For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్‌లు

By Nageswara Rao
|

HDFC Bank and Axis Bank
న్యూఢిల్లీ: ద్రవ్య లభ్యత కఠినతరం అవ్వడంతో ప్రేవేటు రంగంలోని రెండు బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4 శాతం వరకూ పెంచాయి. రానున్న రోజుల్లో మరికొన్ని బ్యాంకులు సైతం దీనిని అనుసరించే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయం పెరుగుతున్నందున, కొన్ని బ్యాంకులు ఇచ్చే రుణాలపై సైతం వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రైవేటు రంగానికి చెందిన యస్ బ్యాంక్ బుధవారం రుణ, డిపాజిట్ రేట్లను 0.5 శాతం వరకూ పెంచింది. బేస్ రుణ రేటును పావు శాతానికి పెంచింది. దీంతో ఈ రేటు 10.75 శాతానికి చేరింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్:

దేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఆయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 రోజుల నుండి 6 నెలల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఒక శాతం వరకు పెంచింది. 6 నెలల ఒకరోజు నుంచి సంవత్సరం వరకూ రేటు 0.75 శాతం పెరిగింది. ఈ రేట్లు జులై 27 నుండి అమల్లోకి వస్తున్నట్లు ఆ బ్యాంక్ వెబ్ సైట్‌లో పేర్కొంది.

యాక్సిస్ బ్యాంక్‌:

యాక్సిస్ బ్యాంక్ 14 నుండి 29 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లకు వడ్డీ రేటు 4 శాతానికి పెంచింది. ఈ రేట్లు గురవారం నుండి అమల్లోకి వచ్చాయి. అలాగే 29 రోజులకు మించిన.. ఈ ఏడాది లోపు వేర్వేరు కాలపరిమితి కలిగి ఉండే డిపాజిట్లకు వడ్డీ రేటును 0.5 శాతం నండి 2.25 శాతం వరుక పెంచింది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్‌లు | HDFC Bank, Axis Bank raise fixed deposit rates by up to 4%

Country's second largest private sector lender HDFC Bank has raised fixed deposit rates by 1 per cent for maturities between 15 days to 6 months one day effective July 27, as per information available on its website.
Story first published: Friday, August 2, 2013, 15:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X