For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon: నెలకు రూ.60 వేలు ఆదాయం.. అమెజాన్ బంపర్ అవకాశం.. ఇందుకు ఏమి కావాలంటే..?

|

Amazon: ఈ రోజుల్లో చాలా మంది తమ ఊరికి దగ్గరలోనే ఉద్యోగం ఉంటే బాగుంటుంది అని భావిస్తున్నారు. పైగా వర్క్ ఫ్లెక్సిబిలిటీ విషయానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అలా నెలకు దాదాపు రూ.60 వేల వరకు సంపాదించేందుకు అమెజాన్ ఒక సదవకాశాన్ని అందిస్తోంది. దీనికోసం పెద్దపెద్ద డిగ్రీలు కూడా చదవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్ తో ఆదాయం..

అమెజాన్ తో ఆదాయం..

దేశంలో ప్రముఖ ఆన్ లైన్ ఈ-కామర్స్ సైట్ గా ఉన్న అమెజాన్ ఎంత భారీ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తోందో మనందరికీ తెలిసిందే. ప్రజల్లో ఆన్ లైన్ షాపింగ్ కు ఆదరణ పెరగటం.. చాలా మందికి ఈ ఉపాధి అవకాశాన్ని కల్పించింది. అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీ వంట సామాను నుంచి అనేక గృహోపకరణాల వరకు లక్షల ఉత్పత్తులను అమ్ముతుంటుంది. వీడిని డెలివరీ చేయటానికి దేశవ్యాప్తంగా దానికి డెలివరీ బాయ్స్ చాలా అవసరం. పైగా ప్రస్తుతం పండుగల సమయం కావటంతో డిమాండ్ మరింతగా పెరిగింది.

పని ఏమిటి..

పని ఏమిటి..

అయితే దీనిని మంచి ఉపాధి అవకాశంగా మలుచుకుని అమెజాన్ సంస్థకు డెలివరీ ఏజెంట్ గా మారేందుకు ఇదే సరైన సమయం. దీని ద్వారా ప్రతి నెల మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఎంపికైన వ్యక్తులు అమెజాన్ వేర్ హౌస్ నుంచి పార్సిళ్లను కస్టమర్ల అడ్రెస్ లకు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డెలివరీ బాయ్ సగటున రోజుకు 100 నుంచి 200 మధ్య ప్యాకేజీలను డెలివరీ చేస్తుంటారు. కొంతమంది పార్ట్ టైం కూడా ఈ పనిని నిర్వహిస్తున్నారు. ఇది వారికి అదనపు ఆదాయవనరుగా మారింది.

నగరాల్లో అధిక డిమాండ్..

నగరాల్లో అధిక డిమాండ్..

దేశంలోని ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై , బెంగళూరు, కోల్ కతా వంటి పెద్ద నగరాల్లో డెలివరీ ఏజెంట్లకు భారీగా డిమాండ్ ఉంది. కానీ ప్రస్తుతం ఈ కల్చర్ గ్రామాల స్థాయికి సైతం చేరుకుంది. కాబట్టి చిన్న టౌన్లలోని యువత సైతం ఈ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇందుకోసం కావలసింది కేవలం బైక్, లైసెన్స్ మాత్రమే. డెలివరీ చేస్తున్న ప్రాంతంపై అవగాహన ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ డెలివరీలను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం అమెజాన్ ఫ్లెక్స్ అప్లికేషన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆదాయం ఇలా..

ఆదాయం ఇలా..

డెలివరీ ఏజెంట్లకు కంపెనీ ఒక్కో ప్యాకేట్ కు విడివిడిగా అందిస్తుంది. పైగా వీరికి నెలకు కనీస జీతం రూ.15 వేల వరకు ఉంటుంది. కాబట్టి దీనిని మంచి ఆదాయ వనరుగా మార్చుకోవటానికి రోజుకు కనీసం 100 డెలివరీలను పూర్తి చేస్తే సెలకు మెుత్తం రూ.60 వేల వరకు సంపాదించుకోవచ్చు. పైగా అదనపు సమయం కేటాయించి ఎక్కువ డెలివరీలు చేసే వారికి కమిషన్ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు వెసులుబాటు ఉంటుంది. పండుగల సీజన్ కాబట్టి డెలివరీలు ఎక్కువ సంఖ్యలేనే ఉంటాయి.

Read more about: amazon jobs business news
English summary

Amazon: నెలకు రూ.60 వేలు ఆదాయం.. అమెజాన్ బంపర్ అవకాశం.. ఇందుకు ఏమి కావాలంటే..? | Youth can earn upto 60000 per month working as amazon delivery agent in festive season

Youth can earn upto 60000 per month working as amazon delivery agent in festive season
Story first published: Tuesday, November 8, 2022, 10:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X