For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా, చైనా సహా ఈ దేశాలతో భారత్‌లోనే ప్రయాణాలు ఆగిపోయాయి

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రయాణాలు ఆగిపోయాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ప్రయాణాల పైన ఎక్కువ ప్రభావం పడినట్లు ఈవై సర్వేలో వెల్లడైంది. మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ విధించడంతో పాటు విమాన ప్రయాణాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తొమ్మిది నెలలుగా కరోనా కారణంగా అత్యధిక ప్రయాణాలు నిలిచిపోయినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు ఈవై తెలిపింది.

<strong>అప్పుడే చైనా కంటే భారత్ చౌకగా తయారు చేయగలదు, ఉద్యోగాలపై అది సరికాదు</strong>అప్పుడే చైనా కంటే భారత్ చౌకగా తయారు చేయగలదు, ఉద్యోగాలపై అది సరికాదు

భారత్‌లోనే తక్కువ...

భారత్‌లోనే తక్కువ...

చైనా, అమెరికా సహా 9 దేశాల్లో పని, సామాజిక, గృహ ప్రయాణాలను పరిగణలోకి తీసుకుంటే భారత్‌లోనే ఎక్కువగా తగ్గిపోయినట్లు ఈ సర్వే తెలిపింది. ప్రయాణాలు తగ్గిపోవడంతో వివిధ నగరాల్లో కాలుష్యం కూడా తగ్గినట్లు ఈ సర్వే తెలిపింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం వంటి వివిధ కారణాలతో జనాలు ప్రయాణానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కొంతమంది కార్యాలయాలకు సొంత వాహనాలపై వెళ్తున్నారని, దీంతో స్వయం ప్రతిపత్తి లభించినట్లయిందన్నారు. రాకపోకలకు ప్రజలు వెచ్చించే సమయం మిగులుతోందన్నారు.

ప్రయాణం ఎంత తగ్గిందంటే

ప్రయాణం ఎంత తగ్గిందంటే

భారత్ విషయానికి వస్తే వర్క్ ట్రావెల్ దాదాపు 69 శాతం తగ్గిందని ఈ సర్వేలో వెల్లడైంది. సామాజిక ప్రయాణాలు 59 శాతం, గృహ ప్రయాణాలు 58 శాతం పడిపోయాయి. స్వీడన్ వంటి దేశంలో ప్రయాణ క్షీణత 70 శాతం ఉండగా, భారత్‌లోను దాదాపు అంతే ఉంది. స్వీడన్ జనాభా 1 కోటి కాగా, భారత జనాభా 138 కోట్లు. లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షల నేపథ్యంలో ప్రయాణ క్షీణత భారీగా నమోదయినట్లు తెలిపింది.

ఈ దేశాల్లో సర్వే

ఈ దేశాల్లో సర్వే

ఒక్కో వ్యక్తి వారానికి చేసే సరాసరి ప్రయాణ సమయం 40 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఇది ఆరు గంటల నుండి 3.7 గంటలకు పరిమితమైందని తెలిపింది. ఈ సర్వేను ఈ నెలలోనే చేసింది. మొబిలిటీ కన్స్యూమర్ ఇండెక్స్‌లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్, చైనా, అమెరికా, యూకే, ఇటలీ, సింగపూర్, సౌత్ కొరియా, స్వీడన్, జర్మనీ ఉన్నాయి.

English summary

అమెరికా, చైనా సహా ఈ దేశాలతో భారత్‌లోనే ప్రయాణాలు ఆగిపోయాయి | Work travel sees highest fall in India among large economies

Mobility restrictions due to the coronavirus and emergence of trends around home/remote office, education and entertainment have decluttered Indian cities that have seen a sharp reduction in travel in the months since the lockdown.
Story first published: Friday, November 27, 2020, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X