home loan interest: 10 బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో గత కొద్దిరోజులుగా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. పర్సనల్ లోన్ నుండి హోం లోన్ వరకు వడ్డీ రేట్లు తగ్గాయి. రుణాలు తీసుకునే వారికి ఇది గుడ్ న్యూస్. వడ్డీ రేటు తగ్గడం వల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు(రీజినల్ రూరల్ బ్యాంకులు మినహాయించి), లోకల్ ఏరియా బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ తమ రుణాలపై వడ్డీ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్‌మార్కుకు లింక్ చేయాలి. ఇది అక్టోబర్ 1, 2019 నుండి అమలులోకి వచ్చింది. చాలా బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటు ఆధారిత వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి.
ITR filing:ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. 'జాట్పట్ ప్రాసెసింగ్' ప్రారంభం

రిస్క్ ప్రీమియం
రెపో రేటుతో లింక్ చేసిన వడ్డీ రేట్లను రెపో రేటు లింక్డ్ లెండింగ్ రేట్(RLLR)గా పేర్కొంటారు. రెపో రేటును ఆర్బీఐ ప్రతి రెండు నెలలకు ఓసారి సవరించే అవకాశం ఉంటుంది. గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఆరు శాతానికి పైగా ఉన్న వడ్డీ రేటు, ఇప్పుడు 4 శాతానికి వచ్చింది. ఒక నిర్దిష్ట బ్యాంకు వసూలు చేసే స్ప్రెడ్ ఛార్జ్ ఒకే రకంగా ఉంటుంది. రిస్క్ ప్రీమియం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు వేతన జీవుల కంటే స్వయంఉపాధి రుణగ్రహీతల నుండి ఎక్కువ రిస్క్ ప్రీమియం ఛార్జ్ చేస్తాయి.

ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు అంటే
ఉద్యోగులకు ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు...
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో RLLR వడ్డీరేటు 6.80 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.70 శాతం, గరిష్ట వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంది.
కొటక్ మహీంద్ర బ్యాంకులో RLLR వడ్డీరేటు 6.75 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.75 శాతం, గరిష్ట వడ్డీ రేటు 8.35 శాతంగా ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో RLLR వడ్డీరేటు 6.85 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.85 శాతం, గరిష్ట వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో RLLR వడ్డీరేటు 6.85 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.85 శాతం, గరిష్ట వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో RLLR వడ్డీరేటు 6.85 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.85 శాతం, గరిష్ట వడ్డీ రేటు 7.30 శాతంగా ఉంది.
యాక్సిస్ బ్యాంకులో RLLR వడ్డీరేటు 6.90 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.90 శాతం, గరిష్ట వడ్డీ రేటు 8.40 శాతంగా ఉంది.
బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో RLLR వడ్డీరేటు 6.90 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.90 శాతం, గరిష్ట వడ్డీ రేటు 8.35 శాతంగా ఉంది.
కెనరా బ్యాంకులో RLLR వడ్డీరేటు 6.90 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.90 శాతం, గరిష్ట వడ్డీ రేటు 8.85 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకులో RLLR వడ్డీరేటు 6.95 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.90 శాతం, గరిష్ట వడ్డీ రేటు 7.95 శాతంగా ఉంది.
ఐడీబీఐ బ్యాంకులో RLLR వడ్డీరేటు 6.90 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 6.90 శాతం, గరిష్ట వడ్డీ రేటు 7.00 శాతంగా ఉంది.

ప్రాసెసింగ్ ఫీజు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ మొత్తం పైన ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతంగా ఉంది. గరిష్టం రూ.15000.
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం నుండి 0.50 శాతం. కనీసం రూ.8500, గరిష్టం రూ.25000
బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం. కనీసం రూ.1500/- గరిష్టం రూ.20000/-
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాసెసింగ్ ఫీజు 0.50%. గరిష్టం రూ.20,000/-
కెనరా బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం. కనీసం రూ.1,500, గరిష్టం రూ.10,000/-
ICICI బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం, కనీసం రూ.1,500
IDBI బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ..2,500/- కనీసం Rs.15,000/- (ప్లస్ GST)
కొటక్ మహీంద్ర బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు గరిష్టం 2% + GST, ఇతర ఛార్జీలు డాక్యుమెంటేషన్ ఛార్జీలు రూ.10,000
యాక్సిస్ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు. కనీసం రూ.10000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం. గరిష్టం రూ.25,000/-