ఆరోగ్య బీమా ప్రీమియంను వాయిదా పద్ధతుల్లో వసూలు చేసుకోవడానికి బీమా సంస్థలకు భారతీయ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. జనజీవనం అంతా స్తంభించడంతో ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
లాక్ డౌన్ సమయంలో ఆరోగ్య బీమా ప్రీమియం పాలసీదారులకు ఇది ఊరటను కలిగించే విషయం. ప్రస్తుతం ఎంతోమందికి ఆదాయం లేకపోవడం లేదా తగ్గిన పరిస్థితుల్లో వాయిదా పద్ధతిలో ఆరోగ్య బీమా చెల్లింపులను స్వీకరించే విధంగా బీమా కంపెనీలకు వెసులుబాటు కలిగించడం గమనార్హం. నెలా, త్రైమాసికం, ఆరు నెలల చెల్లింపులకు అవకాశం కల్పించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

పాలసీ ప్రీమియం, ప్రోడక్ట్ ఆధారంగా బీమా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని సూచించింది. ధ్రవీకరణ ప్రాతిపదికన, వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉత్పత్తుల్లో ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను జోడించేందుకు బీమా సంస్థలకు గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే IRDAI అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రజలు సులభంగా చెల్లించేందుకు వీలుగా బీమా సంస్థలు వాయిదా పద్ధతుల్లో ప్రీమియం వసూలు చేసుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications