For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను ఆదాలో మీ కుటుంబ సభ్యుల పాత్ర..?

By Nageswara Rao
|

మీరు ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో ఉన్నారా? అయితే, పన్ను మినహాయింపు పొందేందుకు మార్గాలను ఎంచుకోవడం ఎంతో కీలకమని అంటున్నారు నిపుణులు. పన్ను మినహాయింపులో మీ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎంతో కీలకం.

ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సి నిబంధన ప్రకారం పొందే రూ. లక్షన్నర పన్ను మినహాయింపులకు తోడు మార్కెట్‌‌లో అందుబాటులో ఉన్న బాండ్లపై పెట్టుబడుల ద్వారా 80 సిసిఎఫ్‌ నిబంధన ద్వారా అదనంగా మరో రూ. 20 వేల వరకూ పన్ను మినహాయింపు పొందేందుకు వీలుంది.

బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ

బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ

మీరు గనుక ఉద్యోగం చేస్తున్నట్లైతే మీ పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మీకు లభించే వడ్డీకి కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ భార్య పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసుకుంటే అతి మీకు ఎంతో ఉపయోగం.

 ఇంటి అద్దె

ఇంటి అద్దె

మీరు ఏదైనా అద్దె ఇంట నివసిస్తుంటే, దానికి కట్టే అద్దెలో, బేసిక్ వేతనంపై 50 శాతం వరకూ మినహాయింపు పొందవచ్చు. సొంతింటిలో నివసిస్తుంటే మాత్రం ఈ ఆదా ఉండదు. వాడకుండా మిగిలిన లీవులు నగదుగా మారితే దానిపై పన్ను భారం ఉండదు. ఈ విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన సమయంలో జరిగే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ జరిగితే పరిమిత మొత్తానికే పన్ను రాయితీ లభిస్తుంది.

 చిన్నారుల విద్యకు ఖర్చు పెట్టే మొత్తం

చిన్నారుల విద్యకు ఖర్చు పెట్టే మొత్తం

చిన్నారుల విద్యకు ఖర్చు పెట్టే మొత్తం (ట్యూషన్ ఫీజు)పై సంవత్సరానికి పూర్తి పన్ను మినహాయింపు (గరిష్ఠంగా, 2014-15 వరకు రూ. లక్ష, 2015-16 నుంచి రూ. 1.5 లక్షలు) పొందవచ్చు. ఇద్దరు పిల్లల వరకూ వెచ్చించే మొత్తంపై ఈ మినహాయింపులు కోరవచ్చు. దీనికోసం అన్ని రకాల డాక్యుమెంట్లనూ అడిగినప్పుడు ఆదాయపు పన్ను అధికారులకు సమర్పించాల్సి వుంటుంది.

వైద్య ఖర్చులపై

వైద్య ఖర్చులపై

దురదృష్టవశాత్తూ ఇంట్లోని వారికి అనారోగ్యం కలిగితే, వైద్య చికిత్స కోసం పెట్టిన ఖర్చులన్నింటికీ పన్ను మినహాయింపులు కోరవచ్చు. బిల్స్ సమర్పించేదాన్ని బట్టి సంవత్సరానికి రూ. 15 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. మెడికల్ అలవెన్సులు లభిస్తుంటే మాత్రం పన్ను చెల్లించాల్సిందే.

English summary

పన్ను ఆదాలో మీ కుటుంబ సభ్యుల పాత్ర..? | How Family Members Can Help Save Income Tax In India?

Tax planning at the start of the financial year is of great importance as it helps you save income tax, when you look to file your tax returns. Therefore, consider your spouse and parents who can help you save income tax by splitting your income. Let's take a look at how family members can help you save tax.
Story first published: Thursday, August 20, 2015, 13:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X