For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుకర్‌బర్గ్ పక్కావ్యూహం.. ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం!? ఢీకొట్టేవారే లేరు

|

సోషల్ మీడియా అంటే దాదాపు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్. అయినప్పటికీ జుకర్ బర్గ్ కొత్త కొత్త ప్లాట్‌ఫామ్స్‌ను ప్రారంభించడం ద్వారా లేదా కొనుగోళ్లు చేయడం ద్వారా తన వ్యాపారాన్ని రోజురోజుకు విస్తరించుకున్నారు.. విస్తరించుకుంటున్నారు. ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్స్ వచ్చినప్పటికీ.. వాటి నుండి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ జుకర్ బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లను ఏవీ రీచ్ కాలేకపోతున్నాయి. ఒకవిధంగా జుకర్‌బర్గ్ సోషల్ మీడియాదే గుత్తాధిపత్యం.

సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు!సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు!

ఫేస్‌బుక్, వాట్సాప్ లీడ్

ఫేస్‌బుక్, వాట్సాప్ లీడ్

జూలై 2020 నాటికి జుకర్ బర్గ్ నియంత్రణలో ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్స్ 6.98 బిలియన్ యూజర్లకు పైగా కలిగి ఉంది. అంటే దాదాపు 7 బిలియన్ డాలర్లు. ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒక వ్యక్తి ఒకటికి మించి అకౌంట్స్ కలిగి ఉంటారు. ఇందులో ఫేస్‌బుక్ 2.6 బిలియన్ యూజర్లను కలిగి ఉంది. ప్రపంచ జనాభాలో ఇది 34.66 శాతం. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫేస్‌బుక్ టాప్‌లో ఉంది. వాట్సాప్ 2 బిలియన్ యాక్టివ్ యూజర్లతో మూడో స్థానంలో ఉంది. జుకర్ బర్గ్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియాలలో రెండో స్థానం సంపాదించింది. ఫేస్‌బుక్ మెసెంజర్ 1.3 బిలియన్ యూజర్లను కలిగి ఉండి నాలుగో స్థానంలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ 1.08 బిలియన్ యూజర్లతో గ్లోబల్ యాక్టివ్ యూజర్లలో ఆరో స్థానంలో ఉంది.

15 మోస్ట్ పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఇవే..

15 మోస్ట్ పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా టాప్ 15 సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫేస్‌బుక్ మొదటి స్థానంలో ఉంది. అక్షరాలా 2,603 మిలియన్ల యూజర్లు (2.6బిలియన్) ఉన్నారు. ఆ తర్వాత వాట్సాప్‌కు 2,000 మిలియన్లు, యూట్యూబ్ 2,000 మిలియన్లు, ఫేస్‌బుక్ మెసెంజర్ 1,300 మిలియన్లు, విచాట్ 1,203 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్ 1,082 మిలియన్లు, టిక్‌టాక్ 800 మిలియన్లు, క్యూక్యూ 694 మిలియన్లు, సినా వీబో 550 మిలియన్లు, క్యూజోన్ 517 మిలియన్లు, రెడ్డిట్ 430 మిలియన్లు, కౌషౌ 400 మిలియన్లు, స్నాప్‌చాట్ 397 మిలియన్లు, పిన్‌టెరెస్ట్ 367 మిలియన్లు, ట్విట్టర్ 326 మిలియన్ల యాక్టివ్ యూజర్లు కలిగి ఉన్నారు. కాగా, పై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కొన్ని ఏడాదిగా అప్ డేట్ చేయనివి ఉన్నాయి. అలాగే కొన్నింటి డేటా థర్డ్ పార్టీ నుండి సేకరించింది.

టాప్ 15 సైట్లలో జుకర్ బర్గ్ సంస్థలదే సగం వాటా!

టాప్ 15 సైట్లలో జుకర్ బర్గ్ సంస్థలదే సగం వాటా!

టాప్ 15 సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జుకర్ బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్లు 6.98 బిలియన్లతో 47.8 శాతం వాటాను దక్కించుకుంది. అంటే దాదాపు సగం జుకర్ బర్గ్ నాలుగు సైట్లదే హవా. అందులో ఫేస్‌బుక్ వాటానే మూడొంతులు. టాప్ 15లోని మిగతా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల యాక్టివ్ యూజర్లు 7.68 బిలియన్లు. మిగతా సైట్స్ అన్నీ కలిపి కేవలం అర బిలియన్ కంటే ఎక్కువ మాత్రమే ఉన్నాయి. మొత్తంగా టాప్ 15 సైట్స్ కలిపి 14.6 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

కొనుగోలు.. కాపీ.. దేనికైనా రెడీ

కొనుగోలు.. కాపీ.. దేనికైనా రెడీ

జుకర్ బర్గ్ సోషల్ మీడియాలో పక్కా వ్యాపార ధోరణితోనే ముందుకు సాగుతున్నాడు. కొత్తవి ప్రారంభించడం లేదా కొనుగోలు చేయడం లేదా పోటీ సోషల్ సైట్ల ఫ్యూచర్స్‌ను అనుకరించడం వంటి మార్గాల్లో పయనించడంతో పెద్ద ఎత్తున యూజర్ బేస్ ఉంది. ఉదాహరణకు ఫేస్‌బుక్ తన పోటీ సైట్ స్నాప్‌చాట్ ఫీచర్స్‌ను కాపీ చేసిందని చెబుతారు. ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్‌లకు ఎన్నింటినో జోడించింది. స్నాప్ చాట్ నమూనా తీసుకు వచ్చింది.

ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం.. నిరోధించాలి

ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం.. నిరోధించాలి

జుకర్ బర్గ్‌కు చెందిన సోషల్ మీడియా సైట్స్ ఆధిపత్యం పూర్తిగా కనిపించడంతో పరిశ్రమలో పోటీ ప్రశ్న నెలకొంది. భవిష్యత్తులో ఫేస్‌బుక్ ఇతర నెట్ వర్క్స్‌ను కొనుగోలు చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అప్పుడే పోటీతత్వం ఉంటుందని అంటున్నారు. కాంపిటీటర్స్‌ను కొనుగోలు చేస్తున్నందున ఫేస్‌బుక్‌కు తిరుగు లేకుండా పోయిందని, పోటీదారులు లేకుండా పోయారని పరిశ్రమలోని పలువురి వాదన. యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది. ఫేస్‌బుక్ దీనికి ధీటుగా మరో ప్లాట్‌ఫాంను తీసుకురాకముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే యూట్యూబ్‌తో పాటు ఫేస్‌బుక్‌లో వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్-టిక్‌టాక్

ఫేస్‌బుక్-టిక్‌టాక్

2017లో ప్రారంభమైన టిక్‌టాక్ (మాతృసంస్థ బైట్ డ్యాన్స్) వేగంగా వృద్ధి సాధిస్తోంది. ఈ జనరేషన్ వారి అలవాట్లు, ప్రాధాన్యతలను ఫేస్‌బుక్ కంటే వేగంగా అర్థం చేసుకొని ముందుకు సాగుతోంది. టిక్‌టాక్‌కు పోటీగా ఫేస్‌బుక్ కొత్తగా షార్ట్ వీడియో యాప్ లాస్సోను లాంచ్ చేసింది. ఆ తర్వాత అది క్లోజ్ అయింది. అయితే భారత్, అమెరికా సహా వివిధ దేశాల్లో ప్రస్తుతం టిక్‌టాక్ ఎదుర్కొంటున్న పరిణామాలు ఫేస్‌బుక్‌కు ప్రయోజనకరమే. అమెరికా సహా వివిధ దేశాల్లో టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోంది.

English summary

జుకర్‌బర్గ్ పక్కావ్యూహం.. ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం!? ఢీకొట్టేవారే లేరు | Zuckerberg owned social networks control almost 7 billion users

Since hitting the scene with Facebook, Mark Zuckerberg has over the years expanded his catalog of social networks by either launching new ones or strategically acquiring established platforms. The social networks under his name have faced serious competition in the battle for users, but it appears he still has an edge.
Story first published: Wednesday, August 12, 2020, 18:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X