For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ది లేదు.. భారత్ బీమా రంగం నుండి వైదొలగే ఆలోచనలో అవీవా

By Nageswara Rao
|

Aviva
న్యూఢిల్లీ: బ్రిటన్ ఆర్దిక సేవల దిగ్గజం అవీవా భారత లైఫ్ ఇన్యూరెన్స్ మార్కెట్ నుండి వైదొలగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. భారత్‌లో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఆయిన డాబర్‌తో జాయింట్ వెంచర్ ద్వారా పదేళ్లుగా అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు నిర్విహిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్‌లో అవీవా ఇండియా వాటా 26 శాతం. జాయింట్ వెంచర్‌లో తన వాటాల అమ్మకానికి కొనుగోలుదారుని కోసం ప్రయత్నించే ప్రక్రియలో భాగంగా ఓ కార్పోరేట్ సలహాదారులను నియమించుకునే పనిలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ వార్తలపై అవీవా ఇండియా ప్రతినిధి మార్కెట్ ఊహాగానాలు లేదా వదంతులపై మా విధానం ప్రకారం స్పందించలేమన్నారు. 2002లో ప్రారంభమైన ఈ జాయింట్ వెంచర్ పెయిడప్ క్యాపిటల్ రూ. 2004 కోట్లు. 2011-12తో పోల్చితే, 2012-13లో అవీవా జీవిత బీమా కంపెనీల మొత్తం ప్రీమియం వసూళ్లు 11% క్షీణించి రూ. 2,140.6 కోట్లకు దిగింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరంలో మొదట్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఐఎన్‌జీ ఇంగ్ వైశ్యా లైఫ్ కంపెనీలో తన 26శాతం వాటాను యక్సైడ్‌కు విక్రయించాలని నిర్ణయించుకుంది.

ఇక గతేడాది అమెరికాకు చెందిన న్యూయార్క్ లైఫ్ కూడా భారత్ జాయింట్ వెంచర్ కంపెనీలో తన 26శాతం వాటాను జపాన్‌కు చెందిన మిత్సూయీ సుమిటోమో బీమా కంపెనీకి విక్రయించిన విషయం తెలిసిందే. భీమా రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ పరిస్దితులను తట్టుకోలేక పై రెండు కంపెనీల మాదిరి భారత్‌లో తన వాటాను విక్రయించాలనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

వృద్ది లేదు.. భారత్ బీమా రంగం నుండి వైదొలగే ఆలోచనలో అవీవా | No growth Aviva may exit life insurance business in India


 Aviva PLC is planning to pull out of its Indian insurance joint venture, valued at more than $500 million, as the British insurer retreats from less-profitable markets where it has struggled to grow its business, sources said.
Story first published: Tuesday, August 6, 2013, 14:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X