For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ఫ్రమ్ హోమ్ భేష్, చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్!: బిల్‌గేట్స్

|

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రారంభమైన వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి బాగా పని చేస్తోందని, వైరస్ ముగిసిన తర్వాత కూడా చాలా కంపెనీలు దీనిని కొనసాగిస్తాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కానీ ఇది బాగా వర్క్ అవుతోందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ఐటీ సంస్థలు సహా వివిధ రంగాల్లో వెసులుబాటు ఉన్న అన్ని సంస్థలు ఇంటి నుండి పనిని ఇచ్చాయి. టీసీఎస్ వంటి కంపెనీలు రానున్న అయిదేళ్లలో 75 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా చూస్తామని చెబుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉత్పాదక పెరిగినట్లు ఎక్కువ కంపెనీలు చెబుతున్నాయి.

<strong>ఉద్యోగాల కోత, జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోం ఇబ్బందులు...: ఐటీ సంస్థలపై సర్వే</strong>ఉద్యోగాల కోత, జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోం ఇబ్బందులు...: ఐటీ సంస్థలపై సర్వే

ఆఫీస్‌లు తెరిచినా.. ఎంతమంది రావాలి...

ఆఫీస్‌లు తెరిచినా.. ఎంతమంది రావాలి...

'వర్క్ ఫ్రమ్ హోమ్ ఆశ్చర్యపరిచేలా బాగా వర్క్ అవుతోందని, మహమ్మారి ముగిసిన తర్వాత కూడా దీనిని కొనసాగిస్తారు' అని భావిస్తున్నానని బిల్ గేట్స్ ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన ఆన్‌లైన్ బిజినెస్ సమ్మిట్‌లో చెప్పారు. అయితే ఈ మహమ్మారి ముగిసిన అనంతరం కార్యాలయాలలో ఎంత శాతం మంది ఉండాలనే అంశంపై ఆలోచించాల్సి ఉందన్నారు. 20 శాతమా, 30 శాతమా లేక 50 శాతమా.. ఎంతమందిని కార్యాలయాల నుండి పని చేయించాలనే అంశంపై దృష్టి సారించాలన్నారు. చాలా కంపెనీలు 50 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులు కార్యాలయాలకు రప్పించే అంశాన్ని పరిశీలిస్తాయన్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో కష్టంగా..

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో కష్టంగా..

వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి సంస్కృతి భేషుగ్గా ఉందని, కరోనా అంతం తర్వాత ఆఫీసులకు ఎంత శాతం సమయాన్ని వెచ్చించాలనే దానిపై పునరాలోచన చేయాలన్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచమంతా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరింతగా సన్నద్ధం కావాలని అభిప్రాయపడ్డారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, ఇళ్లు చిన్నగా ఉన్నప్పుడు.. ఇలా వివిధ ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ఆ సమయంలో పని చేయడం కష్టంగా మారుతుందన్నారు. మహిళల విషయంలో మరిన్ని ఇబ్బందులు ఉంటాయన్నారు.

చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్

చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్

ఈ 2020లో తాను వర్క్ కోసం ఇప్పటి వరకు వర్క్ కోసం ప్రయాణించలేదని తెలిపారు. నిజం చెప్పాలంటే తనకు చాలా సమయం దొరికిందని తెలిపారు. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తికి సంబంధించి బిల్ గేట్స్ మాట్లాడుతూ.. వైరస్ అంశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో చైనా విఫలమైందని వాదనలకు ఇది సమయం కాదని, అది సమయం వృథా చేయడమే అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ లాక్ డౌన్ విధించిందని, ఆ సమయంలో డిజిటల్ మార్గంలో మనీ ట్రాన్సుఫర్, రేషన్ వంటి అద్బుతమైన పనులు చేసిందని కితాబిచ్చారు.

English summary

వర్క్ ఫ్రమ్ హోమ్ భేష్, చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్!: బిల్‌గేట్స్ | Work from home culture to continue even after COVID pandemic ends: Bill Gates

The work from home culture has worked well and many companies will continue with the system even after the coronavirus pandemic ends, billionaire philanthropist Bill Gates said on Wednesday.
Story first published: Thursday, September 24, 2020, 8:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X