For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Work From Home: IT ఉద్యోగులకు పెద్ద ఊరట.. కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్స్.. కంపెనీల డిమాండ్‌..

|

Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇండస్ట్రీ డిమాండ్‌పై చర్చించిన తర్వాత.. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆర్థిక మండలి 2006లో వర్క్ ఫ్రమ్ హోమ్- 43A కొత్త నిబంధనను నోటిఫై చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. ఉద్యోగి గరిష్ఠంగా ఒక సంవత్సరం పాటు ఇంటి నుంచి పని చేయవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు విషయంలో ఏదైనా కంపెనీ.. గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందించే వెసులుబాటును వాణిజ్య మంత్రిత్వ శాఖ కల్పించింది.

స్పెషల్ ఎకనామిక్ జోన్ల విషయంలో..

స్పెషల్ ఎకనామిక్ జోన్ల విషయంలో..

వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల ప్రకారం.. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నియమాలు స్పెషల్ ఎకనామిక్ జోన్ లేదా SEZ యూనిట్ల కోసమని పేర్కొంది. అంటే.. ఈ ప్రాంతాల్లో స్థాపితమైన కంపెనీలు ఇప్పటి నుంచి మారిన నిబంధనల ప్రకారం తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించవచ్చు.

IT ఉద్యోగులకు ప్రయోజనం..

IT ఉద్యోగులకు ప్రయోజనం..

న్యూ రూల్స్ ప్రకారం.. కొన్ని వర్గాల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయవచ్చు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), IT కి సంబంధించిన ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. తాజా నిబంధన ప్రకారం.. తాత్కాలికంగా విధులకు రాలేని ఉద్యోగులు మాత్రమే ఇంటి నుంచి పని చేయగలరని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

పరిశ్రమ డిమాండ్‌పై ప్రభుత్వ ఆమోదం..

పరిశ్రమ డిమాండ్‌పై ప్రభుత్వ ఆమోదం..

ఇండస్ట్రీ వర్గాలు చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో డిమాండ్ చేస్తోందని, వాటిని పరిగణలోకి తీసుకుని కొత్త నోటిఫికేషన్ జారీ చేయబడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అన్ని SEZ లు సమానంగా అమలు చేయాల్సి ఉంది. 50 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందించాల్సి వస్తే.. అందుకు అనుమతి పొందటానికి కంపెనీలు ఉద్యోగుల సంఖ్య, వర్క్ ఫ్రమ్ హోమ్ అందించటానికి గల కారణాలను SEZ డెవలప్‌మెంట్ కమిషనర్‌కు అందించి పర్మిషన్ తీసుకోవచ్చని కేంద్రం తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది .

English summary

Work From Home: IT ఉద్యోగులకు పెద్ద ఊరట.. కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్స్.. కంపెనీల డిమాండ్‌.. | Work From Home latest rules announced by Commerce Ministry is a big relief for IT employees

New Work-From-Home Rules Announced By Commerce Ministry
Story first published: Thursday, July 21, 2022, 12:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X