For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF: ప్రతి నెలా 5 వేల రూపాయల పెట్టుబడితో రూ.16 లక్షలు సంపాదించ్చొచ్చు..!

|

కచ్చితమైన రాబడితో కూడిన ప్రభుత్వ పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. సుదీర్ఘ పెట్టుబడి పథకాల్లో పీపీఎప్ ముందు ఉంటుంది. ఇందులో 15 సంవత్సరాల పైబడి పెట్టుబడి పెట్టొచ్చు. పోస్టాఫీసు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకు శాఖల్లో ఈ పీపీఎఫ్‌ ఖాతాను తెరవొచ్చు. 18 సంవత్సరాలు నిండిన భార‌తీయ పౌరులు ఎవ‌రైనా పీపీఎఫ్‌లో ఖాతాను తెరిచి పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఖాతా తెర‌వ‌డానికి గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి లేదు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెర‌వాలి. చిన్న పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు.

పీపీఎఫ్‌ ఖాతాను తెరిచేటప్పుడు ఖాతాదారుని పాన్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ, లేటెస్ట్‌ పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, పూర్తి చేసిన దరఖాస్తు ఫారం అవసరం ఉంటుంది. మైనర్‌ దరఖాస్తు అయితే పై పత్రాలే కాకుండా, జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల కేవైసీ వివరాలు కావాలి. పీపీఎఫ్‌ మెచ్యూరిటీ కాలవ్యవధి 15 ఏళ్లు. ఉదాహరణకు మీరు 2020 జనవరి 1న పీపీఎఫ్ ఖాతా తెరిస్తే 2035లో మెచ్యూరిటీ అవుతుంది. ఆ తర్వాత 5 సంవత్సరా చొప్పున పొడిగించుకోవచ్చు.

 You can earn Rs.16 per month with an investment of Rs.5000 in PPF scheme

పీపీఎఫ్ లో ఒక సంవత్సరం కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు పెట్టుబడి పెట్టొచ్చు. మైన‌ర్ పిల్లలు ఉంటే.. తల్లిదండ్రులు వారి పేరు మీద ఖాతా తెరవొచ్చు. అయితే, మైనారిటీ తీరిన తర్వాత వారే ఖాతాను నిర్వహించుకోవాలి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్‌ 80సీ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వ‌ర‌కు చేసిన పీపీఎఫ్ డిపాజిట్‌పై ఆదాయ‌పు ప‌న్ను మినహాయింపు క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. మీ ఉద్యోగ సంస్థకు ఈ వివరాలను అందించి, లేదా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్(ఐటీఆర్‌) ఫైల్ చేసేట‌ప్పుడు సెక్షన్‌ 80సీ కింద ఈ ప‌న్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

 You can earn Rs.16 per month with an investment of Rs.5000 in PPF scheme

కొద్ద రోజుల క్రితం పీపీఎఫ్ ఖాతాల నిబంధనలు మారుస్తూ భారత ప్రభుత్వం ఐదు కీలక మార్పులను చేసింది. 15 ఏళ్ల తర్వాత కూడా డబ్బులు కట్టకపోయినా పీపీఎఫ్ అకౌంట్ ను కొనసాంగిచవచ్చు. అప్పడు తప్పనిసరిగా డబ్బులు డిపాజిట్ చేయాలనే రూల్ ఏమీ ఉండదు.పీపీఎఫ్ అకౌంట్ ఆధారంగా లోన్ తీసుకోవాలనుకుంటే.. మన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ లో 25 శాతం మాత్రమేయ తీసుకోగలము. అది కూడా లాస్ట్ రెండు సంవత్సరాల నగదును కౌంట్ చేసి లోన్ తీసుకోవచ్చునో లేదో నిర్ధారిస్తారు.

 You can earn Rs.16 per month with an investment of Rs.5000 in PPF scheme

అలాగే పీపీఎఫ్ లోన్ మీద ఉన్న ఇంట్రస్ట్ రేటును కూడా తగ్గించారు. ఇది రెండు శాతం నుంచి ఒక శాతానికి తగ్గించారు. అంటే అసలు మొత్తం చెల్లించే లోపు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇంట్రస్ట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్రస్ట్ ప్రతీ నెలా మొదటి తేదీన కాలిక్యులేట్ చేస్తారు.

మీరు ప్రతి నెలా 5 వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఏడాదికి 60 వేల రూపాయలు జమ అవుతాయి. పీపీఎఫ్‌ కాలిక్యులేటర్ ప్రకారం.. 15 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి రూ.9 లక్షలు అవుతుంది. ఈ పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీతో 7.27 లక్షలు పొందుతారు. 15 ఏళ్ల తర్వాత మీరు మొత్తం రూ.16 లక్షలు పొందుతారు.

English summary

PPF: ప్రతి నెలా 5 వేల రూపాయల పెట్టుబడితో రూ.16 లక్షలు సంపాదించ్చొచ్చు..! | You can earn Rs.16 per month with an investment of Rs.5000 in PPF scheme

This PPF account can be opened in post office, public sector banks and leading private sector bank branches. Any Indian citizen who has completed 18 years of age can open an account in PPF and invest.
Story first published: Saturday, November 26, 2022, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X