2020 సంవత్సరంతో పాటు, 2021లోను ఇప్పటివరకు బిట్ కాయిన్ వ్యాల్యూ ఆకాశాన్ని అంటింది. ఈ ఏడాది మార్చి నెల నాటికి ఈ క్రిప్టోకరెన్సీ ఏకంగా 61,000 డాలర్లు క్రాస్ చేసింది. గతేడాది డిసెంబర్ చివరలో కాస్త తగ్గినట్లుగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ గరిష్టం 48,000 డాలర్లు, 58,000 డాలర్లకు ఎగిసిపడింది. చివరకు ఈ నెలలో 61,000 డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ ఇలా పుంజుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి.

అందుకే బిట్ కాయిన్ వ్యాల్యూ జంప్
కరోనా మహమ్మారి సమయంలో బంగారం అంతకంతకూ పెరిగింది. దీంతో కొంతమంది ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ పైన పెట్టుబడులు పెట్టారు. దీంతో బిట్ కాయిన్ కాస్త పరుగు పెట్టింది. ఆ తర్వాత ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఇంక్ బిట్ కాయిన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మాస్టర్ కార్డ్ వంటి కంపెనీలు కూడా బిట్ కాయిన్‌కు అనుకూలంగా నిర్ణయాలు ప్రకటించాయి. ఇలా వరుసగా దిగ్గజ కంపెనీలు బిట్ కాయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పరుగులు పెట్టి, చివరకు 61వేల డాలర్లు దాటింది.

బిట్ కాయిన్ 85 శాతం, ఇరీడియం 131 శాతం
బిట్ కాయిన్ ఈ త్రైమాసికంలో 85 శాతం వృద్ధి సాధించింది. అయితే ఇదే కాలంలో మరో మెటల్ ఇరీడియం మాత్రం ఏకంగా 131 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పత్తికి అనేక ఆటంకాలు ఉండటం, ఉత్పత్తిదారులు తక్కువగా ఉండటం, డిమాండ్ మాత్రం ఎక్కువగా ఉండటం వల్ల దీని ధర ఇంతలా పెరిగినట్లు చెబుతున్నారు. ఇరీడియంను ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ స్క్రీన్స్, స్పార్క్ ప్లగ్స్ వంటి పరికరాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

బంగారం కంటే ఎక్కువ ఖరీదు
జాన్సన్ మాథే పీఎల్‌సీ డేటా ప్రకారం స్పార్క్ ప్లగ్స్‌లో కూడా ఉపయోగించే ఇరీడియం ఔన్స్‌కు 6000 డాలర్లకు చేరుకుంది. ఇది బంగారం కంటే ఎక్కువ ఖరీదైనది. ఇది ఉద్గారాలను అరికట్టడానికి ఆటోకేటలిస్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పెట్టుబడిదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి వ్యతిరేకంగా కొత్త హైడ్రోజన్ టెక్నాలజీల నుండి ప్లాటినం డిమాండ్‌లో పెరుగుదలను అంచనా వేస్తారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications