For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాలంటే..!

By Nageswara Rao
|

ఉద్యోగం చేసే ఎవరైనా సరే ఏదో ఒక రోజు రిటైర్మెంట్ చేయక తప్పదు. ఇష్టం ఉన్నా లేకున్నా వయసు పైబడుతున్నకొద్దీ ఇదే జరుగుతుంది. రిటైర్మెంట్ రోజు కోసం మానసికంగా, శారీరకంగా కాకుండా ఆర్థికంగా కూడా సిద్ధంగా ఉండాలి.

25-30 ఏళ్ల వయసులో ఉన్నా, 50-55 ఏల్ల వయసు వచ్చినా రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు వేసుకోవడం మంచిది. జీవితంలో వ్యక్తుల ఆదాయం, ఆర్ధిక స్తోమత ఎప్పుడూ ఒకేలా ఉండవు. మరి ఇలాంటప్పుడు అందరికీ ఒకేలా ఆర్ధిక ప్రణాళిక ఉండదు.

రిటైర్మెంట్ తర్వాత ఎంత అవసరం

రిటైర్మెంట్ తర్వాత పెద్దగా ఖర్చులేముంటాయి? అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు వస్తున్న ఆదాయంలో కనీసం 70 శాతం వచ్చినా సరిపోతుందని అనుకుంటారు. రిటైర్మెంట్ వయసులో ఆదాయం ఉండదు గానీ, ఖర్చుల్లో మాత్రం పెద్ద తేడా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇన్సూరెన్స్

జీవిత బీమా పాలసీలు, మ్యూచవల్ ఫండ్లు, బంగారం, డెట్ పథకాల్లో మదుపు చేయాలి. భవిష్యత్తు కోసం మీరు ఎంత మొత్తం జమ చేయాలో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో రిటైర్మెంట్ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో రిటైర్మెంట్‌కు ముందు ఎంత మొత్తంలో నిధి అవసరమో చూసుకోవచ్చు.

7 Must Do Things Before You Retire

రాబడి వచ్చే పథకాల్లో పొదుపు

నష్టభయం లేని పథకాల్లో పొదుపు చేస్తే మంచిది. పెట్టుబడులను వీలైనంత తొందరగా ప్రారంభించాలి. క్రమం తప్పకుండా పెట్టుబడులను కొనసాగించాలి. పథకాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు ఆర్ధిక పరిస్ధితిని సమీక్షించుకోవాలి.

బడ్జెట్ ముందుగా వేసుకోండి

ఖర్చుల నిమిత్తం ముందుగానే కొంత మొత్తానికి పక్కనపెట్టాలి. అనుకోని అవసరాలు వచ్చినప్పుడు మీరు వీటని ఉపయోగించుకుని వెసులుబాటు ఉంటుంది.

అత్యవసర నిధి

మలివయసులో అత్యవసర నిధి ఎంతో అవసరం. వైద్య ఖర్చుల నిమిత్తం గానీ, అనుకోకుండా వచ్చిన ఖర్చులను తట్టుకోవాలంటే అత్యవసర నిధి చాలా అవసరం.

రిటైర్మెంట్‌కు ముందు మనం తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తు ఆర్ధిక ఉన్నతిపై ఆధాపడి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోకూడదు. లక్ష్యాలను గుర్తించి, వాటిని సాధించడం కోసం క్రమబద్ధంగా మదుపు చేయం ఎంతో ముఖ్యం.

English summary

రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాలంటే..! | 7 Must Do Things Before You Retire

Before entering retirement phase, one needs to be prepared to lead a financial healthy life. It is better to concentrate on portfolio, insurance and other financial products before you retire.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X