For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

By Nageswara Rao
|

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా? అంటే అలా చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్లేనని అంటున్నారు నిపుణులు. మనిషి కోరికలకు అంతం ఉండదు. కాలంతో పాటు అవి కూడా పెరుగుతూనే ఉన్నాయి. విలాసవంతంగా జీవించడం కోసం కావచ్చు లేదా అవసరాలను తీర్చుకోవడం కావచ్చు.

ముఖ్యంగా అప్పు చేసి మనకు కావాల్సినవి తీసుకున్నప్పుడు లేదా అవసరానికి మించి రుణం తీసుకొన్నప్పుడు అది మనకు ఏ విధంగా భారం అవుతుందో చూద్దాం. ప్రస్తుత సమాజంలో మారిని పరిస్ధితులను బట్టి ఖర్చు చేయడం గురించి ఎవరూ ఆలోచించడం లేదు.

దీనికి అనుగుణంగానే రుణ సంస్ధలు కూడా అప్పులను ఇస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులతో అప్పులు అవసరానికి మించి తీసుకున్నప్పుడు అవి మన ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాయి. కాగా, ఇంటి కోసం తీసుకునే రుణం మాత్రం ఆస్తులను పెంచే అప్పులుగా భావించవచ్చు.

ఇక్కడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అప్పు ఇస్తున్నారు కదా అని పెద్ద మొత్తంలో తీసుకుంటే ఇబ్బందే. భవిష్యత్తులో ఇల్లు లేదా స్ధలం విలువ భారీగా పెరిగి మంచి లాభాలు వస్తాయనే అంచనాతో చాలామంది స్థిరాస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తారు. ఇందులో కొంత నిజం ఉన్నా.. ఇతర విషయాల్లో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

మనం నివాసం ఉండేందుకు తప్పనిసరిగా ఇల్లు కావాలి. మీ దగ్గర డబ్బు ఉన్నా.. గృహరుణం తీసుకొని కొన్నా ఇందులో ఇబ్బంది ఉండదు. అయితే, భవిష్యత్తులో మరింత ధరలు పెరుగుతాయి అనే లక్ష్యంతో మొత్తం పెట్టుబడితోపాటు, రుణాలు తీసుకొని స్థిరాస్తులు కొనాలనుకున్నప్పుడు మాత్రం కాస్త పునరాలోచించుకోవాలి.
అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

ఇల్లు కొనేందుకు పెద్ద మొత్తం డబ్బు కావాలి. అయితే, ఇల్లులాంటివి కొన్నప్పుడు అద్దె రూపంలో ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ, రుణ వాయిదాలు, మీ పెట్టుబడి తదితరాలతో పోల్చినప్పుడు అది సరిపోకపోగా మీ చేతినుంచే కొంత మొత్తం చెల్లించాల్సి రావచ్చు. ఒకటి రెండు నెలలు ఖాళీగా ఉంటే అదనంగా భారం తప్పక పడుతుంది.

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

ఆస్తులను కొనడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు వాటిల్లోనే పెట్టుబడులు పెడుతూ వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీని వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదువురవుతాయి. ఉదాహారణకు పిల్లల చదువులు, పదవీ విరమణ ప్రణాళిక లాంటివి ఆలస్యం అవుతాయి. మీ సంపాదన ఎప్పుడూ నిలకడగా ఉంటుందన్న హామీ ఉండదు. దీంతో అప్పు తీసుకున్న సంస్ధకు ఈఎంఐ చెల్లించడం కష్టం కావచ్చు.

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా?

దీర్ఘకాలంలో స్థిరాస్తి పెట్టుబడులు వృద్ధికి అవకాశం ఉంది. కానీ, ఏదైనా అవసరంలో దాన్ని వెంటనే సొమ్ము చేసుకోవడం కష్టం. అన్ని లావాదేవీలు పూర్తయి చేతికి డబ్బు అందే సరికి పలు రకాల సమస్యలు ఉంటాయి. పైగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు. ధరలు అధికంగా పెరిగినప్పుడూ కొనేవారు ముందుకు రాకపోవచ్చు. కొన్నిసార్లు ధరలు తగ్గి నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

 ముగింపు

ముగింపు

రుణాలు తీసుకొని, ఆస్తులను కూడబెట్టడం అనేది అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదు. అప్పులు అధికంగా ఉండటం ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఇల్లు లేదా ఇతర స్థిరాస్తి కొనాలనుకున్నప్పుడు ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అంచనా వేసుకోసుని ముందుకు సాగితే మంచిది.

English summary

అప్పు చేసి ఆస్తులు కొనడం మంచిదేనా? | Is it good buy assets with little money

Is it good buy assets with little money.
Story first published: Wednesday, July 15, 2015, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X