For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yes bank crisis: వచ్చే ఆర్థిక సంవత్సరంలోను ఎన్పీఏ కష్టాలు

|

యస్ బ్యాంకుకు మరో ఏడాది పాటు అంటే 2020-21 ఏడాదిలోను ఎన్పీఏ కష్టాలు ఉండనున్నాయి. అయితే కొత్తగా సమకూరనున్న రూ.10,000 కోట్ల ఈక్విటీ మూలధనంతో ఆ కష్టాల నుంచి గట్టెక్కుతామని యస్ బ్యాంకు సీఈవోగా నియమితులైన ప్రశాంత్ కుమార్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల్లో బ్యాంకు మొత్తం రుణాల్లో మూడవ వంతు ఎన్పీఏలే అన్నారు. బ్యాంకులో ఉన్న రూ.137 లక్షల కోట్ల డిపాజిట్లలో రూ.72,000 కోట్లకు పైగా డిపాజిట్లను డిపాజిటర్లు వెనక్కి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా యస్ బ్యాంకులో మరో బ్యాంకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఐడీఎప్‌సీ ఫస్ట్ బ్యాంకు రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు బోర్డు డైరెక్టర్లు ఈ నెల 14న ఆమోదం తెలిపినట్లు బ్యాంకు తెలిపింది. రూ.10 ముఖ విలువ కలిగిన 25 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది.

కరోనాతో ఫుడ్ ఆర్డర్ చేయలేకపోతున్నారా: మీ కోసమే 'కాంటాక్ట్‌కరోనాతో ఫుడ్ ఆర్డర్ చేయలేకపోతున్నారా: మీ కోసమే 'కాంటాక్ట్‌

YES Bank says NPA troubles to continue in FY21

సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకులో ఎస్బీఐ, ఐసీసీఐసీఐ, హెచ్‌డీఎప్‌సీ, కొటక్ మహీంద్రా, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకులు పెట్టుబడి పెట్టనున్నాయి. బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకులు చెరో రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

బంధన్ బ్యాంకు దీని ప్రకారం రూ.2 ముఖ విలువ కలిగి ఉన్న షేరును రూ.8కి అధికంగా అంటే రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. యస్ బ్యాంకులో రూ.300 కోట్ల పెట్టుబడికి ఫెడరల్ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. బ్యాంకులోని 30 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. యస్ బ్యాంకు లిమిటెడ్‌లో 30 కోట్ల ఈక్విటీ షేర్లను, ఒక్కో షేరుకు రూ.10 చొప్పున రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

యస్ బ్యాంకులో 49 శాతం వాటాను కొనుగోలు చేయాలని ఇప్పటికే ఎస్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌స, ఐసీఐసీఐ చెరో రూ.1000 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ.600 కోట్లు, కొటక్ మహంద్రా బ్యాంకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి.

English summary

Yes bank crisis: వచ్చే ఆర్థిక సంవత్సరంలోను ఎన్పీఏ కష్టాలు | YES Bank says NPA troubles to continue in FY21

YES Bank expects pressures from sour loans, which led it to declare the highest loss for any private sector lender at Rs 18,654 crore for the December quarter, to continue even in FY21, but CEO-designate Prashant Kumar is confident of its survival after a Rs 10,000-crore capital infusion.
Story first published: Monday, March 16, 2020, 14:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X