For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

అత్యవసర నిధి అందరికీ అవసరమే. చాలా మంది అత్యవసర నిధి కోసం కొంత మొత్తంలో బ్యాంకులో దాచుకుంటూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే సొమ్ముని అత్యవసర నిధి అంటారు. చాలా మంది తమ పొదుపుని మ్యూచవల్ ఫండ్

By Nageshwara Rao
|

అత్యవసర నిధి అందరికీ అవసరమే. చాలా మంది అత్యవసర నిధి కోసం కొంత మొత్తంలో బ్యాంకులో దాచుకుంటూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే సొమ్ముని అత్యవసర నిధి అంటారు. చాలా మంది తమ పొదుపుని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడుతుంటారు.

అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు వీటిని అమ్మేస్తుంటారు. అయితే ఈ మ్యాచువల్ ఫండ్స్‌ను అమ్మేయాల్సిన పని లేకుండా, తనఖా పెట్టి ఏదైనా బ్యాంకు నుంచో, ఎన్‌బీఎఫ్‌సీ నుంచో తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లైతే, ఆ పత్రాల్ని తనఖాపెట్టి రుణమో, లేకపోతే ఓవర్‌డ్రాఫ్టో కావాలని మీ దగ్గర్లోని బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీని అడగొచ్చు.

మీకు అప్పుగా ఇచ్చేందుకు బ్యాంకులు ఆ మ్యూచువల్ ఫండ్స్ యానిట్లను తాత్కాలికంగా తమ పేరిట 'లీన్'లో ఉంచుకుంటాయి. లీన్ అంటే ఒక రకంగా యాజమాన్య హక్కుల్ని సదరు బ్యాంకుల పేరిట బదలాయించటమే. మీరు రుణం తీర్చలేని సందర్భంలో వాటిని విక్రయించే హక్కు బ్యాంకులకు ఉంటుంది.

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

సదరు ఫండ్ యూనిట్ల విలువను బట్టి మీకు ఎంత అప్పుగా ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఆ రుణాన్ని తిరిగి చెల్లించేశాక ‘లీన్'ను ఎత్తివేసి, యాజమాన్య హక్కుల్ని మీ పేరిట బదలాయిస్తాయి. అయితే లీన్ కోసం మీకు మ్యూచ్‌వల్ ఫండ్లు జారీ చేసిన ఫండ్ హౌస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు పేరిట సదరు యూనిట్లను లీన్ ఇవ్వాల్సిందిగా అడగాలి. ఈ మేరకు యూనిట్ల హక్కుదారు సంతకం చేసిన లేఖను ఫండ్‌హౌస్‌కు సమర్పించాలి.

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

మీ దగ్గరున్న యూనిట్లను, వాటి విలువను బట్టే కాక ఏ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తనఖా పెడుతున్నారన్న దానిపై కూడా రుణం విలువ ఆధారపడి ఉంటుంది. సహజంగా అప్పటికి ఉన్న విలువలో 50 శాతాన్ని రుణంగా పొందే అవకాశముంటుంది. కొన్ని బ్యంకులైతే ఒక పరిమితి విధించుకుంటాయి. దానిని బట్టి రుణం ఇస్తాయి. చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు షేర్లపై రుణాలిస్తుంటాయి.

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

అన్ని మ్యూచవల్ ఫండ్ యూనిట్లపైనా రుణం రాదు. బ్యాంకులు ఎంపిక చేసిన జాబితాలోని ఫండ్ యూనిట్లపై మాత్రమే రుణమిస్తూ ఉంటాయి. అనుమతించిన ఈక్విటీ, డెట్ ఫండ్ యూనిట్ల రెండింటిపైనా రుణమిస్తారు. ఎన్‌బీఎఫ్‌సీల దగ్గరకు వచ్చేసరికి 100 కోట్ల పైబడి ఆస్తులున్నవి మాత్రమే ఈ రుణాలివ్వవచ్చని ఆర్‌బీఐ చెబుతోంది.

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు

రుణం తీరేదాకా ఈ యూనిట్లను విక్రయించలేరు. కానీ వీటిపై వచ్చే డివిడెండ్ నేరుగా మీకే అందుతుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించటంలో విఫలమైతే, లీన్‌ను ఉపయోగించుకుని వాటిని విక్రయించి డబ్బులివ్వాల్సిందిగా ఫండ్ హౌస్‌ను బ్యాంకులు కోరుతాయి. చాలా మందికి మ్యూచువల్ ఫండ్లపై రుణాలు తీసుకోవచ్చని తెలియదు. దీంతో ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం లేదని, దీనివల్ల కాస్త తక్కువ వడ్డీకే రుణాలొస్తాయని బ్యాంకులు చెబుతున్నాయి.

English summary

మీకు తెలుసా?: మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం ఇస్తారు | How to get get Loan against Mutual Fund Units

Investors can pledge their units as security to financiers like Banks, Financial Institutions and thus borrow against their Mutual Fund Units. To do so, a Lien has to be marked against the Units.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X