For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై తక్కువ వడ్డీ రేటును అందించే 10 బ్యాంకులు, ఈఎంఐలు

|

ఆర్థిక అత్యవసరాల కోసం చాలామంది తీసుకునే రుణాల్లో పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ వంటివి ఉంటాయి. మీరు మీ ఆర్థిక అవసరాల కోసం మీ ఇంటిలోని బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ పొందవచ్చును. మీరు మీ రుణాన్ని క్లియర్ చేసేవరకు మీ బంగారం రుణదాత వద్ద భద్రంగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువమంది పర్సనల్ లోన్ తీసుకుంటారు. కానీ పర్సనల్ లోన్ కంటే బంగారం సెక్యూర్డ్ రుణం కాబట్టి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. మన దేశంలో చాలా బ్యాంకులు, నాన్-ఫైనాన్సింగ్ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే బంగారం రుణాలు అందిస్తున్నాయి. సాధారణంగా తాకట్టు పెట్టిన బంగారం పైన మార్కెట్ వ్యాల్యూలో 75 శాతం వరకు రుణం ఉంటుంది.

పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్ బెట్టర్

పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్ బెట్టర్

మీరు బంగారంపై రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీల ఆధారంగా వివిధ రుణదాతలను పోల్చుకోవడం మంచిది. గోల్డ్ లోన్ తీసుకునే ముందు మీ బంగారం వ్యాల్యూ, స్వచ్ఛతను చెక్ చేసుకోవాలి. అన్ని బ్యాంకుల్లో రుణాలను పరిగణలోకి తీసుకొని, ఎక్కడ మీకు వడ్డీ రేటు తక్కువగా ఉంది, ఎక్కడ మీకు అనుకూల కాలపరిమితి ఉంది, ఎక్కడ మీకు తగిన ఈఎంఐ ఉందో చూసుకోవాలి. మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తే కనుక ఈ కింద తక్కువ వడ్డీ రేటును అందించే పది బ్యాంకులు, ఆ బ్యాంకుల వడ్డీ రేటు ఇలా ఉంది...

వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు

వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు

రెండేళ్ల కాలానికి, రూ.2.5 లక్షల రుణానికి వడ్డీ రేటు, ఈఎంఐ ఇలా ఉంటుంది.

Punjab & Sind Bank - 7.00% - ఈఎంఐ రూ.11,193

State Bank of India - 7.00% - ఈఎంఐ రూ.11,193

Punjab National Bank - 7.25% - ఈఎంఐ రూ.11,222

Canara Bank - 7.35% - ఈఎంఐ రూ.11,333

Indian Bank - 8.00% - ఈఎంఐ రూ.11,307

Bank of India - 8.40% - ఈఎంఐ రూ.11,353

Karnataka Bank - 8.49% - ఈఎంఐ రూ.11,363

UCO Bank - 8.50% - ఈఎంఐ రూ.11,364

Federal Bank - 8.50% - ఈఎంఐ రూ.11,364

HDFC Bank - 8.50% - ఈఎంఐ రూ.11,364

వడ్డీ రేటు

వడ్డీ రేటు

పైన పేర్కొన్న వడ్డీ రేటు విషయానికి వస్తే ఆయా బ్యాంకుల్లోని కనీస వడ్డీ రేటు అది. మీ బంగారం వ్యాల్యూ, లోన్ టు వ్యాల్యూ రేషియో వంటి అంశాల ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయి. అలాగే, మీరు ఎంచుకున్న బ్యాంకు నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.

తాక‌ట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ వ్యాల్యూలో 75 శాతం వ‌ర‌కు రుణం ఇస్తారు. బంగారం ధ‌ర‌లు త‌గ్గితే, మీరు పొందే రుణ మొత్తం కూడా త‌గ్గుతుంది. కాబ‌ట్టి బంగారు రుణాలను తీసుకునే ముందు బంగారం ధ‌ర‌ల‌ను చెక్ చేసుకోవ‌డం మంచిది. బంగారం ధ‌ర‌లు త‌గ్గితే, బ్యాంకు మ‌రింత బంగారాన్ని తాక‌ట్టు పెట్ట‌మ‌ని అడగవచ్చు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకుల‌తో పాటు ఎన్బీఎఫ్‌సీలు బంగారు రుణాల‌ను అందిస్తాయి. ఇత‌ర రుణాల్లాగే మీ అవ‌స‌రాలు, రుణాన్ని తిరిగి తీర్చే సామ‌ర్థ్యానికి అనుగుణంగా రుణ మొత్తాన్ని నిర్ణ‌యించుకోవాలి. ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితికి బంగారు రుణం చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అయితే రుణాన్ని స‌కాలంలో చెల్లించాలి. రుణ మొత్తం తీర్చ‌డానికి గ‌డువు అయిపోయినా కూడా తీర్చ‌లేక‌పోయి, డిఫాల్డ్ అయితే మీ తాక‌ట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చు. అపుడు మీ విలువైన ఆస్తిని నష్టపోతారు. బంగారు రుణాన్ని తీసుకోవాల‌ని భావిస్తే, వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-క్లోజ‌ర్ ఛార్జీలు ఎంత ఉంటాయనేది చూసుకోవాలి. కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు ఆఫ‌ర్‌ల‌ను పరిశీలించాలి.

English summary

బంగారంపై తక్కువ వడ్డీ రేటును అందించే 10 బ్యాంకులు, ఈఎంఐలు | 10 banks offering the lowest Gold loan interest rates right now

Gold loan is one of the most popular and easiest ways to address any kind of financial emergencies. You can avail a loan by pledging your household gold as collateral with a financial institution.
Story first published: Wednesday, December 8, 2021, 19:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X