడాది వరకూ ఖాతాదారులు రుణం పొందవచ్చు. మొదటి ఏడాది చివరన ఖాతాలో ఉన్న మొత్తంలో 25 శాతం వరకూ మూడో ఏడాది రుణంగా పొందవచ్చు. ఉదాహరణకు నాలుగో ఏడాదిలో రెండో ఏడాది చివరన ఉన్న మొత్తంలో 25 శాతం వరకూ పొందవచ్చు.

అర్హత:
ఖాతాలో డబ్బును 7 వ ఏడాది నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉన్నందున, ఏడో ఏడాది నుంచి రుణం పొందేందుకు అర్హత ఉండదు. పీపీఎఫ్‌పై రుణాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే తీసుకునే వీలుంది.

అసలు, వడ్డీల చెల్లింపు:
తీసుకున్న రుణాన్ని 36 నెలల్లోగా తిరిగి చెల్లించాలి. రుణంలో అసలును మొత్తం ఒకేసారిగా లేదా వాయిదాల్లో చెల్లించవచ్చు. అసలును మొత్తం చెల్లించిన తర్వాత రెండు నెలల వాయిదాల్లో వడ్డీని చెల్లించాలి.

రుణంపై వడ్డీ:
పీపీఎఫ్‌పై ప్రభుత్వం ఖాతాదారులకు చెల్లించేదానికన్నా 2 శాతం ఎక్కువగా రుణ వడ్డీ ఉంటుంది.
రుణాన్ని సరైన సమయంలో చెల్లించకపోతే, డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కన్నా అదనంగా 6 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

రెండో సారి రుణం:
మొదటి రుణాన్ని మొత్తం చెల్లించిన తర్వాత ఖాతాదారులు రెండో రుణాన్ని పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాలకు ఏప్రిల్-మార్చి ఆర్థిక సంవత్సరంగా ఉంటుంది.

ఇన్‌యాక్టివ్ అకౌంట్:
ఇన్‌యాక్టివ్ అకౌంట్ ఉన్న ఖాతాదార్లు పీపీఎఫ్‌పై రుణం పొందేందుకు అర్హులు కారు. అలాంటి పీపీఎఫ్ ఖాతాపై రుణం పొందేందుకు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. పెనాల్టీతో పాటు అవసరమైన సొమ్మును చెల్లించడం ద్వారా పీపీఎఫ్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు.

పీపీఎఫ్ వడ్డీ 8%
ప్రజా భవిష్య నిధిలో కనీసం రూ. 500 మొదలుకొని రూ. 1 లక్ష 50 వేల వరకూ ఏడాది కాలంలో పెట్టుబడులు పెట్టొచ్చు. డిపాజిట్లను 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. పీపీఎఫ్ వచ్చే రాబడులను కచ్చితంగా ఎక్కువ వస్తాయని చెప్పడానికి లేదు. ప్రభుత్వ బాండ్లపై వచ్చే రాబడి ఆధారంగా ఇది మారుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పీపీఎఫ్ వడ్డీని 8%గా నిర్ణయించింది.

పన్ను ప్రయోజనాలు
పీపీఎఫ్‌లో పెట్టుబడులు ద్వారా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 1లక్షా యాభై వేల వరకూ పన్ను మినహాయింపుకు అర్హత ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్, ఐదేళ్ల ఎఫ్‌డీలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్‌లతో పాటు జీవిత బీమా ప్రీమియం, పిల్లల పాఠశాలల రుసుములు వంటి వాటికి అదనంగా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులకు అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ మీద వచ్చే వడ్డీ సెక్షన్ 10(11) కింద పూర్తిగా పన్ను లేకుండా అందుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications