For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు సూపర్, ప్రపంచంలో మేమే: ముఖేష్ అంబానీకి డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార వ్యూహాలకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ముగ్ధుడయ్యారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. తమ దేశంలో కూడా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ట్రంప్ మంగళవారం భారత వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీం ద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్‌ చంద్రశేఖరన్, ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన, మరిన్ని వాణిజ్య కథనాలు

అంబానీపై ట్రంప్ ప్రశంసలు

అంబానీపై ట్రంప్ ప్రశంసలు

భారత్‌లో టెలికం రంగాన్ని, అమెరికాలో ఇంధనరంగంలో తన వ్యూహాత్మక పెట్టుబడులపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ట్యాక్స్-ఫ్రీ దేశమైన తమ అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ముఖేష్ అంబానీని అగ్రదేశాధినేత కోరారు. అదే సమయంలో అంబానీ కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు.

గ్రేట్ జాబ్...

గ్రేట్ జాబ్...

'మీరు అద్భుతమైన పని తీరు కనబరిచారు. థ్యాంక్స్' అని ట్రంప్.. అంబానీని ఉద్దేశించి అన్నారు. అంతకుముందు ఆయన అమెరికాలో, భారత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన పెట్టుబడులను క్లుప్తంగా వివరించారు.

చాలా పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేశారు

చాలా పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేశారు

తాము అమెరికాలో ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టామని, 7 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేశామని ముఖేష్ అంబానీ చెప్పారు. దీనిపై ట్రంప్ వెంటనే స్పందిస్తూ... '7 బిలియన్ డాలర్లా.. యా.. చాలా పెద్ద మొత్తం' అన్నారు.

4G సూపర్..

4G సూపర్..

ఆ తర్వాత ట్రంప్.. ముఖేష్ అంబానీతో మాట్లాడుతూ 4G విషయంలో బాగా పని చేస్తున్నారని, 5Gని కూడా అడాప్ట్ చేయబోతున్నారా అని అడిగారు.

ప్రపంచంలో రిలయన్స్ జియో ఒకే ఒక్కటి..

ప్రపంచంలో రిలయన్స్ జియో ఒకే ఒక్కటి..

ట్రంప్ ప్రశ్నకు అంబానీ స్పందిస్తూ... ఒక్క చైనీస్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా లేకుండా ప్రపంచంలోనే 5G ట్రయల్స్ నిర్వహిస్తున్న ఒకే ఒక్క నెట్ వర్క్ రిలయన్స్ జియో మాత్రమే అన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. చాలా బాగుందని కితాబిచ్చారు.

ట్రంప్‌పై అంబానీ ప్రశంసలు

ట్రంప్‌పై అంబానీ ప్రశంసలు

తక్కువ పన్ను రేటు అంశంపై ట్రంప్ మీద ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. అమెరికా బిజినెస్ ఫ్రెండ్లీ దేశమని కొనియాడారు. కాగా, రిలయన్స్ జియో నాలుగేళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చి పెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. శాంసంగ్ తర్వాత జియో మాత్రమే నాన్-చైనీస్ ఎక్విప్‌మమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కలిగి ఉంది.

నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం..

నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం..

వ్యాపార సమాజం సహాయకారిగా ఉందని, అమెరికాలో కంపెనీలు అక్వైజేషన్, అప్రూవల్స్ వేగంగా సాగుతున్నాయని, భారతీయ కంపెనీలకు కూడా ఇది అలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నానని ముఖేష్ అంబానీ అన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కొనసాగుతుందని చెప్పారు.

నేను గెలిస్తేనే..

నేను గెలిస్తేనే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను తిరిగి ఎన్నికైతే అది కొనసాగుతుందని, మరొకరు అయితే మాత్రం పరిస్థితి మారుతుందని, అంతా ఆగిపోతుందని ట్రంప్ అన్నారు. అంతేకాదు, నిరుద్యోగిత రేటు పెరుగుతుందని, నష్టపోవాల్సి ఉంటుందన్నారు.

English summary

మీరు సూపర్, ప్రపంచంలో మేమే: ముఖేష్ అంబానీకి డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు | You have done a great job on 4G, energy: Trump to Mukesh Ambani

Commending RIL Chairman and Managing Director Mukesh Ambani for transforming India's telecom sector and his strategic investment in the energy sector in the US, President Donald Trump on Tuesday invited him to invest in his tax friendly country.
Story first published: Wednesday, February 26, 2020, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X